Kohli Hand Band: కోహ్లి చేతికి నయా రిస్ట్ బ్యాండ్.. అందరి దృష్టి దానిపైనే.. రొనాల్డో, టైగర్ వుడ్స్, ప్రిన్స్ విలియం కూడా..
Virat Kohli: సెంచరీ చేశాక కోహ్లీ హెల్మెట్ తీసి చేయి పైకెత్తినప్పుడు చేతికి ఉన్న బ్యాండ్ ఆకర్షించింది. చాలామంది దాన్నో ఫిట్ నెస్ ట్రాకర్ అని అనుకుంటున్నారు. కాదు. అంతకుమించి అని తెలుస్తోంది.

Ind vs Pak Updates: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్లతో గెలిచిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ (100 నాటౌట్) తో సత్తా చాటడంతో టీమిండియా సునాయాసంగా గెలుపొందింది. అయితే సెంచరీ చేశాక కోహ్లీ హెల్మెట్ తీసి చేయి పైకెత్తినప్పుడు ఒక నల్లని బ్యాండ్ అందరి దృష్టిని ఆకర్షించింది. చాలామంది దాన్నో ఫిట్ నెస్ ట్రాకర్ అని అనుకుంటున్నారు. కాదు. అంతకుమించి, అని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వీవీఐపీలు, సెలెబ్రిటీలు ఈ రిస్ట్ బ్యాండు ను ధరిస్తారు. వూప్ అనే పేరు గల ఈ బ్యాడ్ ఫిట్ నెస్ ప్రపంచంలో ప్రకంపనలు రేకెత్తిస్తోంది. ఫుట్ బాల్ సెలెబ్రిటీ క్రిస్టియానో రొనాల్డో, మేటి గోల్ఫర్ టైగర్ వుడ్స్, బ్రిటిష్ యువరాజు ప్రిన్స్ విలియం తదితరులు ఈ బ్యాండును ధరిస్తున్నారు. దీంతో ఈ బ్యాండ్ పై చాలా క్రేజ్ పెరిగి పోయింది. తాజాగా కోహ్లీ చేతికి ఇది కన్పించడంతో చాలామంది ఫోకస్ దీనిపై పడింది.
Prince William was seen wearing the Whoop fitness tracker, a device known for its high-tech biometric data tracking, including heart rate, temperature, and sleep patterns. The Whoop band is popular among athletes like LeBron James and Rory McIlroy.https://t.co/yIZ9eECzHU
— Isa (@isaguor) July 8, 2024
ఏంటి దీని ప్రత్యేకత..?
ఈ రిస్టు బ్యాండులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని ఫిట్నెస్ నిపుణులు పేర్కొంటున్నారు. దీన్ని ధరించడం ద్వారా రియల్ టైమ్ స్ట్రెస్ లెవల్స్, రికవరీ రేటు, ఓవరాల్ ఫిజికల్ దృఢత్వం లాంటివి చెక్ చేసుకోవచ్చు. దీని ద్వారా తమ ట్రైనింగ్, ఫర్ఫార్మెన్స్ లాంటివి మెరుగు పర్చుకోవచ్చు. దీన్ని2015లో విల్ అహ్మద్ అనే వ్యకి స్థాపించారు. దశాబ్ధ కాలంగా ఫిట్ నెస్ ప్రపంచంలో సత్తా చాటుతోంది. తాజాగా వూప్ 4.0 పేరుతో బ్యాండ్ రిలీజ్ అయింది. దీనికి అనుసంధానంగా రియల్ టైమ్ కోచ్ ను కూడా ఏఐ సాయంతో కంపెనీ అందిస్తోంది. దీంతో లెవల్స్ ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, తగిన సలహాలు సూచనలు పొందవచ్చు. ఇండియాలో కూడా దీని సేవలు ప్రారంభమయ్యాయి. ఏడాదికి 19, 598 రూలతో మెంబర్ షిప్ తీసుకుంటే బ్యాండ్ తోపాటు లైఫ్ టైమ్ వాలిడిటి, యాప్ కు యాక్సెస్ ను అందిస్తుంది. రెండేళ్లకు 33,308 రూ.ల అమౌంట్ ను చార్జ్ చేస్తోంది.
రొనాల్డో తో ఒప్పందం..
గ్లోబల్ స్పోర్ట్స్ సెలెబ్రిటి అయిన ఫుట్ బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడంతోపాటు పెట్టుబడులు కూడా పెట్టాడు రొనాల్డో. అప్పటి నుంచి ఈ యాప్ ఇంకా వేగంగా మార్కెట్లోకి చొచ్చుకు పోయింది. పాట్రిక్ మమోమస్, మెక్ ఇల్రాయ్, లబ్రోన్ జేమ్స్, మైకేల్ ఫెల్ఫ్స్ తదితరులు ఈ సంస్థ వినియోగదారుల జాబితాలో ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా సేవలను ఈ కంపెనీ అందిస్తోంది. సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, కువైట్, బహ్రైన్, హాంకాంగ్, ఇజ్రాయెల్, సౌత్ కొరియా, తైవాన్ తదితర దేశాలకు విస్తరించింది. ఇక కోహ్లీ చేతికి ఈ బ్యాండు ను చూశాక చాలామంది ఇంటర్నెట్లో దీనిపై సెర్చ్ చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

