అన్వేషించండి

Sabari Movie Review - శబరి మూవీ రివ్యూ: వరలక్ష్మీ శరత్ కుమార్ సైకలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Sabari Review In Telugu: వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఫిమేల్ ఓరియెంటెడ్ సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్ 'శబరి'. నేడు థియేటర్లలో విడుదల చేశారు. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి.

Psychological Thriller Sabari Review: వరలక్ష్మీ శరత్ కుమార్ నటనలో విలనిజం తెలుగులో సూపర్ హిట్. 'క్రాక్', 'యశోద', 'వీర సింహా రెడ్డి', 'కోట బొమ్మాళీ పీఎస్'లో విలన్ రోల్స్ చేసి విజయాలు అందుకున్నారు. 'హనుమాన్'లో హీరోకి అక్కగా పాన్ ఇండియా సక్సెస్ కొట్టారు. బట్, ఫర్ ఏ ఛేంజ్... తెలుగులో తొలిసారి వరలక్ష్మీ శరత్ కుమార్ ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ 'శబరి' చేశారు. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల ప్రొడ్యూస్ చిత్రమిది. దర్శకుడిగా అనిల్ కాట్జ్ మొదటి సినిమా. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేశారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్ ఎలా ఉందో రివ్యూలో చూడండి.

కథ (Sabari Movie Story): ఇంట్లో పెద్దలను ఎదిరించి మరీ ప్రేమించి పెళ్లి చేసుకున్న అరవింద్ (గణేష్ వెంకట్రామన్)ను వదిలేసి... కుమార్తె రియా (బేబీ నివేక్ష)తో కలిసి సంజూ అలియాస్ సంజన (వరలక్ష్మీ శరత్ కుమార్) విశాఖ వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో మొదలు పెడుతుంది. గతంలో అద్దెకు ఉన్న ఇంటికి వెళ్లినప్పుడు... మానసిక వికలాంగుల ఆశ్రమం నుంచి తప్పించుకున్న సూర్య (మైమ్ గోపీ) తన కోసం, తన కుమార్తె కోసం వెతుకుతున్నాడని సంజనకు తెలుస్తుంది.

సూర్య నేపథ్యం ఏమిటి? సంజన, ఆమె కుమార్తె కోసం అతనెందుకు వచ్చాడు? పోలీసు రికార్డుల్లో మరణించిన సూర్య ఎలా బతికొచ్చాడు? ముంబైలో భర్తను వదిలేసి సంజన విశాఖ ఎందుకు వచ్చింది? వాళ్లిద్దరి మధ్య గొడవలు ఏమిటి? కుమార్తెను సూర్య నుంచి ఎలా కాపాడుకుంది? ఆమెకు క్లాస్ మేట్ రాహుల్ (శశాంక్) ఏ విధమైన సాయం చేశాడు? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ (Sabari Review Telugu): వరలక్ష్మీ శరత్ కుమార్ ఫస్ట్ టైమ్ తెలుగులో ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ చేయడం, మదర్ అండ్ డాటర్ ఎమోషన్ మూవీ కావడంతో 'శబరి' ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి, సినిమా ఎలా ఉంది? అనేది చూస్తే...

Psychological Thriller Movies In Telugu: సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా 'శబరి'. అయితే... ఆ థ్రిల్ ఫ్యాక్టర్ ప్రీ ఇంటర్వెల్ వరకు ప్రారంభం కాలేదు. సిటీలో ఓ మెంటల్ ఆశైలం నుంచి ఒక వ్యక్తి తప్పించుకోవడం, ఇద్దరిని చంపి తల్లీ కుమార్తె కోసం మొదలుపెట్టే అన్వేషణతో సినిమాను ఆసక్తిగా ప్రారంభించాడు దర్శకుడు అనిల్ కాట్జ్. తర్వాత వరలక్ష్మితో మైమ్ గోపి ఫేస్ టు ఫేస్ సీన్స్, థ్రిల్ ఫ్యాక్టర్ కోసం ప్రీ ఇంటర్వెల్ వరకు వెయిట్ చేసేలా చేశాడు. అందువల్ల, అప్పటి వరకు సినిమా నిదానంగా ముందుకు వెళుతుంది.

వరలక్ష్మి క్యారెక్టర్ బాల్యం, తల్లితో అనుబంధం... సవతి తల్లితో గొడవ, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు దూరం  కావడానికి కారణం... ప్రీ ఇంటర్వెల్ వరకు థ్రిల్ కంటే ఎమోషనల్ డ్రామా ఎక్కువ నడిచింది. పరుగులు పెట్టాల్సిన కథనం చాలా నిదానంగా ముందుకు సాగింది. దాంతో మెరుపులు ఏం లేవు. ఇంటర్వెల్ ముందు ఒక్కసారిగా కథలో వేగం మొదలైంది. ఆ తర్వాత మళ్లీ కాస్త నెమ్మదించినా చివరకు పరుగులు పెట్టింది. మధ్యలో 'వన్ నేనొక్కడినే' గుర్తుకొస్తుంది. లాజిక్స్ విషయంలో దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. గోపీసుందర్ పాటలు కథతో పాటు ఫ్లోలో వెళ్లాయి. మళ్లీ వినేలా, గుర్తుంచుకునేలా లేవు. థ్రిల్లర్ సన్నివేశాలకు నేపథ్య సంగీతం చక్కగా చేశారు. ఈ మూవీ నిడివి తక్కువే. ఇంకాస్త ట్రిమ్ చేయవచ్చు. ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు పర్వాలేదు.

Also Read: హీరామండీ రివ్యూ: స్వాతంత్ర్య సమరంలో వేశ్యల కథ - Netflix OTTలో భన్సాలీ తీసిన సిరీస్, ఎలా ఉందంటే?


'శబరి'లో సంజన క్యారెక్టర్ నటిగా వరలక్ష్మి శరత్ కుమార్ ప్రయాణంలో డిఫరెంట్ అని చెప్పాలి. విలనిజం చూపిస్తూ పవర్ ఫుల్ క్యారెక్టర్స్ చేసిన ఆమె... సాధారణ మహిళగా డిఫరెంట్ ఎమోషన్స్ చూపించారు. మైమ్ గోపి రూపమే సన్నివేశాలకు కావాల్సిన ఫియర్ ఫ్యాక్టర్ తీసుకొచ్చింది.వరలక్ష్మి జోడీగా గణేష్ వెంకట్రామన్ తన నటనలో డ్యూయల్ షేడ్ చూపించారు. వరలక్ష్మికి సాయం చేసే వ్యక్తిగా పాత్రకు తగ్గట్టు శశాంక్ నటించారు. సునైనా, భద్రమ్ ఉన్నప్పటికీ కామెడీ వర్కవుట్ కాలేదు. ఆశ్రితా వేముగంటి ఓ ప్రధాన పాత్ర చేశారు.

శబరి... తెలుగులో వస్తున్న సినిమాలతో కంపేర్ చేస్తే ఒక డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్! ఎమోషనల్ టచ్ ఉన్న కాన్సెప్ట్! అయితే... ఫస్టాఫ్ స్లోగా వెళుతుంది. ఆ తర్వాత డిఫరెంట్ టర్న్స్ తీసుకుంటూ ముందుకు వెళుతుంది. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్లకు వెళ్ళండి. కొత్త వరలక్ష్మిని చూడవచ్చు.

Also Readరత్నం మూవీ రివ్యూ: విశాల్ హీరోగా సింగమ్ సిరీస్ హరి తీసిన సినిమా ఎలా ఉందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Govt News: పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు-  ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు- ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు
Harish Rao Phone Tapping Case Latest News: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం- మాజీ మంత్రి హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు
తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం- మాజీ మంత్రి హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

లవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP Desam

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt News: పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు-  ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు- ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు
Harish Rao Phone Tapping Case Latest News: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం- మాజీ మంత్రి హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు
తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం- మాజీ మంత్రి హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు
Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Tripura Bangladesh News: హోటల్స్‌లోకి బంగ్లాదేశీయులకు ఎంట్రీ లేదు- హోటల్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
హోటల్స్‌లోకి బంగ్లాదేశీయులకు ఎంట్రీ లేదు- హోటల్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
Lucknow News: పిలవని పెళ్లి భోజనానికి వెళ్లి లక్నో యూనివర్శిటీ విద్యార్థుల రచ్చ- ఎవరి తరపువాళ్లు అని అడిగినందుకు బంధువులపై దాడి
పిలవని పెళ్లి భోజనానికి వెళ్లి లక్నో యూనివర్శిటీ విద్యార్థుల రచ్చ- ఎవరి తరపువాళ్లు అని అడిగినందుకు బంధువులపై దాడి
Mandira On OTT: శృంగార తార సన్నీ లియోన్ నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్... ఆహా ఓటీటీలో రిలీజ్ ఎప్పుడంటే?
శృంగార తార సన్నీ లియోన్ నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్... ఆహా ఓటీటీలో రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget