Aa Okkati Adakku Movie Review - 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీ రివ్యూ: అల్లరోడి పెళ్లి కష్టాలు - మ్యాట్రిమోనీ మోసాలు... సినిమా ఎలా ఉందంటే?
Aa Okkati Adakku 2024 Review Telugu: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా యాక్ట్ చేసిన ఎంటర్‌టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు'. పెళ్లి సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ఎలా ఉందంటే?
మల్లి అంకం
అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా, జెమీ లివర్, 'వెన్నెల' కిశోర్, మురళీ శర్మ, గౌతమి, హర్ష చెముడు తదితరులు
అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా 'ఆ ఒక్కటీ అడక్కు'. ఫరియా అబ్దుల్లా హీరోయిన్. బ్యాక్ టు బ్యాక్ సీరియస్ సినిమాలతో హిట్స్ అందుకున్న నరేష్... వాటికి ముందు తనకు ఎక్కువ విజయాలు అందించిన కామెడీ జానర్ సినిమా చేయడంతో ప్రేక్షకుల చూపు పడింది. మరి, ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి.
కథ (Aa Okkati Adakku Movie Story): గణ అలియాస్ గణపతి (అల్లరి నరేష్) సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఉద్యోగి. తన కంటే ముందు తమ్ముడు (విరూపాక్ష ఫేమ్ రవికృష్ణ)కి, మేనమామ కూతురు దేవి (జేమీ లివర్)కి పెళ్లి చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో పాటు పెళ్లైన తమ్ముడు ఉండటంతో అతడికి పిల్లను ఇవ్వడానికి అమ్మాయి తల్లిదండ్రులు ఎవరూ ముందుకు రారు. పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. ఆ తర్వాత మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయమైన సిద్ధి (ఫరియా అబ్దుల్లా)తో ప్రేమలో పడతాడు. అయితే... 'నేను మీకు కరెక్ట్ కాదు' అని చెప్పి సున్నితంగా తిరస్కరిస్తుంది ఆ అమ్మాయి. కానీ, ఇద్దరూ స్నేహితులుగా మెలుగుతారు.
మ్యాట్రిమోనీలో తన పేరు నమోదు చేసుకుని అబ్బాయిల దగ్గర డబ్బులు దోచే ఖిలాడీ లేడి సిద్ధి అని వార్తల్లో ఎందుకు వచ్చింది? ఓ మ్యాట్రిమోనీ సంస్థ ప్రజల్ని ఏ విధంగా మోసం చేసింది? పెళ్లి కాని అబ్బాయిలు ఏ విధంగా మోసపోయారు? సిద్ధి ఎవరు? ఆమె నేపథ్యం ఏమిటి? నిజానిజాలు ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Aa Okkati Adakku Review Telugu): ఆ ఒక్కటీ అడక్కు... క్లాసిక్ టైటిల్. ఆ టైటిల్ తీసుకోవడం సాహసం. పైగా, ఆ సినిమా తీసిన ఈవీవీ తనయుడు 'అల్లరి' నరేష్ నయా 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమాలో హీరో కావడం, అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ అని చెప్పడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ప్రామిసింగ్ ట్రైలర్, పెళ్లి కాని యువకుల కష్టాలు అనే కాన్సెప్ట్ క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి. మరి, సినిమా ఎలా ఉంది? అనేది చూస్తే...
ఆ ఒక్కటీ అడక్కు... అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ అయితే కాదు! ఆ టైటిల్ తీసుకుని కామెడీ కోటింగ్ ఇస్తూ సీరియస్ సినిమా తీశారు. ప్రస్తుతం చాలా మంది యువతీ యువకులు ఫేస్ చేసే ప్రాబ్లమ్... సరైన పెళ్లి సంబంధం కోసం మ్యాట్రిమోనీ సైట్లను ఆశ్రయించడం! పెళ్లైన అమ్మాయిల నంబర్లను మ్యాట్రిమోనీ సైట్లు అబ్బాయిలకు ఇవ్వడం, మ్యాట్రిమోనీ సైట్లలో యువతీ యువకులకు ఎలాంటి పరిస్థితులు ఎదురు అవుతున్నాయనేది చూపించారు. అయితే... సీరియస్ ఇష్యూ మధ్యలో కామెడీ తగ్గింది.
పెళ్లి కాని యువకుడిగా అల్లరి నరేష్ ఇంట్రో, మరదలిగా జెమీ లివర్ సన్నివేశాలు సరదా సరదాగా ముందుకు వెళతాయి. డైనింగ్ టేబుల్ దగ్గర వెన్నెల కిశోర్ సీన్ హిలేరియస్‌గా నవ్విస్తుంది. అయితే... ఆ తర్వాత కథలో కామెడీ తగ్గింది. సీరియస్ ఇష్యూ డిస్కషన్ ఎక్కువైంది. అదంతా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది.
తమ్ముడికి ముందు పెళ్లి చేసి తాను ఎందుకు చేసుకోలేదు? అని హీరోయిన్ వేసిన ప్రశ్నకు చూపించిన అల్లరి నరేష్ ఫ్లాష్ బ్యాక్ ఆకట్టుకోలేదు. ఎన్నారై పెళ్లి కొడుకుల మోసాలు, మనం తరచూ వార్తల్లో చూసే విషయాలను టచ్ చేశారు. కథలో విషయం ఉంది. ఫేక్ పెళ్లి కూతురు కాన్సెప్ట్ కొత్తది. కానీ, దాని చుట్టూ కామెడీ జనరేట్ చేయడంలో 'ఆ ఒక్కటీ అడక్కు' టీమ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కాలేదు.
గోపీసుందర్ పాటల్లో 'రాజాది రాజా....' బావుంది. పిక్చరైజేషన్ కూడా బావుంది. కానీ మిగతా పాటలు ఆ స్థాయిలో లేవు. నేపథ్య సంగీతం సోసోగా ఉంది. సాధారణ సీన్లు తీయడానికి గ్రీన్ మ్యాట్ ఎందుకు వాడారో అర్థం కాలేదు. ఆ డిఫరెన్స్ స్క్రీన్ మీద తెలుస్తుంది. అయితే... ప్రొడక్షన్ విషయంలో నిర్మాతలు రాజీ పడలేదని కొన్ని సీన్లు చూస్తే అర్థం అవుతుంది.
Also Read: శబరి మూవీ రివ్యూ: వరలక్ష్మీ శరత్ కుమార్ సైకలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
గణపతి పాత్రలో అల్లరి నరేష్ ఒదిగిపోయారు. క్యారెక్టర్‌కు యాప్ట్ అయ్యారు. అయితే ఆయనకు తగ్గ పంచ్ డైలాగులు, కామెడీ సీన్లు పడలేదు. ఫరియా అబ్దుల్లా నటన ఓకే. హీరో హీరోయిన్ల పెయిర్ బావుంది. పృథ్వీ, గోపరాజు రమణ, ప్రవీణ్, గౌతమి వంటి క్యారెక్టర్ ఆర్టిస్టులను సరిగా వాడుకోలేదు. జెమీ లివర్ ఎక్స్‌ప్రెషన్స్, నటనలో ఆవిడ హుషారు బావుంది. ఫిమేల్ కమెడియన్ లేని లోటు తీరుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. పైన చెప్పినట్టు వెన్నెల కిశోర్ స్క్రీన్ మీద ఉన్నంత సేపూ నవ్వించారు. హర్ష చెముడు సీన్లు సైతం పేలాయి.
Aa Okkati Adakku Review: ఆ ఒక్కటీ అడక్కు... స్టార్టింగ్ టు ఎండింగ్ కామెడీ ఉంటుందా? అంటే 'యస్' అని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే... అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమాలో ఫుల్లుగా నవ్వించలేదు. కామెడీ ఒక్కటీ తక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. ప్రజెంట్ యూత్, పేరెంట్స్ రిలేట్ అయ్యే కాన్సెప్ట్ ఉంది. దాన్ని సరిగ్గా ప్రజెంట్ చెయ్యడంలోనూ, ప్రజలు ఆలోచించే విధంగా తీయడంలోనూ, నవ్వించడంలోనూ యూనిట్ సక్సెస్ కాలేదు. కొన్ని నవ్వుల కోసమే ఈ సినిమా!
Also Read: హీరామండీ రివ్యూ: స్వాతంత్ర్య సమరంలో వేశ్యల కథ - Netflix OTTలో భన్సాలీ తీసిన సిరీస్, ఎలా ఉందంటే?