Viral News: పెళ్లికి ముందు అయినా తాగాలి..తర్వాత అయినా తాగాలి.. పెళ్లి రోజే తాగితే ఈ పెళ్లికొడుకు గతే !
Bareilly: పెళ్లి అవుతుందన్న ఆనందంతో తాగేశాడు ఆ వరుడు. కానీ ఆ తాగుడు వల్లే ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది.

Drunk Groom: పెళ్లంటే నూరేళ్ల పంట. అయితే ఆ పంట పండాలంటే కనీసం పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోకుండానే పంట పండిపోయిందని పార్టీలు చేసుకుంటే.. మొదటికే మోసం వస్తుంది. బరేలీకి చెందిన ఈ పెళ్లికొడుక్కి అది బాగా అవగతమయింది.
మద్యం మత్తులో ఉన్న వరుడు పెళ్లి దండను వధువు మెడలో వేయడానికి బదులుగా తన స్నేహితుడి మెడలో వేశారు. దాంతో వధువు అతనితో పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి పెళ్లిని రద్దు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఈఘటన జరిగింది. [
बरेली-नशे में धुत दूल्हे ने दोस्त के गले में डाली वरमाला, दूल्हे को नशे में देखकर दुल्हन ने शादी से किया इनकार
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) February 24, 2025
दुल्हन के इनकार के बाद परिजनों ने की शिकायत, दूल्हा उसके पिता और 3 दोस्तों का किया चालान
पुलिस ने 5 लोगों का शांतिभंग में किया चालान, पीलीभीत के बरखेड़ा से क्योलड़िया… pic.twitter.com/t4rDR94N3b
యూపీలోని బరేలి శివార్లలో ఉన్న క్యోల్డియా అనే ఊళ్లో పెళ్లి బారాత్ జరుగుతూ వచ్చింది. పెళ్లి మండపం దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత దండను తీసి వధువు మెడలో వేయాల్సిన వరుడు సోయి తెలియకుండా మిత్రుడి మెడలో వేశాడు. దాంతో వధువుకు డౌట్ వచ్చింది. వాసన చూస్తే.. మద్యం తాగి వచ్చాడని అర్థం చేసుకుంది. వెంటనే ఏ మాత్రం మొహమాటం లేకుండా పెళ్లిని రద్దు చేసుకుని బారాత్ వెనక్కి పంపేశింది.
ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నప్పుడు కూడా ఆ పెళ్లికొడుక్కి సోయి రాలేదు. తినడానికి ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు. ఈ వీడియో వైరల్ అయింది.
అయితే పోలీసుల జోక్యంతో వధువు కుటుంబ సభ్యులు ఆమెను పెళ్లికి ఒప్పించడానికి ప్రయత్నించారు, కానీ ఆమె ఒప్పుకోలేదు. చివరికి వధువు తండ్రి కేసు పెట్టారు. దాంతో ఆ తాగుబోతు వరుడి కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపులు, బహిరంగ అవమానాల కేసు నమోదు చేశారు. వరుడు, అతని తండ్రి మరియు మరో ముగ్గురు కుటుంబ సభ్యులు సహా మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
संदर्भित प्रकरण में थाना क्योलड़िया, बरेली पर प्राप्त तहरीर के आधार पर सुसंगत धाराओं में अभियोग पंजीकृत कर शांति एवं कानून व्यवस्था के दृष्टिगत आरोपी के विरुद्ध निरोधात्मक कार्यवाही की गयी है।
— Bareilly Police (@bareillypolice) February 24, 2025
ఇటీవలి కాలంలో చాలా మంది యువతులు తాగుబోతు పెళ్లి కొడుకుల్ని ఏ మాత్రం సహించడం లేదు. పెళ్లికి తాగేసి వస్తే పీటల మీద పెళ్లిని క్యాన్సిల్ చేసేసుకుంటున్నారు. గతంలోలా ఏం చేసినా భరించడం లేదని.. ఇప్పుడు ఆడపిల్లల్లో తెగింపు కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.





















