AAP MLAs Suspension: ఢిల్లీ అసెంబ్లీలో నిరసన, మాజీ సీఎం అతిషి సహా 11 మంది ఆప్ ఎమ్మెల్యేలపై వేటు
Delhi Assembly News | ఢిల్లీ అసెంబ్లీలో నిరసనకు దిగిన మాజీ సీఎం అతిషి సహా 11 మంది ఆప్ ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేశారు. ఒకరోజు సభా కార్యక్రమాల నుంచి వారిని బహిష్కరించారు.

Atishi among 11 AAP MLAs Suspended From Delhi Assembly | ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం అతిషి, గోపాల్ రాయ్ సహా 11 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఒకరోజు ఢిల్లీ అసెంబ్లీ కార్యక్రమాల నుంచి వారిని బహిర్కరించారు. ఢిల్లీ అసెంబ్లీలో మంగళవారం ఉదయం లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగం ప్రారంభించగా.. ప్రతిపక్ష ఆప్ ఎమ్మెల్యేలు జై భీమ్, జై భగత్ సింగ్, జై అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. భగత్ సింగ్, అంబేద్కర్ ఫొటోలను తొలగించడాన్ని తప్పుపడుతూ ఆప్ సభ్యులు ఢిల్లీ శాసనసభలో నిరసన తెలిపారు. వెంటనే స్పీకర్ మార్షల్స్ ను పలిచి, సస్పెన్షట్ వేటు పడిన ఆప్ ఎమ్మెల్యేలను సభ నుండి బయటకు పంపాలని ఆదేశించారు.
సస్పెండ్ అయిన వారిలో ఢిల్లీ మాజీ సీఎం అతిషి, మాజీ మంత్రి గోపాల్ రాయ్, రెండుసార్లు ఢిల్లీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే వీరేంద్ర సింగ్ కడియన్ ఉన్నారు. ముందు రోజు 8 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు.
UPDATE | 11 AAP MLAs, including LoP Atishi, have been suspended by Speaker Vijender Gupta.
— ANI (@ANI) February 25, 2025
#WATCH | Delhi: AAP MLA Gopal Rai also suspended from the legislative assembly by Speaker Vijender Gupta.
— ANI (@ANI) February 25, 2025
Source: Vidhan Sabha pic.twitter.com/qfzBQDLmu9
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

