Telangana News: కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు, ప్రతివాదులకు నోటీసులు
Kancha Gachibowli lands | రంగారెడ్డి జిల్లాలోని కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల వివాదాస్పద భూమిపై నమోదైన పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది.

HCU Lands Issue | హైదరాబాద్: వివాదాస్పద కంచ గచ్చబౌలి భూములపై విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. ఏప్రిల్ 24కు 400 ఎకరాల భూములపై దాఖలైన పిటిషన్లను విచారణ వాయిదా వేసింది. కౌంటర్ దాకలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ భూమి ప్రభుత్వానిదేనని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు చెబుతున్నారు. అందుకు సంబంధించి టీజీఐఐసీ ప్రకటన సైతం విడుదల చేసింది. కానీ అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని, అటవీ భూములు అని వన్య ప్రాణులను రక్షించాలని.. భవిష్యత్ తరాలకు సమాధానం చెప్పుకోలేం అంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెబుతున్నారు.
కంచ గచ్చిబౌలి భూ వివాదంఫై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఆ 400 ఎకరాలలో చెట్ల నరికి వేతపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద భూములపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ పిటిషన్ విచారణ చేపట్టింది. మరోవైపు ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టవద్దంటూ సుప్రీం కోర్టు ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. కౌంటర్, రిపోర్ట్ ఈ నెల 24లోగా సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 24కు పిటిషన్ల విచారణకు వాయిదా వేసింది.
ఫేక్ ప్రచారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
కంచ గచ్చిబౌలి భూముల వివాదం జాతీయస్థాయికి వెళ్లింది. దాంతో ప్రభుత్వం అప్రతిష్టపాలు అవుతోందని తెలంగాణ సర్కార్ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. అది ప్రభుత్వం భూమి అని, కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం చేపిస్తున్న ఫేక్ ప్రచారంతో వివాదం ముదురుతోందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్‌లో ఇలాంటి ప్రచారం జరగకుండా చర్యలు చేపట్టాలని, ఏఐ జనరేటెడ్ ఫొటోలు, వీడియోలతో వివాదం ముదిరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం అవగాహనా లేకుండా, మ్యాటర్ తెలుసుకోకుండా కొందరు సెలబ్రిటీలు సైతం అది హెచ్‌సీయూ భూమి అని నమ్మి వీడియోలు చేయడం బాధాకరం అన్నారు.

హైదరాబాద్ యూనివర్సిటీ భూములను లాక్కుంటున్నామని సోషల్ మీడియాలో కృత్రిమంగా వివాదం సృష్టించారని సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో అన్నారు. అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చూసి ఓర్వలేక, కొన్ని పార్టీల నేతలు కంచ గచ్చిబౌలి భూములపై రాద్దాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. వంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, అటవీ శాఖ అధికారులు సీఎం నిర్వహించిన సమీక్షలో పాల్గొన్నారు.