Kerala Crime News: ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసిన 23 ఏళ్ల యువకుడు - గర్ల్ ఫ్రెండ్‌నీ వదల్లేదు - తండ్రి వల్లనే..
Murders: కేరళలో ఓ యువకుడు తన కుటుంబం మొత్తాన్ని చంపేశాడు. తర్వతా తన లవర్ ని కూడా చంపేశాడు. ఎందుకంటే ?

Kerala Murders: కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలోని గ్రామానికి ఓ యువకుడు హడావుడిగా పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. తాను ఐదుగుర్ని చంపేశానని అక్కడ ఉన్న పోలీసులకు చెప్పాడు. చంపిన వాళ్లు ఎవరో కాదని తన కుటుంబసభ్యులేనని కూడా చెప్పాడు. అయితే పోలీసులు నమ్మలేదు. కుటుంబాన్ని చంపేసి ఇంత తాపీగా వస్తారా అని అనుకున్నారు. కానీ కాసేపటికి అతను తాను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి విషయం తాగానని చెప్పడంతో ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారు. అప్పటికే ఆ యువకుడు అపస్మారక స్థితికి వెళ్లే పరిస్థితికి చేరుకున్నాడు. దాంతో పోలీసులు హుటాహుటిని ఆస్పత్రికి తలించారు. అతని వివరాలు తెలుసుకుని.. అతను చెప్పిన ఇంటికి వెళ్లాడు
అ యువకుడి పేరు అఫన్. అతని ఇంటికి వెళ్లిన పోలీసులుకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. మొత్త ఐదు మృతదేహాలు ఉన్నాయి. అందర్నీ అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఆఫన్ హత్య చేసిన వారిలో తన తల్లి ఉంది. అలాగే తన తండ్రి సోదరి.. ఆమె భర్త ఉన్నారు. నాయనమ్మను కూడా దారుణంగా చంపారు. మరో యువతి మృతదేహం కూడా ఉంది. ఆ యువతి ఆఫర్ గర్ల్ ఫ్రెండ్ గా గుర్తించారు. దీంతో పోలీసులు అసలేం జరిగిందా అని ఆరా తీశారు. పురుగుమందు తాగిన నిందితుడు చావు నుంచి బయటపడ్డాడు.
పోలీసులకు ఎందుకు చంపాడో చెప్పాడు. అఫన్ తండ్రి ఐదేళ్ల కిందట ఇంటి నుంచి పరారయ్యాడు. ఆయన ఓ స్పేర్ పార్టుల వ్యాపారం చేసేవాడు. అందిన కాడల్లా అప్పులు చేశాడు. అయితే ఎవరికీ తిరిగి చెల్లించలేదు. అప్పుల వాళ్లు అడుగుతారని తండ్రి పారిపోయాడు. ఇప్పటి నుంచి కుటుంబ భారం అఫన్ పై పడింది. ఓ వైపు కుటుంబాన్ని పోషించాడనికి తంటాలు పడుతూనే మరో వైపు అప్పుల వారికి ఎలా సర్ది చెప్పాలో అర్థం కాలేదు. ఈ తీవ్ర ఒత్తిడి మధ్య అతను డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు. ఎంత కష్టపడినా ఇక కష్టాలు తీరవని అనుకున్నాడు. అందుకే కుటుంబం మొత్తాన్ని చంపేసి తాను చనిపోవాలి అనుకుననాడు. తాను లేకపోతే తన గర్ల్ ఫ్రెండ్ మాత్రం ఎందుకని.. ఆమెను కూడా చంపాలనుకున్న రోజు ఇంటికి పిలిచాడు. అనుకున్నట్లుగా అందర్నీ చంపేశాడు.
తరవాత తాను విషం తాగి.. పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తీవ్రమైన ఆర్థిక సమస్యలు.. సమాజంలో పరువు పోగొట్టుకున్నందున ఇక బతకడం వేస్ట్ అని అందర్నీ చంపేసి తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లుగా పోలీసులు చెప్పారు. ఆఫన్ వ్యవహారం కేరళలో సంచలనం సృష్టించింది. అతని మానసిక పరిస్థితి కూడా తేడాగా ఉందని పోలీసులు గుర్తించారు. హత్య లు చేసిన తర్వాత ఏమీ జరగనట్లుగా.. ఏమీ చేయనట్లుగా ఇతరులతో మాట్లాడారు. పోలీసు స్టేషన్ కు వచ్చాడు. మొత్తంగా అప్పులు చేసి పారిపోయిన తండ్రి మీద కోపంతో.. మొత్తం కుటుంబాన్ని అంతం చేశాడు ఆఫన్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

