మొబైల్‌తో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చట!
మోబైల్ హెల్త్ ఇంటర్వెన్షన్ ద్వారా మెరుగైన జీనన శైలీ మెరుగుపరుచుకోవడం వల్ల సెకండరీ స్ట్రోక్ ను సమర్థవంతంగా నివారించడం సాధ్యపడిందని తెలుస్తోంది.
భారతదేశంలో నిర్వహించిన ఒక అధ్యయన వివరాలను లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ లో ప్రచురించారు. మొబైల్ లేదా ఏదైనా ఇతర వైర్లెస్ పరికరాలను వినియోగించి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం లేదా అనారోగ్యాలను నివారించడాన్ని మొబైల్ హెల్త్ (mHealth) అని చెప్పవచ్చు. ఇండియాలోని 31 స్ట్రోక్ సెంటర్లలో ఈ అధ్యయనం జరిగింది. పేషెంట్లకు ఎస్ఎమ్ఎస్ సందేశాలు, ఆరోగ్యానికి సంబంధించిన అవగాహానా వీడియోలు, స్ట్రోక్ నివారణ వర్క్ బుక్ లతో కూడిన ప్యాకేజిని ట్రయల్ గా అందించారు.
ఈ ట్రయల్ ను స్ప్రింట్-ఇండియా (సెకండరీ ప్రివెన్షన్ బై స్ట్రక్చర్డ్ సెమీ-ఇంటరాక్టివ్ స్ట్రోక్ ప్రివెన్షన్ ప్యాకేజీ) నిర్వహించారు. ఇది ICMRకు చెందిన ఇండియన్ స్ట్రోక్ క్లినికల్ ట్రయల్ నెట్‌వర్క్ (INSTRuCT) కింద ఇండియాలోని స్ట్రోక్ రెడీ సెంటర్లలో నిర్వహించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రపంచంలోనే నాలుగో ప్రభుత్వ సహాయంతో నడుస్తున్న నెట్వర్క్ గా చెప్పుకోవచ్చు.
ఇంత పెద్ద మొత్తంలో సెంకండరీ స్ట్రోక్ ను నివారించడంలో mHealth పనితీరును అంచనావేసేందుకు దేశంలోనే జరిగిన మొదటి స్టడీ అని ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే మొదటిది కూడా కావచ్చని నాన్ కమ్యునికబుల్ డిసీజెస్ డివిషన్ కుచిందిన సైంటిస్ట్ - జీ డాక్టర్ మీనాక్షీ శర్మ అన్నారు. స్ట్రోక్ పేషెంట్ల కోసం ఎమ్ హెల్త్ ద్వారా ఏర్పాటు చేసిన సెమీ ఇంటరాక్టివ్ మల్టీకేర్ రాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్ అని ICMR ఒక ప్రకటనలో చెప్పింది.
మొబైల్ ఫోన్ ద్వారా ఇచ్చే మెసేజ్‌ల్లో బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ అదుపులో పెట్టుకోవడం గురించి, రోజువారీ చేసే శారీరక శ్రమ గురించి, ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం గురించి, స్ట్రోక్ ను నివారించేందుకు మందులు మానకుండా ఉండడం గురించి వివరాలు అందించడం మీద దృష్టి నిలిపాయి. అవగాహన కల్పించే మెటిరియల్‌ను 12 ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉంచారు.
కంట్రోల్ గ్రూప్ లోని పేషెంట్లకు ప్రామాణికమైన కేర్ దొరికింది. ఇంటర్వేన్షన్ ఆర్మ్ లో ఉన్నవారికి ఆరోగ్యవంతమైన జీవనశైలి, ముందులు క్రమం తప్పకుండా తీసుకునేట్టుగా ఉండడానికి అవసరమైన అవగాహాన మెటిరీయల్‌ను వారానికి ఒకసారి మొబైల్ ద్వారా మెటిరియల్ అందుకున్నారని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.
దాదాపుగా 4298 మంది పేషెంట్లు ఈ ప్రణాళికలో భాగం కాగా ఇంటర్వెన్షన్ ఆర్మ్ లో 2148 మంది, కంట్రోల్ ఆర్మ్ లో 2150 మంది భాగం పంచుకున్నారు. 1502 పేషెంట్లు ఇంటర్వెన్షన్ ఆర్మ్ నుంచి 1536 పేషెంట్లు కంట్రోల్ ఆర్మ్ నుంచి సంవత్సర కాలం నుంచి కూడా ఫాలోఅప్ లో ఉన్నారు. రెండో సారి స్ట్రోక్ రాకుండా నివారించేందుకు ఈ ట్రయల్ లో సంక్లిష్టమైన బిహేవియరల్ ఇంటర్వెన్షన్స్ ను ఉపయోగించారట. స్ట్రక్చర్డ్ సెమీ-ఇంటరాక్టివ్ స్ట్రోక్ ప్రివెన్షన్ ప్ర్యాకేజీ ద్వారా ఆరోగ్యవంతమైన జీవన శైలీ, మందులు క్రమం తప్పకుండా వేసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా లాభాలు పొంది ఉండవచ్చు.
గుండెకు సంబంధించిన సమస్యలు వాటి ప్రభావం, మరణాలను అంచనా వేయడంలో ఈ ట్రయల్ ఒక అడుగు ముందుకు వేసింది. కానీ ఇంటర్వెన్షన్, కంట్రోల్ గ్రూపుల మధ్య వ్యత్యాసాన్ని అంచనా వెయ్యడానికి ఫాలోఅప్ పీరియడ్ చాలా తక్కువగా ఉంది. ఈ ట్రయల్ ఫలితాలను లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ లో 14 ఫిబ్రవరి 2023 లో ప్రకటించారు.
పొగతాగే అలవాటు మానుకున్న వారు 83 శాతం, మద్యం మానేసిన వారు 85 శాతం వరకు ఉన్నారు. కంట్రోల్డ్ గ్రూప్ తో పోలిస్తే ఇంటర్వెన్షన్ గ్రూప్ లో మంచి మార్పులు కనిపించాయని క్రిష్టియన్ మెడికల్ కాలేజి లుథియానాకు చెందిన డాక్టర్ జయరాజ్ పాండియన్ అన్నారు. అదుపులో లేని బ్లడ్ ప్రెషర్ వల్ల ఇస్కిమిక్ హెమరీజిక్ స్ట్రోక్లకు మొదటి కారణంగా చెప్పవచ్చు. అదుపులోలేని షుగర్, కొలెస్ట్రాల్, పొగతాగే అలవాటు, ఆల్కాహాల్ తీసుకోవడం, తగినంత వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వంటి వన్నీ కూడా స్ట్రోక్ కు కారణం అవుతాయి. అదీ కాక మన దేశంలో దాదాపు 15 నుంచి 20 శాతం మందిలో స్ట్రోక్ పనరావృతం అయ్యే ప్రమాదం ఉంటుంది.
స్ట్రోక్ తర్వాత కొన్ని రోజులకు మందులు మానెయ్యడం, బీపీ, షుగర్లు అదుపులో పెట్టుకోకపోవడం, పొగతాగడం, మద్యపానం కొనసాగించడం వంటివన్నీ ఇలా స్ట్రోక్ పునరావృతం కావడానికి కారణాలు. వీటి నుంచి స్ట్రోక్ రోగులను కాపాడడం లో ఎంహెల్త్ మంచి ప్రాత్ర పోషించిందని ఈ అధ్యయనం రుజువు చేస్తోంది. సో.. అలా మొబైల్ మన ఆరోగ్యాన్ని కాపాడుతోందన్నమాట.