Peddi First Shot Reactions: ప్రభాస్ బౌలింగ్‌లో చరణ్ సిక్సర్... క్యాచ్ పట్టిన బాలయ్య, పవన్, ఎన్టీఆర్... 'పెద్ది' మీమ్స్ అదుర్స్ అంతే
Peddi Multiverse: పెద్ది ఫస్ట్ షాట్ సూపర్బ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే... ఆ షాట్ కొట్టింది ఎవరి బౌలింగ్‌లోనో తెలుసా? చరణ్ సిక్సర్ కొట్టినప్పుడు బాలయ్య, పవన్, ఎన్టీఆర్ క్యాచ్ పడితే? ఈ ఎడిట్స్ చూడండి.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) 'పెద్ది' ఫస్ట్ షాట్ (Peddi First Shot) అదిరింది. హీరో ఫ్రంట్ ఫుట్ వచ్చి మరి షాట్ కొట్టడం, ఆ స్టైల్ ఆడియన్స్ అందరికీ నచ్చింది. 'పెద్ది' వీడియోపై మీమ్స్ బోలెడు వచ్చాయి. అయితే... బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ ఈ సినిమా చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? వాళ్లను పెట్టి ఎడిట్ చేసిన వీడియోస్ అయితే సూపర్ ఉన్నాయి. విరాట్ కోహ్లీని సైతం తీసుకొచ్చారు.
సేమ్ టు సేమ్ విరాట్ కోహ్లీలా కొట్టాడే!
రామ్ చరణ్ బ్యాటింగ్ స్టైల్ కింగ్ కోహ్లీని తలపించిందని ఒక నెటిజన్ వీడియో పోస్ట్ చేశాడు. చరణ్ ఫ్రంట్ ఫుట్ వరకు రావడం చూపించిన తర్వాత కోహ్లీ కొట్టిన సిక్సర్ వీడియో యాడ్ చేశారు. అది చూస్తే ఇద్దరు బ్యాటింగ్ స్టైల్ ఒకేలా ఉందని అనిపించక తప్పదు. అన్నట్టు గతంలో ఒకసారి తనకు గనుక క్రికెటర్ బయోపిక్ చేసే అవకాశం వస్తే విరాట్ కోహ్లీ బయోపిక్ చేస్తానని రామ్ చరణ్ చెప్పారు. ఆ ఛాన్స్ భవిష్యత్తులో వస్తుందేమో చూడాలి.
Also Read: ఓటీటీలోకి ఈ వారమే 600 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
RC × KOHLI ⚡#PeddiFirstShot #Peddi pic.twitter.com/Y3vqS5YdSm
— Oggg🦅 (@KottapalliAbhi2) April 6, 2025
బౌలింగ్ చేసింది ప్రభాస్... సారీ సలార్!
క్యాచ్ పట్టింది బాలయ్య, పవన్, ఎన్టీఆర్!
రామ్ చరణ్ భారీ షాట్ కొట్టారు సరే... మరి బౌలింగ్ చేసింది ఎవరు? అంటే రెబల్ స్టార్ ప్రభాస్ అంటున్నారు నెటిజన్స్. 'సలార్' సినిమాలో చిన్న పిల్లలతో ప్రభాస్ క్రికెట్ ఆడే సన్నివేశం ఒకటి ఉంటుంది. రెబల్ స్టార్ బౌలింగ్ చేసినప్పుడు ఒక చిన్నారి సిక్సర్ కొడతాడు. అప్పుడు ప్రభాస్ సెల్యూట్ చేస్తాడు. ఆ సిక్సర్ కొట్టింది రామ్ చరణ్ అంటూ ఒక ఎడిటెడ్ వీడియో వైరల్ అవుతోంది.
Ayyaa Balayyaaa pic.twitter.com/jh4T6n7jdd
— Dileepuu (@Bittu_Tweetzz) April 6, 2025
'అఖండ' సినిమాలో 'జై బాలయ్య' సాంగ్ గుర్తుందా? అందులో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ ఒక బాల్ క్యాచ్ పెడతారు. చరణ్ సిక్సర్ కొడితే బాలయ్య క్యాచ్ పట్టారని సరదాగా ఒకరు వీడియో చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జల్సా' సినిమాలో కూడా ఒక బాల్ క్యాచ్ పడతారు. అలాగే ఎన్టీఆర్ మరో సినిమాలో క్యాచ్ పట్టిన వీడియో కూడా ఉంది. వీటన్నిటితో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో ఫాన్స్ వైరల్ చేస్తున్నారు. ఆ హిలేరియస్, ఇంట్రెస్టింగ్ వీడియో ఎడిట్స్ అన్ని చూడండి.
#Multiverse in Cricket 🏏
— Milagro Movies (@Milagromovs) April 6, 2025
Batsman- #Peddi💥
BOWLER- #Deva💥
Fielding - #SanjaySaahu💥pic.twitter.com/pEZz1dB2dN
Peddi out 😂 pic.twitter.com/5KPcCbwvYs
— …. (@urstrulyARJUN11) April 6, 2025
No one asked united TFI edit 😎🌚#PeddiFirstShot #peddi pic.twitter.com/FFF7Xe4gug
— . (@Butcher_4005) April 6, 2025
Out bro @PeddiMovieOffl pic.twitter.com/o75OC9tqmS
— Pola Adiripolaa (@pola_adiripolaa) April 6, 2025
Wait for the unexpected Cameo 🔥#PeddiFirstShot #RamCharanRevolts pic.twitter.com/8lECj5k2yn
— Narendraᴼᴳ🚩 (@Kalyan___Cult) April 6, 2025
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

