అన్వేషించండి

Chiranjeevi: చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?

Chiranjeevi Remuneration: యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి భారీ రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారనే గాసిప్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ మారింది. ఒక్కో సినిమాకు వందల కోట్లు పోసి విజువల్ వండర్ గా తెరపైకి తీసుకొస్తున్నారు. అలాగే అలాంటి భారీ బడ్జెట్ సినిమాలకు హీరోలు కూడా అదే రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల రెమ్యూనరేషన్ 150 కోట్లకు పైగానే దాటిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎప్పటి నుంచో టాలీవుడ్ ఇండస్ట్రీకి బాస్ గా ఉన్న చిరు మాత్రం ఇంకా రెమ్యూనరేషన్ విషయంలో వెనుకబడిపోయారు. అయితే తాజాగా ఆయన కూడా తన కెరీర్ లోనే మొట్టమొదటిసారి హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారని తెలుస్తోంది. 

చిరు - ఓదెల మూవీకి భారీ రెమ్యూనరేషన్ 
'దసరా' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ గత నెలలో అఫీషియల్ గా వచ్చేసింది. పైగా ఈసారి బ్లడ్ బాత్ మామూలుగా ఉండదు అన్నట్టుగా చిరు, ఓదెల ఫోటోలలో కనిపించడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంతేకాదు ఈ మూవీకి నాని ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నాడు మరో ఇంట్రెస్టింగ్ విషయం. ఇదిలా ఉండగా తాజాగా ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతున్న గాసిప్ ప్రకారం చిరంజీవి... ఓదెల సినిమాకు తన కెరీర్ లోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఓదెల సినిమా కోసం చిరంజీవి 75 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తున్నట్టుగా టాక్ నడుస్తోంది. ఇక ఈ మూవీని నిర్మిస్తున్న నిర్మాత సుధాకర్ చెరుకూరి కూడా దీనికి అంగీకరించారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి భారీ అడ్వాన్స్ కూడా అందుకున్నారట. 

2026లో చిరు - ఓదెల మూవీ 
ప్రస్తుతం 'విశ్వంభర' మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న చిరంజీవి ఈ మూవీ పూర్తవగానే , నెక్స్ట్ మూవీ ని ఓదెల తో మొదలు పెట్టబోతున్నారు. మరోవైపు ఓదెలా తన సెకండ్ మూవీని కూడా నానితోనే చేస్తున్నారు. 'ది ప్యారడైజ్' పేరుతో రూపొందుతున్న ఆ సినిమా పూర్తయ్యాక, చిరు మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళానున్నారు ఓదెలా. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఒకే జానర్ లో రూపొందుతున్నాయి. ఇక 2026లో చిరు- ఓదెల మూవీ షూటింగ్ మొదలు కాబోతోంది. అయితే దీనికంటే ముందే చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడితో మరో మూవీని పూర్తి చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.

Also Read: హీరో సిద్ధార్థ్‌కి మళ్లీ చుక్కలే.. ఇప్పుడప్పుడే అల్లు అర్జున్ వదిలేలా లేడుగా!

వెనకబడిన సీనియర్ హీరోలు 
టాలీవుడ్ లో ఇంత భారీ మొత్తంలో పారితోషికం అందుకుంటున్న వెటరన్ స్టార్స్ లో చిరు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. కానీ యంగ్ హీరోలు మాత్రం ఎప్పుడో అంతకు రెండింతలు రెమ్యూనరేషన్ ను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీకి ఏకంగా 300 కోట్ల రూపాయలను అందుకున్నారని టాక్ నడిచింది. ఇక ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా 100 కోట్లకు పైగానే భారీగానే డిమాండ్ చేస్తున్నారు. అయితే చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ హీరోలు మాత్రం ఇంకా ఈ విషయంలో వెనుకబడిపోయారు.

Also Read: ‘గేమ్ చేంజర్’లో సెన్సార్ కట్ చేయమన్న పదాలు, సీన్లు ఇవే... రామ్ చరణ్ సినిమా నిడివి ఎంతంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR vs RCB IPL 2025 Match Highlights | కేకేఆర్ పై 7వికెట్ల తేడాతో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ | ABP Desamడీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Sushant Singh Rajput Case: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Vizag:  వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
Embed widget