Inter Halltikets: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - ఇలా పొందండి
Inet Halltickets: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. కళాశాలల యాజమాన్యాలు లాగిన్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన ఉంటుంది.

TGBIE INTER HALLTICKETS: తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు ఫిబ్రవరి 24 విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచారు. సంబంధిత కళాశాలల యాజమాన్యాలు లాగిన్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులకు కూడా తగిన సమయంలో హాల్‌టికెట్లను వ్యక్తిగతంగా పంపించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. విద్యార్థులు హాల్‌టికెట్లపై ఫొటోలు, సంతకాలు, ఇతర సవరణలు అవసరమైతే కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లి, సరిచేయించుకోవచ్చు.
ఇంటర్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
ఇందులో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను మార్చి 5 నుంచి మార్చి 24 వరకు నిర్వహించనున్నారు. అయితే ప్రథమ సంవత్సరం ప్రధాన పరీక్షలు మార్చి 19తో ముగియనుండగా.. ఫస్టియర్ ఒకేషనల్, బ్రిడ్జి కోర్సు పరీక్షలు మార్చి 24తో ముగుస్తున్నాయి. అదేవిధంగా మార్చి 6 నుంచి మార్చి 25 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సెకండియర్ ప్రధాన పరీక్షలు మార్చి 20తో ముగియనుండగా.. ఒకేషనల్, బ్రిడ్జి కోర్సు పరీక్షలు మార్చి 25తో ముగుస్తున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఆయాతేదీల్లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ ఏడాది 9.8 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు.
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూలు..
పరీక్ష తేదీ | వారం | పేపర్ |
05.03.2025 | బుధవారం | సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1 |
07.03.2025 | శుక్రవారం | ఇంగ్లిష్ పేపర్ పేపర్-1 |
11.03.2025 | మంగళవారం | మాథ్స్ పేపర్ 1ఎ, బోటని పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1 |
13.03.2025 | గురువారం | మ్యాథ్స్ పేపర్ 1బి, జువాలజి పేపర్-1, హిస్టరీ పేపర్-1 |
17.03.2025 | సోమవారం | ఫిజిక్స్ , ఎకనామిక్స్ |
19.03.2025 | బుధవారం | కెమిస్ట్రీ , కామర్స్ |
21.03.2025 | శుక్రవారం | పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్య్ పేపర్-1(బైపీసీ విద్యార్థులకు) |
24.03.2025 | సోమవారం | మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్ -1 |
ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూలు..
పరీక్ష తేదీ | వారం | పేపర్ |
06.03.2025 | గురువారం | సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2 |
10.03.2025 | సోమవారం | ఇంగ్లిష్ పేపర్ పేపర్-2 |
12.03.2025 | బుధవారం | మాథ్స్ పేపర్ 2ఎ, బోటని పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2 |
15.03.2025 | శనివారం | మ్యాథ్స్ పేపర్ 2బి, జువాలజి పేపర్-2, హిస్టరీ పేపర్-2 |
18.03.2025 | మంగళవారం | ఫిజిక్స్ , ఎకనామిక్స్ |
20.03.2025 | గురువారం | కెమిస్ట్రీ , కామర్స్ |
22.03.2025 | శనివారం | పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్య్ పేపర్-2 (బైపీసీ విద్యార్థులకు) |
25.03.2025 | మంగళవారం | మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2 |
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

