Phoenix Movie Release Date: విజయ్ సేతుపతి కొడుకు మూవీ 'ఫీనిక్స్' - రిలీజ్ ఎప్పుడంటే?
Phoenix Movie: కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కుమారుడు సూర్య మూవీ 'ఫీనిక్స్' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను విజయ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Vijay Sethupathi Son Surya Phoenix Movie Release Date: కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కుమారుడు సూర్య (Surya) ఫస్ట్, లేటెస్ట్ మూవీ 'ఫీనిక్స్' (Phoenix). ఈ సినిమా కోసం అటు కోలీవుడ్ ఫ్యాన్స్‌తో పాటు ఇటు మూవీ లవర్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను సోషల్ మీడియా వేదికగా విజయ్ సేతుపతి అనౌన్స్ చేశారు.
జులై 4న రిలీజ్
ఈ మూవీ జులై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు విజయ్ సేతుపతి తన కుమారుడి సినిమా పోస్టర్‌ను షేర్ చేశారు. 'జులై 4న ఫీనిక్స్ ఉదయిస్తుంది. అగ్ని, పోరాటం, పూర్తి ఉగ్రతను చూసేందుకు సిద్ధంగా ఉండండి.' అంటూ రాసుకొచ్చారు. దీంతో కోలీవుడ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Its Time to Rise and Conquer ❤️🔥#Phoenix rises this July 4th – get ready to witness the fire, the fight, and the full force of fury 💥#Veezhaan#PhoenixFromJuly4
— VijaySethupathi (@VijaySethuOffl) April 25, 2025
A @SamCSmusic Musical! @ActionAnlarasu @AkBraveman @5starsenthilk @suryaVoffcial @varusarath5 @ActorMuthukumar… pic.twitter.com/n6z3IiEyOS
యాక్షన్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి ప్రముఖ ఫైట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న సూర్య.. తనదైన స్టైల్, యాక్షన్‌తో అదరగొట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో అబి నక్షత్ర, వర్ష హీరోయిన్లుగా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను బ్రేవ్ మ్యాన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుండగా.. సామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. వేల్ రాజ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్‌గా ఉన్నారు.
సూర్య.. తన తండ్రి విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన 'నేనూ రౌడీనే', 'సింధుబాద్' సినిమాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత రీసెంట్‌గా రిలీజ్ అయిన 'విడుదలై: పార్ట్ 2' మూవీలో గెస్ట్ రోల్ చేశారు. తాజాగా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మరోవైపు, అనల్ అరసు కూడా 'ఫీనిక్స్' మూవీతోనే దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీమంతుడు, బ్రూస్ లీ, జనతా గ్యారేజ్, జై లవకుశ వంటి తెలుగు మూవీస్‌కు ఫైట్ మాస్టర్‌గా చేశారు. ఈ క్రమంలో 'ఫీనిక్స్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక విజయ్ సేతుపతి ప్రస్తుతం టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. పూరి కనెక్ట్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందెన్నడూ చూడని రీతిలో ఓ డిఫరెంట్ లుక్‌లో విజయ్ కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుండగా.. తెలుగు, తమిళంతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మూవీ రిలీజ్ కానుంది.





















