అన్వేషించండి

Tasty Burfi Recipe : ఈజీగా చేయగలిగే టేస్టీ బర్ఫీ.. ఈ స్వీట్ రెసిపీ చాలా సింపుల్ గురూ

South Indian Sweets : మీకు స్వీట్స్  తినాలనిపించినా.. ఇంటికెవరైనా అతిథులు వస్తున్నప్పుడు వారికోసం స్వీట్స్ చేయాలనుకున్నా.. ఆలస్యం లేకుండా ఈ 7 కప్ప్ బర్ఫీని తయారు చేసేసుకోండి.

Quick and Easy Burfi Recipe : స్వీట్స్​ని చాలామంది ఇష్టంగా తింటారు. ముఖ్యంగా భోజనాల్లో స్వీట్స్ వేసే కల్చర్ ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తుంది. అలా మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారికి మీరు టేస్టీగా స్వీట్ చేయాలనుకుంటే ఈ టేస్టీ బర్ఫీని తయారు చేయవచ్చు. దీనిని 7 కప్ బర్ఫీ అంటారు. అంటే.. దీనిలో అన్ని పదార్థాలు కలిపి 7 కప్స్ ఉంటాయి అనమాట. మరి ఈ టేస్టీ స్వీట్​ని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో.. ఎలాంటి మిస్టేక్స్ చేస్తే బర్ఫీ టేస్ట్ మారిపోతుందో వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు 

పంచదార - 2 కప్పులు

శనగపిండి - 1 కప్పు

పాలు - 1 కప్పు

డ్రై ఫ్రూట్స్ పౌడర్ - 1 కప్పు

నెయ్యి - 1 కప్పు

కొబ్బరి తురుము - 1 కప్పు

యాలకులు - నాలుగు

తయారీ విధానం 

ముందుగా అరకప్పు జీడిపప్పు, అరకప్పు బాదం పప్పును డ్రై రోస్ట్ చేయాలి.  అనంతరం వాటిని కాస్త చల్లారనివ్వాలి. అప్పుడే అవి క్రంచీగా మారుతాయి. వాటిని మిక్సీ జార్​లో వేసి.. మెత్తగా పౌడర్ చేసుకోవాలి. దీనిని మనం బర్ఫీ చేయడె కోసం ముందుగా సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. దానిపై మందపాటి కడాయి పెట్టాలి. దానిలో శనగపిండి వేసి డ్రై రోస్ట్ చేయాలి. దానినుంచి ఒక మంచి సువాసన వచ్చేవరకు వేయిస్తే.. దానిలోని పచ్చి వాసన పోతుంది. 

స్టౌవ్ మంటతో జాగ్రత్త

శనగపిండి మంచి వాసన వస్తున్నప్పుడు దానిలో కొబ్బరి తురుము వేయాలి. బాగా కలుపుతూ.. ఓ నిమిషయం వేయించుకోవాలి. అనంతరం దానిలోనే ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేయాలి. అది కూడా శనగ పిండిలో బాగా కలిసేలా తిప్పుతూ ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అడుగుపట్టేస్తుంది. అంతేకాకుండా ఈ ప్రాసెస్ చేసే సమయంలో మంట తక్కువగానే ఉండేలా చూసుకోవాలి. అనంతరం దానిలో పాలు వేసి బాగా కలపండి. 

అడుగుపట్టకుండా కలపాలి..

పిండి పాలను పూర్తిగా అబ్జార్వ్ చేసుకుంటుంది. అలా కలిపిన దానిలో ఓ కప్పు నెయ్యి కూడా పోయాలి. నెయ్యిని కూడా కరిగించుకున్నది వేస్తే మంచిది. ఇలా నెయ్యి వేసిన వెంటనే దానిలో పంచదార వేయాలి. మిశ్రమాలన్నీ పూర్తిగా కలిసే వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చక్కెర కరిగి.. పిండిలో కలిసిపోయేవరకు అడుగుపట్టకుండా కలుపుతూనే ఉండాలి. మిశ్రమం బాగా దగ్గరకైనప్పుడు కాస్త పిండిని తీసుకుని చేతితో బాల్​గా చేస్తే షేప్ వస్తుంటే బర్ఫీ మిశ్రమం రెడీ. లేదంటే దానిని మరింత దగ్గరయ్యేవరకు కలుపుతూ ఉండాలి. 

చివరిగా ఇది వేసేస్తే..

బర్ఫీ బాల్​గా మారుతూ.. చేతికి అంటుకోకుండా తయారైతే.. మనం స్టౌవ్ ఆపాల్సిన సమయం వచ్చిందని అర్థం. చివర్లో యాలకుల పొడి వేసుకుని బాగా కలిపి.. స్టౌవ్ ఆపేయాలి. ఇప్పుడు ఓ ప్లేట్ లేదా కంచానికి.. నెయ్యి రాసి.. దానిలోకి ఈ మిశ్రమాన్ని ట్రాన్స్​ఫర్ చేయాలి. దానిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వాటిని ముక్కలుగా కట్ చేసి.. హాయిగా సర్వ్ చేసుకోవచ్చు. ఇది మంచి రుచినే కాకుండా ఆరోగ్యానికి కూడా కొన్ని ప్రయోజనాలు అందిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టేస్టీ రెసిపీని ట్రై చేసేయండి.

Also Read : ఎగ్​లెస్ కప్ కేక్స్.. మైదా లేకుండా ఇలా సింపుల్​గా చేసేయండి

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Embed widget