News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Mr Pregnant Review: మిస్టర్ ప్రెగ్నెంట్ రివ్యూ: సొహెల్ ‘పురుష గర్భం’ ప్రయోగం ఎలా ఉంది? డెలివరీ హిట్టా? ఫట్టా?

‘బిగ్ బాస్’ ఫేమ్ సొహెల్ నటించిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ఎలా ఉంది?

FOLLOW US: 
Share:

సినిమా రివ్యూ : మిస్టర్ ప్రెగ్నెంట్
రేటింగ్ : 2.75/5
నటీనటులు : సొహెల్, రూపా కొడువయూర్, సుహాసిని మణిరత్నం, వైవా హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర తదితరులు
ఛాయాగ్రహణం : నిజార్ షఫీ
సంగీతం : శ్రవణ్ భరద్వాజ్
నిర్మాతలు : అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి
రచన, దర్శకత్వం : శ్రీనివాస్ వింజనంపాటి
విడుదల తేదీ: ఆగస్టు 18, 2023

‘కథ వేరుంటది’ అంటూ బిగ్ బాస్ హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ పండించిన సొహెల్ వెండి తెరపై కూడా వినోదాన్ని పంచుతున్నారు. ఈ సంవత్సరం ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ అంటూ పలకరించాక ఇప్పుడు ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ అనే ప్రయోగాత్మక చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒక మగాడు గర్భం మోయడం అనే ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ట్రైలర్‌ను ఎమోషనల్‌గా కట్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా కలిగాయి. చిత్ర బృందం చాలా అగ్రెసివ్‌గా ప్రమోషన్స్ చేసింది. ఇంతకీ సినిమా ఎలా ఉంది?

కథ: గౌతమ్ (సొహెల్) ఒక టాటూ ఆర్టిస్ట్. టాటూలు వేయడంలో ఎక్కడ ఏ కాంపిటీషన్ జరిగినా ఫస్ట్ ప్రైజు తనకే. మహి (రూపా కొడువయూర్) గౌతమ్‌ను చాలా డీప్‌గా ప్రేమిస్తుంది. కానీ గౌతం మాత్రం మహిని అస్సలు పట్టించుకోడు. ఒకరోజు గౌతమ్ పార్టీలో ఫుల్లుగా తాగేసి జీవితాంతం పిల్లలు వద్దనుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటానని మహికి కండీషన్ పెడతాడు. దాన్ని సీరియస్‌గా తీసుకుని మహి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకోవడానికి కూడా సిద్ధం అవుతుంది. మహికి తన మీదున్న ప్రేమను అర్థం చేసుకున్న గౌతమ్... ఆపరేషన్ ఆపేసి లవ్‌కు ఓకే అంటాడు. కానీ మహి పేరెంట్స్ మాత్రం వీరి ప్రేమను అంగీకరించరు. దీంతో మహి ఇంట్లో నుంచి వచ్చేసి గౌతమ్‌ను పెళ్లి చేసుకుంటుంది. పిల్లలే వద్దనుకున్న గౌతమ్‌కు తనే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? గౌతమ్‌కు పిల్లలంటే ఎందుకు ఇష్టం ఉండదు? ఈ కథలో డాక్టర్ వసుధ (సుహాసిని మణిరత్నం) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: పాయింట్‌గా చూసుకుంటే మిస్టర్ ప్రెగ్నెంట్ అనేది చాలా విభిన్నమైన కథ. ఒక మగాడు గర్భం మోయాలనుకోవడం, దాన్ని ఇతరులకు తెలియకుండా దాచాలనుకోవడం ఇలా పూర్తిగా కొత్త విషయాన్ని దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి ఎంచుకున్నారు. అయితే దీన్ని ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చెప్పాలనుకోవడం కత్తి మీద సాము లాంటిది. ఏమాత్రం తేడా వచ్చినా నవ్వుల పాలయిపోవడం ఖాయం. మరి ఇందులో దర్శకుడు శ్రీనివాస్ విజయం సాధించారా?

సినిమా చాలా సాధారణంగా మొదలవుతుంది. గౌతమ్‌ను మహి ప్రేమించడం, గౌతమ్ పట్టించుకోకుండా తిరగడం, వైవా హర్ష కామెడీ ట్రాక్ ఇలా సాగుతూనే ఉంటాయి. మహిని గౌతమ్ ఎందుకు ప్రేమించాడనే విషయాన్ని చాలా బలంగా, కనెక్ట్ అయ్యేలా చెప్పారు. కానీ గౌతమ్‌ని మహి ఎందుకు అంత ఇష్టపడిందంటే మాత్రం చెప్పడం కష్టమే. గౌతమ్ కోసం తల్లిదండ్రులను కూడా వదిలేసి రావడానికి మహి సిద్ధపడుతుంది. కానీ అంత ఎందుకు ఇష్టపడిందనే విషయంలో క్లారిటీ ఉండదు. మొదటి 45 నిమిషాల్లో కథ అస్సలు ఏమాత్రం ముందుకు సాగదు. అక్కడి దాకా జరిగిన కామెడీ సీన్లు పెద్దగా నవ్వించవు. ఒక విలన్‌ని పరిచయం చేసినా ఆ పాత్ర ఆటలో అరటిపండు లాంటిదేనని అర్థం అవుతూనే ఉంటుంది.

హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకున్న దగ్గరి నుంచి స్టోరీ గ్రాఫ్ మారిపోతుంది. అసలు గౌతమ్ పిల్లల్ని ఎందుకు వద్దనుకున్నాడు అనే విషయాన్ని ఎమోషనల్‌గా చెప్పే ప్రయత్నం చేశారు. ఇంటర్వెల్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సెకండాఫ్‌లో కూడా గ్రాఫ్ ఏమాత్రం పడిపోకుండా జాగ్రత్త పడ్డారు. ముఖ్యంగా ద్వితీయార్థంలో బ్రహ్మాజీ, అభిషేక్‌ల ట్రాక్ హిలేరియస్‌గా వర్కవుట్ అయింది. ఆ వెంటనే మళ్లీ స్టోరీ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. గౌతమ్ ప్రెగ్నెంట్ అయిన విషయం బయట తెలిసిపోయాక వారికి ఎదురైన అవమానాలు, దాని కారణంగా వారు పడే బాధ వీటన్నిటినీ బాగా డీల్ చేశారు. క్లైమ్యాక్స్‌లో హీరో ఆడవారి గొప్పతనం చెప్పే సీన్ బాగా కనెక్ట్ అవుతుంది. సినిమా నిడివి రెండు గంటల 22 నిమిషాలుగా ఉంది. ప్రథమార్థంలో హీరో, హీరోయిన్ల లవ్‌ట్రాక్‌ని ట్రిమ్ చేసి రన్‌టైమ్‌ను కాస్త కుదించి ఉంటే బాగుండేది.

శ్రవణ్ భరద్వాజ్ స్వరపరిచిన పాటల్లో ‘హే చెలి’ ఆకట్టుకుంటుంది. ఈ పాట పిక్చరైజేషన్ కూడా చాలా అందంగా ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. నిజార్ షఫీ తన కెమెరాతో సినిమాను బాగా కలర్‌ఫుల్‌గా చూపించారు. నిర్మాణ విలువలు ఆకట్టుకుంటాయి. బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అయినట్లు కనిపించదు.

ఇక నటీనటుల విషయానికి వస్తే... గౌతమ్ పాత్రలో సొహెల్ జీవించాడు. ఎమోషనల్ సీన్లలో మంచి నటన కనపరిచాడు. ప్రీ క్లైమ్యాక్స్‌లో వైవా హర్షతో వచ్చే సీన్, క్లైమ్యాక్స్‌‌ల్లో కన్నీళ్లు పెట్టిస్తాడు. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’లో మెప్పించిన రూపా కొడువయూర్‌కు మరోసారి నటనకు స్కోప్ ఉన్న పాత్ర లభించింది. మహి పాత్రలో లవ్ సీన్లలోనూ, భావోద్వేగ సన్నివేశాల్లోనూ ఆకట్టుకుంటుంది. వైవా హర్షకు సొహెల్ ఫ్రెండ్‌గా సినిమా మొత్తం కనిపించే పాత్ర లభించింది. హర్ష కూడా బాగా నటించాడు. బ్రహ్మాజీ, అభిషేక్‌లు బాగా నవ్విస్తారు. డాక్టర్ వసుధగా సుహాసినికి మంచి పాత్ర లభించింది. మిగిలిన పాత్రధారులందరూ వారి వారి పాత్రలకు తగిన న్యాయం చేశారు.

ఓవరాల్‌గా చెప్పాలంటే... మీరు విభిన్న చిత్రాలను ఇష్టపడేవారయితే ‘మిస్టర్ ప్రెగ్నెంట్‌’ డెలివరీకి థియేటర్లకు వెళ్లవచ్చు.

Published at : 18 Aug 2023 06:50 AM (IST) Tags: ABPDesamReview Syed Sohel Mr Pregnant Mr Pregnant Movie Review Mr Pregnant Review Mr Pregnant Review in Telugu Roopa Kodavayur Srinivas Vinjanampati

ఇవి కూడా చూడండి

Saptha Sagaralu Dhaati Review - 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ : కన్నడ బ్లాక్ బస్టర్ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా?

Saptha Sagaralu Dhaati Review - 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ : కన్నడ బ్లాక్ బస్టర్ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా?

Rudramkota Review - 'రుద్రంకోట' రివ్యూ : 'జానకి కలగనలేదు' సీరియల్ దర్శక, నిర్మాతలు తీసిన సినిమా

Rudramkota Review - 'రుద్రంకోట' రివ్యూ : 'జానకి కలగనలేదు' సీరియల్ దర్శక, నిర్మాతలు తీసిన సినిమా

Athidhi Web Series Review - 'అతిథి' రివ్యూ : హీరో వేణు తొట్టెంపూడి నటించిన హారర్ థ్రిల్లర్ సిరీస్

Athidhi Web Series Review - 'అతిథి' రివ్యూ : హీరో వేణు తొట్టెంపూడి నటించిన హారర్ థ్రిల్లర్  సిరీస్

Ramanna Youth Review - 'రామన్న యూత్' రివ్యూ : అభయ్ బేతిగంటి హీరోగా, దర్శకుడిగా పరిచయమైన సినిమా!

Ramanna Youth Review - 'రామన్న యూత్' రివ్యూ : అభయ్ బేతిగంటి హీరోగా, దర్శకుడిగా పరిచయమైన సినిమా!

Mark Antony Review - 'మార్క్ ఆంటోనీ' రివ్యూ : టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో విశాల్ సినిమా - ఎలా ఉందంటే?

Mark Antony Review - 'మార్క్ ఆంటోనీ' రివ్యూ : టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో విశాల్ సినిమా - ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు

BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు

NDA కూటమిలో చేరిన జేడీఎస్, అమిత్‌షాతో భేటీ తరవాత కీలక నిర్ణయం

NDA కూటమిలో చేరిన జేడీఎస్, అమిత్‌షాతో భేటీ తరవాత కీలక నిర్ణయం

Agent OTT Release Date: ఓటీటీలోకి ‘ఏజెంట్’ ఎంట్రీ - డేట్ ఫిక్స్ చేసిన సోనీ లివ్!

Agent OTT Release Date: ఓటీటీలోకి ‘ఏజెంట్’ ఎంట్రీ - డేట్ ఫిక్స్ చేసిన సోనీ లివ్!

Chandrababu News: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ 25న - రేపు వాదనలు వినబోమన్న జడ్జి

Chandrababu News: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ 25న - రేపు వాదనలు వినబోమన్న జడ్జి