News
News
వీడియోలు ఆటలు
X

Kannai Nambathey Review: ‘కన్నై నంబాతే’ మూవీ రివ్యూ: రెప్పపాటులో ఇన్ని ట్విస్టులా?

ఉదయనిధి స్టాలిన్ నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ‘నెట్‌ఫ్లిక్స్’ ఓటీటీలో ఇటీవలే విడుదలైంది. ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మరి ఈ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుందా?

FOLLOW US: 
Share:

సినిమా: కన్నై నంబాతే (కళ్లను నమ్మొద్దు)

రేటింగ్ : 2.75/5
నటీనటులు : ఉదయనిధి స్టాలిన్, ప్రసన్న, భూమిక, ఆత్మిక, శ్రీకాంత్, సతీష్, వసుంధరా కాశ్యప్
మ్యూజిక్ : సిద్ధు కుమార్ 
నిర్మాత : వీఎన్ రంజీత్ కుమార్ 
కథ, దర్శకత్వం : Mu.మారన్
ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్ ఫ్లిక్స్ (తెలుగు అనువాదం)
సినిమా నిడివి: 2.08 గంటలు. 
మూవీ జోనర్: క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ 

ఓటీటీల్లో ఎన్నో థ్రిల్లర్స్ అందుబాటులో ఉంటున్నాయి. అయితే, వాటిలో ఆకట్టుకొనేవి కొన్ని మాత్రమే. తాజాగా ‘నెట్‌ఫ్లిక్స్’ ఓటీటీలో విడుదలైన ‘కన్నె నంబాతే’ (కళ్లను నమ్మొద్దు) సినిమా కూడా ఆకట్టుకుంటుంది. కానీ, మీరు ఇప్పటివరకు ఏ థ్రిల్లర్ మూవీలో చూడనన్ని ట్విస్టులు ఈ మూవీలో ఉంటాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌లను ఎంపిక చేసుకొనే ఉదయ నిధి స్టాలిన్ ఈ డిసెంట్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా ‘నెట్ ఫ్లిక్స్’ రేటింగ్స్‌లో రెండో స్థానం ఉంది. ఈ మూవీ మార్చి 17న తమిళంలో విడుదలై.. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. 

కథ: సినిమా ఓ ఫ్లాష్‌బ్యాక్ కథతో మొదలవుతుంది. ఓ మహిళ అనాథ శరణాలయాన్ని నడుపుతుంది. అనాథలను తన సొంత పిల్లల్లా చూసుకుంటుంది. ఇది ఆమె కూతురుకు అస్సలు ఇష్టం ఉండదు. పిల్లలు తినే అన్నంలో విషం కలపడంతో ఒక చిన్నారి చనిపోతుంది. ఆ విషం కలిపింది తన కూతురేనని తెలిసి ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతుంది. దీంతో కూతురు ఆమెను చంపేస్తుంది. ఈ కథను ఎందుకు చూపించారనేది క్లైమాక్స్‌లో అర్థమవుతుంది. 

ఇక అసలు కథలోకి వస్తే.. గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తున్న అరుణ్ (ఉదయనిధి స్టాలిన్) ఇంటి యజమాని కూతురు దివ్య (ఆత్మిక)తో ప్రేమలో పడతాడు. ఈ విషయం తెలిసి ఆమె తండ్రి ఇంటి నుంచి అరుణ్‌ను బయటకు గెంటేస్తాడు. దీంతో అరుణ్ తన స్నేహితుడు జగన్(సతీష్)తో కలిసి ఇంటి కోసం వెతుకుతాడు. బ్యాచిలర్స్‌కు ఎక్కడా ఇల్లు అద్దెకు ఇవ్వమని చెప్పడంతో.. చివరికి సోము (ప్రసన్న) అనే అపరిచితుడితో అరుణ్ రూమ్ షేర్ చేసుకోవల్సి వస్తుంది. ఓ రాత్రి జగన్, సోముతో కలిసి బార్‌కు వెళ్తాడు. దివ్య కాల్ చేయడంతో బార్ నుంచి రోడ్డు మీదకు వచ్చి ఫోన్ మాట్లాడతాడు. ఇంతలో అతడి కళ్ల ముందే ఒక కారు యాక్సిడెంట్‌ జరుగుతుంది. ఆ కారులో కవిత (భూమిక) అనే మహిళ ఉంటుంది. కవిత మత్తులో, కారు నడపలేని స్థితిలో ఉండటంతో అరుణ్ ఆమెకు సాయం చేయాలని అనుకుంటాడు. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుని ఆమెను ఇంటి దగ్గర వదులుతాడు. జోరుగా వర్షం కురుస్తుండటంతో.. అరుణ్‌ను తన కారులో ఇంటికెళ్లి, ఉదయాన్నే తిరిగి ఇచ్చేయమని చెబుతుంది. దీంతో అరుణ్.. బార్‌లో ఉన్న సోమును కారులో  ఎక్కించుకుని రూమ్‌కు వెళ్లిపోతాడు. ఉదయం కారు డిక్కీ తెరిచి చూస్తే.. కవిత శవం ఉంటుంది. డిక్కీలో శవాన్ని చూసి అరుణ్, సోము షాకవుతారు. ఇంతకీ కవిత శవం ఆ కారు డిక్కీలోకి ఎలా వచ్చింది? అసలు ఏం జరిగింది? కవితను చంపింది ఎవరు? ఈ ఘటన తర్వాత అరుణ్, సోములకు ఎదురయ్యే సవాళ్లు ఏమిటనేది మీరు బుల్లితెరపైనే చూస్తేనే థ్రిల్‌గా ఉంటుంది. 

విశ్లేషణ: సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఫ్యామిలీతో కూర్చొని చూడలేం. కానీ, ఇది చాలా డీసెంట్ థ్రిల్లర్. ఫ్యామిలితో కూర్చొని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూడొచ్చు. ఒక్కసారి కూర్చుంటే.. రిమోట్ మీద చేయి పెట్టకుండా చూసేయాల్సిందే. ఎందుకంటే.. ఈ మూవీలో ప్రతి నిమిషానికి ఒక ట్విస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్, సెకండాఫ్‌లోని కొన్ని సీన్స్.. సీట్ ఎడ్జ్‌‌లో కూర్చోబెడతాయి. కళ్లు తిప్పినా, మధ్యలో లేచి పక్కకు వెళ్లొచ్చినా కీలకమైన ట్విస్టులు మిస్సయ్యే అవకాశం ఉంటుంది. దర్శకుడు మారన్.. మూవీని నెమ్మదిగా మొదలుపెట్టి.. ఆ తర్వాత పరుగులు పెట్టించాడు. భూమిక కారు యాక్సిడెంట్ ఘటన నుంచి అసలు కథ మొదలవుతుంది. ఆ తర్వాత అది ఎన్ని ట్విస్టులు తిరుగుతుందనేది అంకెల్లో చెప్పలేం. సినిమా టైటిల్‌కు తగినట్లే కళ్లను నమ్మలేం. సెకండాఫ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులతో కథను సాగదీసినట్లుగా అనిపిస్తోంది. అంతేకాదు ప్రేక్షకుడు కూడా గందరగోళానికి గురవ్వుతాడు. అన్నేసి ట్విస్టులు వెబ్ సీరిస్‌లకైతే బాగానే ఉంటుంది. కానీ, సినిమాలో చూపిస్తేనే అతిగా అనిపిస్తుంది. ప్రేక్షకుడికి విసుగు కూడా వస్తుంది. నెక్ట్స్ ఏమిటీ అనేది ప్రేక్షకుడు గెస్ చేయకుండా ఉండేందుకు దర్శకుడు ఊహించని ట్విస్టులను రాసుకున్నాడేమో అనిపిస్తుంది. ముఖ్యంగా భూమిక పాత్రను ట్విస్టులకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఈ సినిమా ఫస్టాఫ్‌‌కు ట్విస్టులు ఎంత ప్లస్‌ అయ్యాయో. అవే, క్లైమాక్స్‌కు వచ్చేసరికి కాస్త గందరగోళానికి గురిచేస్తాయి. ఈ సినిమాలో అన్ని పాత్రలకు సమాన ప్రాధాన్యం ఉంటుంది. క్లైమాక్స్‌లో మాత్రం హీరో ఉదయనిధికి అనుకూలంగా సీన్లు అల్లారేమో అనిపిస్తుంది. అయితే, థ్రిల్లర్స్‌ను ఇష్టపడేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. 

ఎవరెవరు ఎలా చేశారంటే..: ఈ థ్రిల్లర్‌కు ఉదయనిధి, ప్రసన్న, భూమిక, శ్రీకాంత్ పాత్రలే కీలకం. వీరి చుట్టేనే కథంతా నడుస్తుంది. ఆయా పాత్రాలకు వారు న్యాయం చేశారు. హీరోయిన్ ఆత్మిక పాత్ర చాలా తక్కువ. ఆమె కొన్ని సీన్లకే పరిమితమైంది. హీరో స్నేహితుడి(జగన్)గా నటించిన కమెడియన్ సతీష్ కేవలం ఫస్టాఫ్‌లోనే కనిపిస్తాడు. ఈ సినిమాలో రెండు కథలు సమాంతరంగా నడుస్తాయి. చెప్పాలంటే ఇది చాలా కాంప్లికేటెడ్ స్టోరీ. దీన్ని తెరపై ప్రేక్షకుడికి నచ్చేలా చూపించడమంటే అంత ఈజీ కాదు. ఈ విషయంలో దర్శకుడు కొంతవరకు సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవచ్చు. సిద్ధు కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఉన్న ఒక్క పాటను ఫార్వర్డ్ చేయడం బెటర్. టెక్నికల్‌గా ఈ మూవీ చాలా రిచ్‌గా ఉంది. చివరిగా.. ఫ్యామిలీతో కలిసి చూడతగ్గ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఒక రక్తపు చుక్క కూడా ఈ మూవీలో కనిపించదు. తెలియని వ్యక్తికి సాయం, అపరిచితుడితో సావాసం.. రెండూ ప్రమాదకరమే అనేది ఈ థ్రిల్లర్ మూవీతో చెప్పాడు దర్శకుడు. 

Also Read : 'విరూపాక్ష' రివ్యూ : సాయి ధరమ్ తేజ్ భయపెట్టారా? లేదా?

Published at : 22 Apr 2023 01:17 AM (IST) Tags: ABPDesamReview Prasanna Udhayanidhi Stalin Bhumika Kannai Nambathey Telugu Review Kannai Nambathey Review

సంబంధిత కథనాలు

Spiderman: Across The Spiderverse Review: స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్ రివ్యూ: యానిమేటెడ్ స్పైడర్ మ్యాన్ ఆకట్టుకున్నాడా? నిరాశ పరిచాడా?

Spiderman: Across The Spiderverse Review: స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్ రివ్యూ: యానిమేటెడ్ స్పైడర్ మ్యాన్ ఆకట్టుకున్నాడా? నిరాశ పరిచాడా?

Grey Movie Review - 'గ్రే' సినిమా రివ్యూ : డిఫరెంట్ 'రా' థ్రిల్లర్ - రాజ్ మాదిరాజు సినిమా ఎలా ఉందంటే?

Grey Movie Review  - 'గ్రే' సినిమా రివ్యూ : డిఫరెంట్ 'రా' థ్రిల్లర్ - రాజ్ మాదిరాజు సినిమా ఎలా ఉందంటే?

Malli Pelli Movie Review - 'మళ్ళీ పెళ్లి' రివ్యూ : నరేష్, పవిత్ర తప్పు చేశారా? లేదంటే రమ్యా రఘుపతిది తప్పా? ఏం చూపించారంటే?

Malli Pelli Movie Review - 'మళ్ళీ పెళ్లి' రివ్యూ : నరేష్, పవిత్ర తప్పు చేశారా? లేదంటే రమ్యా రఘుపతిది తప్పా? ఏం చూపించారంటే?

#MENTOO Review: మెన్‌టూ రివ్యూ: మగవాళ్ల కష్టాలను చూపించిన మెన్‌టూ సినిమా ఎలా ఉంది?

#MENTOO Review: మెన్‌టూ రివ్యూ: మగవాళ్ల కష్టాలను చూపించిన మెన్‌టూ సినిమా ఎలా ఉంది?

Sathi Gani Rendu Ekaralu Review - 'సత్తిగాని రెండెకరాలు' రివ్యూ : ఆహాలో వినోదాత్మక నేర చిత్రం - ఎలా ఉందంటే?

Sathi Gani Rendu Ekaralu Review - 'సత్తిగాని రెండెకరాలు' రివ్యూ : ఆహాలో వినోదాత్మక నేర చిత్రం - ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !