Tasty Eggless Cake : ఎగ్‌లెస్ కప్ కేక్స్.. మైదా లేకుండా ఇలా సింపుల్‌గా చేసేయండి
Cup Cakes Recipe : పిల్లలకు టేస్టీగా ఏమైనా తినిపించాలనుకున్నప్పుడు మీరు ఇంట్లో కప్ కేక్స్ తయారు చేయవచ్చు. ఓవెన్ లేకుండా ఎగ్‌లెస్ కప్‌కేక్స్ ఎలా చేయాలో చూసేద్దాం.
Eggless Cake Recipe : కేక్స్ అనగానే చాలామంది వాటిలో ఎగ్ ఉంటాది అని తినరు. కానీ ఎగ్ లేకుండా, మైదాని వాడకుండా కూడా మనం టేస్టీ కేక్స్ తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా వాటిని వండేందుకు ఓవెన్ ఉండాలి అనుకుంటారు. కానీ వాటిని ఇవేమి లేకుండా.. ఇంట్లో సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు. వాటిని ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో? ఎలా చేస్తే మంచి రుచి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
బెల్లం - అరకప్పు
పెరుగు - అరకప్పు
బటర్ - పావు కప్పు
గోధుమ పిండి - 1 కప్పు
కోకా పౌడర్ - 2 టేబుల్ స్పూన్స్
మిల్క్ పౌడర్ - 2 టేబుల్ స్పూన్స్
బేకింగ్ పౌడర్ - 1 టీస్పూన్
బేకింగ్ సోడా - పావు టీస్పూన్
పాలు - ముప్పావు కప్పు
చాక్లెట్ - 2 ముక్కలు
తయారీ విధానం
ముందుగా బటర్‌ను వేడి చేసి మెల్ట్ చేసుకోవాలి. అనంతరం బెల్లాన్ని సన్నగా తురుముకోండి. మిక్సీ వేయకుండా చిన్నచిన్నగా తురుముకోవాలి. దీనిని ఓ మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. దానిలో బెల్లం వేయండి. అనంతరం పెరుగు, మెల్ట్ చేసిన బటర్ వేసుకోవాలి. పెరుగు ఫ్రెష్‌గా ఉండాలి. అసలు పులియని పెరుగును మాత్రమే దీనికోసం తీసుకోవాలి. ఒకవేళ పెరుగు ఫ్రెష్‌గా లేకుండా.. పుల్లని రుచిని ఇస్తుంటే దానిని ఉపయోగించకపోవడమే మంచిది.
బటర్, బెల్లం, పెరుగు బాగా మిక్స్ అయ్యేలా కలపండి. మిక్సింగ్ ఎంత బాగా చేస్తే.. కేక్స్ అంత మంచిగా వస్తాయి. ఇప్పుడు మరో బౌల్ తీసుకుని.. దానిలో గోధుమ పిండిని జల్లించుకోవాలి. ఆ పౌడర్‌లో కోకాపౌడర్ వేసుకోవాలి. దానిలోనే మిల్క్ పౌడర్ కూడా వేయాలి. ఇలా చేయడం వల్ల ఈ పౌడర్స్ అన్ని బాగా కలుస్తాయి. రుచిని పెంచుతాయి. బేకింగ్ పౌడర్ కూడా వేసేయండి. అవన్నీ బాగా కలిసిన తర్వాత బేకింగ్ సోడా కూడా వేసి.. బాగా కలిపి.. ముందుగా సిద్ధం చేసుకున్న బెల్లం మిశ్రమంలో కలుపుకోవాలి.
ఉండలు లేకుండా ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. దానిలో పాలు వేస్తూ.. మెత్తగా కలుపుతూ.. మంచి క్రీమీగా వచ్చేలా పిండిని బాగా కలుపుకోవాలి. చాక్లెట్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ మిశ్రమంలో వేయాలి. ఈ మిశ్రమాన్ని చిన్న కప్పులలో వేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఈ కప్స్‌ని ప్లేస్ చేయాలి. వీటిని ప్లేస్ చేసే ముందు ఇడ్లీ కుక్కర్ అడుగు భాగంలో కాస్త నీరు పోయాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి ఇడ్లీ కుక్కర్‌ని పెట్టాలి. 20 నుంచి 25 నిమిషాల్లో ఈ కప్ కేక్స్ రెడీ అయిపోతాయి. వీటిని హాయిగా లాగించేవచ్చు. పిల్లలకు ఇవి బాగా నచ్చుతాయి. వీటిని పెద్దలు కూడా హాయిగా లాగించేయవచ్చు. దీనిలో బెల్లం వేస్తాము కాబట్టి మంచి రుచితో పాటు.. ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మరి ఈ సమ్మర్ హాలీడేస్ అయ్యేలోపు పిల్లలకి వీటిని ఇంట్లో చేసి తినిపించేయండి.
Also Read : బంగాళదుంపలతో దోశలు.. మినపప్పు లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు