BMW New Bike: BMW కొత్త బైక్ గురూ - దీని పవర్ ముందు కార్ కూడా బలాదూర్!
BMW R 1300 RT Bike: BMW తన 1300cc లైనప్‌ను విస్తరిస్తోంది, ఈ నెలాఖరులో కొత్త R 1300 RTని ఆవిష్కరించబోతోంది. దీని ఫీచర్ల నుంచి మైలేజ్ వరకు పూర్తి వివరాలు తెలుసుకోండి.

BMW R 1300 RT Bike Price and Feature: BMW Motorrad లెజండరీ టూరింగ్ సిరీస్‌లో త్వరలో కొత్త మోడల్ యాడ్ కాబోతోంది. జర్మన్ ఆటో దిగ్గజం BMW, తన కొత్త R 1300 RT బైక్‌ను మరో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఉన్న R 1250 RT స్థానంలోకి కొత్త బైక్ వస్తుంది & టూరింగ్‌ను సరికొత్తగా అనుభవంలోకి తీసుకొస్తుంది. ఈ కొత్త టూరర్ బైక్‌ను ప్రత్యేకంగా సుదూర ప్రయాణాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. స్పోర్టి స్టైలింగ్, కంఫర్టబుల్ ఫీచర్లు, పవర్‌ఫుల్ ఇంజిన్‌ను కలగలిపి ఈ బైక్ తయారు చేశారు.
BMW R 1300 RT ఇంజిన్ & పవర్‌ట్రెయిన్
ఇటీవల R 1300 GS (1300cc బాక్సర్-ట్విన్ ఇంజిన్)లో అందించిన ఇంజినే కొత్త BMW R 1300 RT బైక్‌లోనూ ఉంటుంది. ఈ ఇంజిన్ 7,750rpm వద్ద 145bhp గరిష్ట శక్తిని & 6,500rpm వద్ద 149Nm గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజిన్‌ను 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించారు, ఇది వేగాన్ని & అవాంతరాలు లేని ప్రయాణాన్ని అందిస్తుంది. రిపోర్ట్‌ల ప్రకారం, BMW కొత్త మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌పై కూడా పని చేస్తుంది, ఇది రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత రిలాక్స్‌డ్‌గా మారుస్తుంది. ఈ పవర్‌ట్రెయిన్ R 1300 RT ని సుదూర పర్యటనలకు సరైన ఎంపికగా మారుస్తుంది - పవర్, స్టెబిలిటీ, & ఎఫిషియెన్సీని అద్భుతమైన రీతిలో అందిస్తుంది.
డిజైన్ & లుక్
దీని పూర్తి స్థాయి డిజైన్ ఇంకా వెల్లడి కాలేదు. అయితే.. స్పై షాట్స్, టీజర్ల ద్వారా కొంత కీలక సమాచారం పొందవచ్చు. ఈ బైక్ నిలువుగా ఉండే LED హెడ్‌లైట్ సెటప్ & DRL ఉన్నాయి, ఇవి మోడర్న్ అపీల్‌ను అందిస్తాయి. కొత్త మోడల్ పారదర్శక వైజర్ & బూమరాంగ్ ఆకారపు ఫెయిరింగ్‌తో వస్తుంది. ఈ ఫెయిరింగ్ R 1250 RT కంటే భిన్నంగా ఉంటుంది, అదే సమయంలో దాని హెవీ డ్యూటీ ప్రెజన్స్‌కు ఏమాత్రం ఇబ్బంది రానీయదు. హై-స్పీడ్ టూరింగ్ సమయంలో స్థిరత్వం, భద్రత & సౌకర్యం ఉండేలా డిజైన్‌లో ఏరోడైనమిక్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
టెక్నాలజీ & ఫీచర్లు
BMW R 1300 RT శక్తిమంతమైన ఇంజిన్‌తో పాటు అనేక అడ్వాన్స్‌డ్ ఫీచర్లను కూడా యాడ్ చేశారు, అవన్నీ కలిసి ఈ బండిని ప్రీమియం & హై-టెక్ టూరింగ్ బైక్‌గా ఆవిష్కరిస్తాయి. దీనిలో పెద్ద TFT డిస్‌ప్లే ఉంది, ఇది స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి రెయిన్, రోడ్ & డైనమిక్ వంటి మల్టీ రైడింగ్ మోడ్ ఆప్షన్లు అందిస్తున్నారు. భద్రత విషయానికి వస్తే.. ట్రాక్షన్ కంట్రోల్ & యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ఏర్పాటు చేశారు. రిమోట్ కీలెస్ ఎంట్రీ & హీటెడ్ సీట్లు వంటి లగ్జరీ ఫీచర్లను కూడా జోడించినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
ధర & లాంచింగ్ తేదీ
BMW, కొత్త R 1300 RT బైక్ అధికారిక ధరను ఇంకా ప్రకటించలేదు. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం, దీని ఎక్స్-షోరూమ్ ధర భారతదేశంలో రూ. 25 లక్షలు పైగా ఉండవచ్చు. ఈ బైక్ ఏప్రిల్ 29, 2025న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది, భారతదేశంలో 2025 మధ్యనాటికి లేదా చివరినాటికి ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.





















