అన్వేషించండి

QUIT Smoking: స్మోకింగ్‌ మానేస్తే మీ శరీరంలో కలిగే మార్పులు ఇవే - ఇవన్నీ తట్టుకుంటేనే సక్సెస్

Quit Smoking: కారణం ఏదైనా పొగ తాగడం మానేయాలని అనుకుంటారు చాలామంది. ఇక ఇప్పుడు కొత్త ఏడాది మొదట్లో ఉన్నాం. దీంతో చాలామంది స్మోకింగ్‌ని క్విట్‌ చేయాలనే రెజల్యూషన్స్‌ తీసుకుని ఉంటారు.

పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అనే పదే పదే చెబుతుంటారు. ఈ విషయం స్వయంగా సిగరెట్‌ ప్యాకెట్లపై రాసి ఉంటుంది. అయినా చాలామంది.. దాన్ని కనీసం పట్టించుకోరు. రోజుకు పెట్టెలు, పెట్టెలు సిగరెట్లు తాగేస్తుంటారు. అలా ఒక స్టేజ్‌కి వెళ్లిన తర్వాత.. అనారోగ్యం లేదా మరేదైనా కారణం వల్ల స్మోకింగ్‌కు పుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తారు. న్యూ ఇయర్‌లో భాగంగా కూడా కొందరు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే, నిర్ణయం తీసుకోవడం సులభమే. కానీ, అలవాటును మానుకోవడమే కష్టం. ఒక వేళ దాన్ని సక్సెస్‌ఫుల్‌గా పాటిస్తే.. ఎంతో మేలు జరుగుతుంది. కానీ, శరీరంలో ఏర్పడే కొన్ని మార్పులతో పోరాడాల్సి ఉంటుంది.

అకస్మాత్తుగా స్మోకింగ్ మానేయడం వల్ల ఏదో జరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. పిచ్చి లేస్తుందన్నట్లుగా ఉంటుంది. అయితే, అందుకు భయం అక్కర్లేదు అని చెప్తున్నారు డాక్టర్లు, రిహాబిలేషన్ సెంటర్‌లోని నిపుణులు. స్మోకింగ్‌ మానేసిన తర్వాత.. మనిషి శరీరంలో, మానసిక స్థితిలో ఎలాంటి మార్పు వస్తుందో వివరించారు. మరి అది మీరూ చదవండి. స్మోకింగ్‌ మానేసే వాళ్లకి ఎలాంటి మార్పులు వస్తాయో చెప్పి అవగాహన కల్పించండి. స్మోకింగ్‌ మానేసిన మొదటి రోజు ఏమవుతుంది? ఏడాది తర్వాత ఏమవుతుందో స్పష్టంగా తెలుసుకోండి.

మొదటి గంట.. 

కొంతమంది పొద్దున్నే లేచిన వెంటనే స్మోకింగ్‌తో తమ డే స్టార్ట్‌ చేస్తారు. అలా మానేసిన రోజు పొద్దున్నే లేవగానే సిగరెట్‌ తాగకపోతే.. వాళ్లకు గందరగోళంగా ఉంటుందట. బీపీ తగ్గిపోయి, సిగరెట్‌ తాగాలి అనే కోరిక ఘోరంగా పెరిగిపోతుందట.

4 నుంచి 8 గంటల తర్వాత.. 

సిగరెట్‌ మానేసిన కొన్ని గంటల్లోనే మార్పు కనిపిస్తుందని చెప్తున్నారు నిపుణులు. సిగరెట్‌ మానేసిన 4 నుంచి 8 గంటల్లోనే ఒంట్లోని ఆక్సిజన్‌ లెవెల్స్‌ రికవర్‌ అవ్వడం మొదలవుతాయి. సిగరెట్లు ఎక్కువగా తాగడం వల్ల ఏర్పడిన కార్బన్‌ మోనాక్సైడ్‌ క్రమంగా తగ్గుతూ వస్తుందని చెప్తున్నారు నిపుణులు.

12 గంటలకు ఇలా.. 

సిగరెట్‌ మానేసి 12 గంటలు. అంటే సగం రోజు గడిచిపోయింది. అయితే, ఇప్పుడే ఏదో తెలియని ఆలోచనలు తడతాయి. జీవితంలో ఏదో జరిగినపోతున్నట్లు, డిప్రషన్‌లోకి వెళ్లిపోవడం, స్ట్రెస్‌ ఫీల్‌ అవ్వడం లాంటివి జరుగుతాయి. ఆ టైంలో సిగిరెట్‌ తాగితే బాగుండనే ఆలోచనలు కూడా ఎక్కువగా వస్తాయి. కానీ, ఎప్పుడైతే దాన్ని కంట్రోల్‌ చేసుకోగలుగుతారో కచ్చితంగా రికవర్‌ అవుతారు. 

24 గంటల్లో ఈ మార్పు.. 

ఒక రోజు అంతా సిగరెట్‌ తాగకపోవడం వల్ల ఇరిటేషన్‌, యాంక్సైటీ, స్ట్రెస్‌, మూడ్‌స్వింగ్స్‌ అన్నీ ఒక్కసారిగా ఆవహిస్తాయట. అయితే, అవి కేవలం టెంపరరీగా కలిగే ఫీలింగ్స్‌ మాత్రమే అని, ఆ తర్వాత అలవాటు పడిపోతారని చెప్తున్నారు.

మూడు రోజుల తర్వాత.. 

సిగరెట్‌ తాగడం వల్ల కార్బన్‌ మోనాక్సైడ్‌ ఒంట్లో పేరుకుపోతుంది. దానికారణంగా ఊపిరితిత్తులు కూడా బాగా పాడవుతాయి. అయితే, ఎప్పుడైతే స్మోకింగ్‌ మానేస్తామో అప్పుడు వెంటనే లంగ్స్‌ మెరుగ్గా పనిచేయడం మొదలవుతుంది. స్మోకింగ్‌ మానేసిన మూడో రోజుకే ఒంట్లోని కార్బన్‌ మోనాక్సైడ్‌ మొత్తం క్లీన్‌ అవుతుంది. ఆ తర్వాత లంగ్స్‌లోని మ్యూకస్‌ మొత్తం క్లియర్‌ అవుతుంది. అంతేకాకుండా.. టేస్ట్‌, స్మెల్‌ కూడా బాగా తెలుస్తుంది.

5 రోజులకు చక్కటి బ్రీతింగ్‌.. 

విపరీతంగా సిగరెట్లు తాగేవారిలో బ్రీతింగ్‌ ప్రాబ్లమ్‌ ఎక్కువగా కనిపిస్తుంది. శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది పడుతుంటారు. అయితే, సిగరెట్‌ మానేసిన ఐదో రోజు నుంచి శ్వాస తీసుకోవడంలో వాళ్లకు ఆ ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక అలా దాదాపు 7 రోజులు వరుసగా స్మోకింగ్‌ చేయడం మానేస్తే.. అసలు సిగరెట్‌ తాగాలనే ఆలోచనలే మైండ్‌లోకి రావు. ఇక మన మైండ్‌ మొత్తం కంట్రోల్‌లోకి వచ్చి, స్మోకింగ్‌ ఆరోగ్యానికి మంచిది కాదు అనే భావనకు వచ్చేస్తారు. 

రెండు వారాలకు.. ఫిజికల్‌ స్ట్రెంత్‌ 

విపరీతంగా పొగ తాగేవారు త్వరగా నీరసపడిపోతారు. ఏ పనిని యాక్టివ్‌గా చేయలేరు. అదే స్మోకింగ్‌ మానేసిన రెండు వారాలకు వాళ్లలో విపరీతమైన మార్పు కనిపిస్తుంది. గతంలో కంటే ఇప్పుడు ఫిజికల్‌గా చాలా స్ట్రాంగ్‌గా తయారవుతారని స్టడీస్‌ చెప్తున్నాయి. శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగి, గుండెకు, కండరాళ్లలో రక్తం ప్రసరణ బాగా జరిగి బలంగా తయారవుతారు. 

దగ్గు నుంచి ఉపశమనం.. 

స్మోకింగ్‌ మానేసిన నెలలో మనిషిలో చాలా మార్పులు కనిపిస్తాయని చెప్తున్నారు డాక్టర్లు. తరచూ సిగరెట్‌ తాగేవారికి దగ్గు ఎక్కువగా వస్తుంది. ఎప్పుడూ దగ్గుతూనే కనిపిస్తారు. అయితే, స్మోకింగ్‌ మానేసిన నెలకు వాళ్లలో ఆ దగ్గు పూర్తిగా పోతుందని చెప్తున్నారు డాక్టర్లు. ఇక మూడు నెలల తర్వాత.. లంగ్స్‌ పనితీరు దాదాపు 10 శాతం మెరుగుపడుతుందని, దీని వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్తున్నారు.

గుండెజబ్బులు రావు.. 

అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి.. మీ సంకల్పం నెరవేరి.. దాదాపు ఒక ఏడాది పాటు సిగరెట్‌గా దూరంగా ఉంటే ప్రాణానికి ఉన్న ముప్పు 50 శాతం తగ్గిపోయినట్లే అని చెప్తున్నారు డాక్టర్లు. హార్ట్‌ఎటాక్‌ వచ్చే రిస్క్‌ 50 శాతానికి తగ్గిపోతుందని, ఇక అదే ఒక పదేళ్లు అలానే కఠినంగా పాటించగలిగితే.. లంగ్‌ క్యాన్సర్‌ నుంచి బయటపడినట్లే అని, ఆయుషును పెంచుకున్నట్లే అని అంటున్నారు నిపుణులు. 

ఇదంతా బాగానే ఉంది. పొగతాగడం మానేస్తే ఇంత మంచి జరుగుతుంది. అయితే, అసలు విషయం ఏంటంటే? ఒక్కసారిగా అలవాటు అయిన దాన్ని మానేయడమే కష్టం. దానికి చాలా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కూడా. మరి స్టోకింగ్‌ మానేయాలంటే ఏం చేయాలి? ఈ కింద చెప్పిన పది సూత్రాలు పాటిస్తే ఈజీగా స్మోకింగ్‌ మానేయొచ్చని అంటున్నారు డాక్టర్లు. 

⦿ సిగరెట్‌ ఎందుకు మానేయాలో కారణాలు రాసుకోవాలి. 
⦿ మీ సన్నిహితులకు, మీ చుట్టు ఉన్నవాళ్లకు స్మోకింగ్‌ మానేస్తున్నానని చెప్పాలి. 
⦿ గతంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే.. స్మోకింగ్‌ మానేయడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారో, అవి మీకు ఎలా ఉపయోగపడ్డాయో చూసుకోవాలి. 
⦿ స్మోకింగ్‌కి ప్రత్యామ్నాయంగా ఏం వాడొచ్చో ఆలోచించాలి. 
⦿ ఎప్పుడైనా సిగరెట్‌ తాగాలి అని అనిపించిన్నప్పుడు దాన్ని ఎలా కంట్రోల్‌ చేసుకోవాలో ప్లాన్‌ చేసుకోవాలి. 
⦿ ఏ టైంలో ఎక్కువగా స్మోక్‌ చేస్తారు? అలాంటి టైంలో స్మోకింగ్‌ కాకుండా ఏం చేయొచ్చో దృష్టి పెట్టాలి. 
⦿ స్మోక్‌ చేయాలి అని క్రేవింగ్స్‌ వచ్చినప్పుడు దాని నుంచి బయటపడేందుకు బీజీగా ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్‌ అవ్వాలి. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. కచ్చితంగా స్మోకింగ్‌ నుంచి దూరంగా జరగొచ్చని చెప్తున్నారు ఎక్స్‌పర్ట్స్‌. వీటన్నింటితో పాటు ఆరోగ్యం కాపాడుకోవాలనే దృఢ సంకల్పం ఉంటే కచ్చితంగా అనుకున్నది సాధించవచ్చు.

Also Read : జాంబీ వైరస్: మళ్లీ ఉనికిలోకి 48,500 నాటి మహమ్మారి - ప్రపంచానికి మరో అతి పెద్ద ముప్పు?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతారరివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండ ఒకే దాంట్లోే -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లోే - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget