అన్వేషించండి

Drinking Hot Water: వేన్నీళ్లు తాగుతున్నారా? ఈ ప్రమాదం తప్పదట, జాగ్రత్త!

నిద్రలేవగానే గోరు వెచ్చని నీరు తాగే అలవాటు మీకు కూడా ఉందా? అలా తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

మనలో చాలా మంది ఉదయం నిద్రలేవగానే గోరు వెచ్చని నీటిని తాగుతారు. నీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యల్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. నీరు కొవ్వును విచ్చిన్నం చేస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గించే ప్రక్రియని వేగవంతం చేస్తుంది. అందుకె వేడి నీటిని తాగుతారు. అయితే చాలా మంది రోజంతా వేడి నీటిని సిప్ చేస్తూ ఉంటారు. ఇది బరువు తగ్గించడం మాట ఏమో కానీ అపారమైన నష్టాన్ని చేస్తుందని అంటున్నారు. రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలని చూపుతుందని వైద్యులు చెప్తున్నారు. వేడి నీరు అన్నవాహికలోని కణజాలాలని దెబ్బతీస్తుంది. రుచి మొగ్గలకి నష్టం కలిగిస్తుంది. నాలుక కాలడం వల్ల బొబ్బలు కూడ రావచ్చు.

ఎంత ఉష్ణోగ్రత ఉండే నీటిని తాగాలి?

వేడి నీరు లేదా కాఫీ, టీ వంటి పానీయాలు చాలా వేడిగా ఉంటాయి. వేడి నీరు ఇష్టపడని వ్యక్తులు గది ఉష్ణోగ్రత లేదంటే కొంచెం ఎక్కువ వేడి ఉన్న నీటిని తాగొచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం నీరు 136 డిగ్రీల ఫారెన్ హీట్ లేదా 57.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీరు సరైన తాగు నీరు. ఈ ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిని తీసుకుంటే కాలిన గాయాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచే ఇతర మార్గాలు

హార్వర్డ్ హెల్త్ ప్రకారం రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కోసం అనేక ఇతర మార్గాలు ఉన్నాయి. సమతుల్యమైన ఆహారం ఎంచుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి. శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

పండ్లు, కూరగాయలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. గింజలు, చిక్కులలు వంటి మొక్కల ఆధారిత ఆహారాలు తీసుకుంటే మంచిది. ఇందులో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. హానికరమైన వ్యాధికారక క్రిముల మీద పోరాటం చేసే శక్తిని అందిస్తాయి. ఈ ఆహారాలలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని నివారించి మంటని తగ్గించడంలో సహాయపడతాయి.

క్రమం తప్పకుండా వ్యాయామం

సుదీర్ఘమైన తీవ్రమైన వ్యాయామం రోగనిరోధక వ్యవస్థని అణిచివేస్తుంది. అందుకే మితమైన వ్యాయామం చేయాలి. శరీరానికి తగినంత విశ్రాంతి ఉండేలా చూసుకోవాలి. తప్పనిసరిగా ఎనిమిది గంటల నిద్ర అవసరం. నిద్ర నాణ్యత తగ్గితే అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవడం రోగనిరోధక వ్యవస్థని పెంచుకోవడానికి చాలా కీలకం. దీర్ఘకాలిక ఒత్తిడి వాపుని ప్రోత్సహిస్తుంది. రోగనిరోధక కణాల పనితీరుకి ఆటంకం కలిగిస్తుంది. అందుకే ఒత్తిడి అదుపులోకి తీసుకొచ్చేందుకు ధాన్యం, యోగా వంటివి అనుసరించాలి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: కళ్ళు అదురుతున్నాయా? నిర్లక్ష్యం వద్దు, ఈ సమస్యలే కారణం కావచ్చు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
Venkatesh: వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
Embed widget