అన్వేషించండి

Beetroot: బీట్‌రూట్ జ్యూస్ తాగడం మంచిదే, కానీ ఎక్కువ తాగితే ఈ సైడ్ ఎఫెక్టులు తప్పవు

బీట్ రూట్ తాగడం మంచిదే. కానీ అతిగా తాగినా, పడకపోయినా కొన్ని సైడ్ ఎఫెక్టులు వచ్చే అవకాశం ఉంది.

ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో బీట్‌రూట్ ముందుంటుంది. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, ఐరన్ అధికంగా ఉంటాయి. రక్తానికి బీట్ రూట్ చాలా అవసరం. ఇవి ఎర్రరక్తకణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. కణాలకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. అయితే బీట్ రూట్ జ్యూస్ అధికంగా తీసుకోవడం వల్ల చాలా సైడ్ ఎఫెక్టులు వస్తాయి. అధ్యయనాల ప్రకారం, బీట్‌రూట్‌లో ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణం అవుతుంది. ఆక్సలేట్ కాల్షియంతో కలిసి రాళ్లను పెంచుతుంది. అందుకే బీట్ రూట్ జ్యూస్‌కు మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాలి. ఇక మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారైతే బీట్ రూట్ తినకూడదు. 
 
అలెర్జీలు వచ్చే అవకాశం
అలెర్జీల బారిన త్వరగా పడేవారు బీట్‌రూట్ తినకూడదు. వీరి శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. బీట్‌రూట్ అధికంగా తినడం వల్ల కొందరు అనాఫిలాక్సస్ అనే అలెర్జీ స్థితికి కారణం అవుతారు. దీని ఫలితంగా గొంతు బిగుతుగా మారడం, బ్రాంకోస్పాస్మ్ అనే ఆరోగ్యస్థితి కలగవచ్చు.

బీటూరియా
బీట్‌రూట్ లేదా ఎరుపు రంగులో ఉన్న ఆహారాలును అధికంగా తీసుకోవడం వల్ల బీటూరియా వచ్చే అవకాశం ఉంది. అంటే మూత్రం లేదా మలం రంగు మారి ఎరుపురంగులోకి మారుతుంది. ఇది దీర్ఘకాలం కొనసాగకూడదు. ఈ కూరగాయలో నైట్రేట్లు ఉంటాయి. వీటి వల్ల పొత్తికడపులో తిమ్మిరి, నొప్పి వస్తుంది. 

గర్భిణులకు...
అధిక నైట్రేట్లు ఉండే బీట్‌రూట్ గర్భిణులు తినడం వల్ల శక్తి లోపించడం, తలనొప్పి, కళ్లు తిరగడం, కళ్లు, నోరు, పెదవులు, చేతులు, కాళ్ల చుట్టూ చర్మం రంగు మారుతుంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, బీట్‌రూట్‌ను అధికంగా తీసుకోవడం వల్ల కాలేయంలో లోహ అయాన్‌లు పేరుకుపోతాయి. ఇది దీర్ఘకాలంలో కాలేయాన్ని దెబ్బతీస్తాయి. బీట్‌రూట్ రసం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం స్థాయిలు తగ్గుతాయి. తక్కువ కాల్షియం స్థాయిలు ఉన్న మహిళలు బీట్‌రూట్ జ్యూస్‌ను తీసుకోకూడదు. బీట్ రూట్ కూర కూడా తక్కువగా తినాలి ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్లు. 

Also read: ఉదయం పూట ఈ పానీయాలు తాగితే కొవ్వు కరగడం ఖాయం

Also read: దీర్ఘకాలం పాటూ గర్భనిరోధకాలు వాడడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
Tiger Shroff : టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
PCB Commentary Ban: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
Tragedy in Asifabad: బతుకమ్మ ఆడుతూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఆసిఫాబాద్‌లో విషాదం
బతుకమ్మ ఆడుతూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఆసిఫాబాద్‌లో విషాదం

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
Tiger Shroff : టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
PCB Commentary Ban: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
Tragedy in Asifabad: బతుకమ్మ ఆడుతూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఆసిఫాబాద్‌లో విషాదం
బతుకమ్మ ఆడుతూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఆసిఫాబాద్‌లో విషాదం
RAPO23 Update : రామ్ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ - RAPO23 నుంచి క్రేజీ అప్డేట్
రామ్ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ - RAPO23 నుంచి క్రేజీ అప్డేట్
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Telangana Woman Arrested: ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
Janasena Wins Darsi Municipal Chairman: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ.. దర్శిలో చైర్మన్ పీఠం కైవసం
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ.. దర్శిలో చైర్మన్ పీఠం కైవసం
Embed widget