Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ మూవీ రివ్యూ: ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు కామెడీ మూవీ ఎలా ఉంది?
Laapataa Ladies Telugu Review: టాలెంటెడ్ డైరెక్టర్ కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్’ సినిమా ఎలా ఉంది?
కిరణ్ రావు
నితాన్షి గోయల్, స్పర్శ్ శ్రీవాస్తవ్, ప్రతిభా రంటా, రవి కిషన్ తదితరులు
నెట్‌ఫ్లిక్స్
Laapataa Ladies Review in Telugu
సినిమా రివ్యూ: లాపతా లేడీస్
రేటింగ్: 3/5
నటీనటులు: నితాన్షి గోయల్, స్పర్శ్ శ్రీవాస్తవ్, ప్రతిభా రంటా, రవి కిషన్ తదితరులు
ఛాయాగ్రహణం: వికాస్ నౌలాఖా
కథ: విప్లవ్ గోస్వామి
రచన: స్నేహా దేశాయ్, దివ్యనిధి శర్మ
సంగీతం: రామ్ సంపత్
నిర్మాతలు: ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్‌పాండే
దర్శకత్వం: కిరణ్ రావు
ఓటీటీ ప్లాట్‌ఫాం: నెట్‌ఫ్లిక్స్
బాలీవుడ్‌లో ఇటీవల విడుదల అయిన సినిమాల్లో ‘లాపతా లేడీస్’ విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు కూడా సాధించింది. కిరణ్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది?
కథ (Laapataa Ladies Story): 2001 సంవత్సరంలో నిర్మల్ ప్రదేశ్ అనే కాల్పనిక గ్రామంలో జరిగే కథ ఇది. దీపక్ (స్పర్శ్ శ్రీవాస్తవ్) అనే రైతు కొత్తగా పెళ్లి చేసుకుని తన భార్య ఫూల్ (నితాన్షి గోయల్)తో ఊరికి బయలుదేరతాడు. అయితే వారు ఎక్కిన రైలులో చాలా మంది జనం ఉంటారు. వీరిలాగే కొత్తగా పెళ్లయిన వారు కూడా చాలా మంది అదే రైలు ఎక్కుతారు. రైలులో కొత్తగా పెళ్లి అయిన జంటల్లో పెళ్లి కూతుళ్లు అందరూ ఒకే తరహాలో బట్టలు వేసుకుని ఉంటారు. వాళ్ల ముఖాలు కూడా పూర్తిగా కవర్ అయి ఉంటాయి. రైల్లో దీపక్ నిద్రపోయి దిగాల్సిన స్టేషన్ వచ్చినప్పుడు పక్కన ఉన్న అమ్మాయితో పాటు దిగేస్తాడు. ఇంటికి వచ్చాక కానీ దీపక్‌తో పాటు దిగింది ఫూల్ కాదని, జయ (ప్రతిభ రంటా) అని తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? జయ ఎవరు? దీపక్, ఫూల్ మళ్లీ కలిశారా అన్నది తెలియాలంటే ‘లాపతా లేడీస్’ చూడాల్సిందే.
విశ్లేషణ (Laapataa Ladies Review): కథ, కథనం సరిగ్గా ఉంటే క్యాస్టింగ్, బడ్జెట్, స్కేల్‌తో సంబంధం లేకుండా సినిమాను ఆడియన్స్ సక్సెస్ చేస్తారనడానికి ‘లాపతా లేడీస్’ బెస్ట్ ఎగ్జాంపుల్. రెండు గంటల నాలుగు నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా మొదటి 10 నిమిషాల నుంచే పూర్తిగా కథలోకి వెళ్లిపోతారు. కథలో చాలా సీరియస్ సమస్యను చాలా ఎంటర్‌టైనింగ్‌గా చెప్పారు. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుల ముఖం మీద చిరునవ్వు అలానే ఉంటుంది.
ఈ సినిమాలో అన్ని పాత్రలు కీలకంగా ఉంటాయి. స్పర్శ్ శ్రీవాస్తవ్ చేసిన దీపక్ పాత్ర నుంచి రవి కిషన్ చేసిన పోలీసు పాత్ర వరకు అన్ని పాత్రలకూ సమానమైన ప్రాధాన్యతను అందించారు. వీరి కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. దూబే జీ పాత్రలో దుర్గేష్ కుమార్ ప్రత్యేకమైన టైమింగ్‌తో అలరిస్తారు.
కిరణ్ రావు ఈ సినిమాను అద్బుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రొడక్షన్ డిజైన్ నుంచి సెట్స్ వరకు అన్నిట్లో కిరణ్ రావు హార్డ్ వర్క్ కనిపిస్తుంది. 11 సంవత్సరాల తర్వాత సినిమా తీసినా స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. ‘లాపతా లేడీస్’ సినిమాలో ప్రతి ఫ్రేమ్‌లోనూ కిరణ్ రావు తీసుకున్న కేర్ కనిపిస్తుంది. మంచి క్వాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఈ సినిమా ద్వారా అందించారు. రామ్ సంపత్ సంగీతం సినిమాకు మరో హైలెట్. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ సాంగ్స్ అయితే సిట్యుయేషన్స్‌కు పర్‌ఫెక్ట్‌గా సింక్ అయింది. ముఖ్యంగా సాంగ్స్ కూడా అద్భుతంగా కుదిరాయి.
Also Read: హీరామండీ రివ్యూ: స్వాతంత్ర్య సమరంలో వేశ్యల కథ - Netflix OTTలో భన్సాలీ తీసిన సిరీస్, ఎలా ఉందంటే?
ఇక నటీనటుల విషయానికి వస్తే... లీడ్ యాక్టర్స్ ముగ్గురూ అద్భుతమైన నటన కనపరిచారు. ఫూల్ పాత్రలో నితాన్షి గోయల్ చూపించిన అమాయకత్వం మనసులు గెలుచుకుంటుంది. జయ పాత్రలో ప్రతిభ కూడా అద్భుతంగా నటించారు. దీపక్ ఇప్పటికే ‘జంతారా’ సిరీస్‌తో ఆడియన్స్‌ను అలరించారు. ఈ సినిమాలో ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో అందరినీ ఆకట్టుకున్నారు.
ఓవరాల్‌గా చెప్పాలంటే... ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఎక్స్‌పెక్ట్ చేస్తే ‘లాపతా లేడీస్’ కచ్చితంగా చూడాల్సిందే. ఎలాగో ఓటీటీలోనే అందుబాటులో ఉంది కాబట్టి ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు దీనికి ఒక రెండు గంటల టైమ్ ఇవ్వవచ్చు.
Also Read: 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీ రివ్యూ: అల్లరోడి పెళ్లి కష్టాలు - మ్యాట్రిమోనీ మోసాలు... సినిమా ఎలా ఉందంటే?