Andhra Tourist Incident at Goa Beach | గోవాలో తెలుగు టూరిస్టును కొట్టి చంపేశారు | ABP Desam
గోవాలో పర్యటనకు వెళ్లిన తాడేపల్లిగూడెం యువకుడు బొల్లా రవితేజ మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. తాడేపల్లిగూడెం 6వార్డుకు చెందిన ఐదుగురు యువకులు, ముగ్గురు యువతులు కలిసి గోవా ట్రిప్ కు వెళ్లారు. అయితే అక్కడ ఓ దుకాణం యజమానితో జరిగిన గొడవ భారీ గొడవగా మారింది. కొనుక్కున్న పుడ్ రేట్ విషయంలో ప్రశ్నించాడని రవితేజకు తలపై కర్రలతో బాది చంపేశారు గోవాలో దుకాణం యజమానులు. తీవ్రగాయాలతో రవితేజను స్నేహితులు ఆసుపత్రికి అప్పటికే మరణించాడని చెప్పటంతో విషాదం నెలకొంది. తాడేపల్లి గూడెనికి రవితేజ మృతదేహాన్ని తీసుకురావటంతో కుటుంబసభ్యుల బాధ చెప్పలేనిది. రవితేజకు అంత్యక్రియలు పూర్తి చేసిన స్నేహితులు బాయ్ కాట్ గోవా అంటూ బైక్ ర్యాలీ చేశారు. టూరిస్టులపై దౌర్జన్యానికి దిగి చనిపోయేలా కొట్టిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రవితేజ స్నేహితులు డిమాండ్ చేశారు. బైక్ ర్యాలీలో నినాదాలు చేస్తూ తాడేపల్లి గూడెం మొత్తం తిరిగి జరిగిన ఘటనపై అందరికీ అవగాహన కల్పించారు.