News
News
X

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Movie Review : 'కలర్ ఫోటో'తో కథానాయకుడిగా మారిన సుహాస్ నటించిన తాజా సినిమా 'రైటర్ పద్మభూషణ్'. ఈ సినిమా ఎలా ఉందంటే?

FOLLOW US: 
Share:

సినిమా రివ్యూ : రైటర్ పద్మభూషణ్
రేటింగ్ : 3/5
నటీనటులు : సుహాస్, టీనా శిల్ప రాజ్, ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి, గోపరాజు రమణ, శ్రీ గౌరీ ప్రియ తదితరులు 
ఛాయాగ్రహణం : వెంకట్ ఆర్ శాకమూరి
నేపథ్య సంగీతం, స్వరాలు : కళ్యాణ్ నాయక్
స్వరాలు : శేఖర్ చంద్ర  
నిర్మాతలు : అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్
రచన, దర్శకత్వం : షణ్ముఖ ప్రశాంత్
విడుదల తేదీ: ఫిబ్రవరి 3, 2023

'కలర్ ఫోటో'తో సుహాస్ (Suhas) కథానాయకుడిగా మారారు. అంతకు ముందు కొన్ని సినిమాల్లో క్యారెక్టర్లు చేశారు. అంతకు ముందు ఛాయ్ బిస్కెట్ యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేశారు. ఇప్పుడు సుహాస్, ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలయికలో 'రైటర్ పద్మభూషణ్' (Writer Padmabhushan Review) వచ్చింది. ఈ చిత్రంలో టీనా శిల్ప రాజ్ హీరోయిన్. హీరో తల్లిదండ్రులుగా రోహిణి, ఆశిష్ విద్యార్థి నటించారు. ఈ సినిమా ఎలా ఉందంటే?

కథ (Writer Padmabhushan Movie Story) : పద్మభూషణ్ (సుహాస్) విజయవాడలోని లైబ్రరీలో ఉద్యోగి. రైటర్ పద్మభూషణ్ అనిపించుకోవాలనేది అతని కోరిక. ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా ఓ పుస్తకం రాస్తాడు. నాలుగు లక్షలు అప్పు చేసి మరీ పబ్లిష్ చేస్తాడు. పేరు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ వేస్తాడు. ఆ పుస్తకం సక్సెస్ కాదు. అయితే, అతడి పేరు మీద ఎవరో పుస్తకం పబ్లిష్ చేస్తారు. ఒక బ్లాగ్ కూడా మైంటైన్ చేస్తారు. అది సూపర్ సక్సెస్ అవుతుంది. దాంతో డబ్బులున్న మేనమామ పిల్లను ఇవ్వడానికి ముందుకు వస్తాడు. మరదలు సారిక (టీనా శిల్ప రాజ్)పై పద్మభూషణ్ మనసు పారేసుకుంటాడు. మరదలు సారికను వదులుకోకూడదని అనుకోవడంతో పాటు తల్లిదండ్రుల ముఖాల్లో సంతోషం, తనకు లభిస్తున్న పేరు చూసి ఆ పుస్తకం రాశానని అబద్ధం చెబుతాడు. అసలు... పద్మభూషణ్ పేరు మీద పుస్తకం రాసింది ఎవరు? అతడు రాయలేదనే నిజం తెలిసిన తర్వాత సారిక, తల్లిదండ్రులు ఎలా స్పందించారు? పద్మభూషణ్ ఎన్ని కష్టాలు ఫేస్ చేశాడు? ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అనేది మిగతా సినిమా. ఆ ప్రశ్నలకు సమాధానాలు వెండితెరపై చూసి తెలుసుకోవాలి. 

విశ్లేషణ : ప్రతి ఒక్కరికీ ఓ కల ఉంటుంది. దానిని సాకారం చేసుకోవడం కోసం ఎంత కష్టమైనా పడాలనే తపన ఉంటుంది. కష్టపడకుండా కల నెరవేరితే? ఈజీగా మన పాకెట్ పేరు, ప్రతిష్ఠలతో నిండితే? మనసులో నిజాయితీ నిండిన వ్యక్తి అయితే... తనది కాని జీవితంలో అడుగులు వేయడానికి సందేహిస్తూ సంకోచిస్తాడు. అయితే, తాను ప్రేమించిన అమ్మాయి, అమ్మానాన్నల కోసం తప్పటడుగు వేసే ప్రమాదం ఉంది. అటువంటి యువకుడి కథే 'రైటర్ పద్మభూషణ్'. 

'రైటర్ పద్మభూషణ్' పతాక సన్నివేశాల వరకు ప్రేక్షకుడు ఇదొక సగటు యువకుడి కథని ఫీలవుతాడు. అయితే, అసలు విషయం ఆ తర్వాత తెలుస్తుంది. ఇదొక అమ్మ కథ అని! ఇంతకు మించి చెబితే ట్విస్ట్ రివీల్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి స్పాయిలర్స్ ఇవ్వడం లేదు. నిజం చెప్పాలంటే... థియేటర్లో ప్రేక్షకుడు కాస్త ఆలోచిస్తే ఇంటర్వెల్ ట్విస్ట్ కంటే ముందు క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించవచ్చు. మొదటి పది పదిహేను నిమిషాలు చూశాక చివరికి హీరో ఏం చేస్తాడనేది చెప్పవచ్చు. అంత రెగ్యులర్ రొటీన్ స్క్రీన్ ప్లే, సన్నివేశాలతో సాగే చిత్రమిది. మరి, ఇంకేముంది? అని ఆలోచిస్తే... క్లైమాక్స్!

సుహాస్, రోహిణి నుంచి దర్శక నిర్మాతల వరకూ... అందరూ ఆ క్లైమాక్స్ మీద నమ్మకం పెట్టుకుని సినిమా చేశారు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి... చివరి పదిహేను నిమిషాలు మనల్ని మర్చిపోయి, అప్పటి వరకు జరిగిన కథను మర్చిపోయి మనసుతో సినిమా చూస్తాం. అంతలా క్లైమాక్స్ సీన్ కదిలిస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ప్రేమకథ, ఆ తర్వాత వచ్చే ఫ్యామిలీ సన్నివేశాల్లో పెద్దగా పస లేదు. ఆ విధంగా చేయడం కరెక్టేనా? కాదా? అనే సందేహం కూడా మనకు రాదు. చాలా లాజిక్స్ గాలికి వదిలేశారు.కాకపోతే... థియేటర్‌లో హీరో హీరోయిన్ సీన్ వంటివి కొన్ని గట్టిగా పేలతాయి. కొన్ని చోట్ల కామెడీ బాగుంది. పాటలు బావున్నాయి. నేపథ్య సంగీతం కూడా! సినిమాటోగ్రఫీ ఓకే.  

నటీనటులు ఎలా చేశారంటే? : సినిమాలో సుహాస్ హీరో. అయితే, సగటు తెలుగు సినిమా హీరోలా ఎక్కడా కనిపించలేదు. స్నేహితుడితో చెంపదెబ్బ తినే సన్నివేశం చేశారు. రంగు మీద సెటైర్ వేసుకున్నారు. డ్యాన్సులు చేశారు. ఇవన్నీ పక్కన పెడితే... సగటు యువకుడు తెరపై ఉన్నది తానేనని ఫీలయ్యేలా నటించారు. ఇక, నటిగా రోహిణి మరోసారి మెరిశారు. అమ్మగా ఆవిడ చాలా మంచి పాత్రలు చేశారు. అయితే, ఇందులోని పతాక సన్నివేశాల్లో కంటతడి పెట్టిస్తారు. ప్రేక్షకుల మదిలో చిన్న ఆలోచన రేకెత్తిస్తారు. తండ్రిగా ఆశిష్ విద్యార్థి కనిపించడం కొత్తగా ఉంటుంది. టీనా శిల్ప రాజ్, శ్రీ గౌరీ ప్రియ... అమ్మాయిలు ఇద్దరూ క్యారెక్టర్లకు సూట్ అయ్యారు. గోపరాజు రమణ, ఇతరులు పాత్రల పరిధి మేరకు చేశారు.  

Also Read : 'హంట్' రివ్యూ : షాక్ ఇచ్చిన సుధీర్ బాబు, సినిమా ఎలా ఉందంటే?

చివరగా చెప్పేది ఏంటంటే? : ప్రతి వారం రెండు మూడు కంటే ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. వాటిలో 'రైటర్ పద్మభూషణ్'కు ఎందుకు వెళ్ళాలి? అంటే... అమ్మ కోసం! కథ, కథనాలు పక్కన పెడితే... అక్కడక్కడ నవ్వించడంతో చివర్లో మనసు పొరలో తడిని బయటకు తీసుకొచ్చే చిత్రమిది. అమ్మను ఓ మాట అడగాలని మనలో ఆలోచన తీసుకొచ్చే చిత్రమిది. క్లైమాక్స్ సీన్ ఒక్కటీ టికెట్ రేటుకు న్యాయం చేస్తుంది. వీలైతే అమ్మతో చూడండి. 

Also Read : 'పఠాన్' రివ్యూ : కింగ్ ఖాన్ షారుఖ్ ఈజ్ బ్యాక్! మరి, సినిమా ఎలా ఉంది?

Published at : 03 Feb 2023 07:08 AM (IST) Tags: ABPDesamReview Writer Padmabhushan Review Suhas Movie Review Rohini Molleti Writer Padmabhushan OTT

సంబంధిత కథనాలు

Dasara Collections: ‘దసరా’ అడ్వాన్స్ బుకింగ్ అదుర్స్ - నాని కెరీర్‌లో సరికొత్త రికార్డు!

Dasara Collections: ‘దసరా’ అడ్వాన్స్ బుకింగ్ అదుర్స్ - నాని కెరీర్‌లో సరికొత్త రికార్డు!

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Silk Smitha Poster: ‘దసరా’ మూవీలో సిల్క్ స్మితా పోస్టర్ వెనుక ఇంత కథ ఉందా - అసలు విషయం చెప్పేసిన దర్శకుడు

Silk Smitha Poster: ‘దసరా’ మూవీలో సిల్క్ స్మితా పోస్టర్ వెనుక ఇంత కథ ఉందా - అసలు విషయం చెప్పేసిన దర్శకుడు

Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!

Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!

Parineeti Chopra Wedding: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత

Parineeti Chopra Wedding: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?