Vijay Devarakonda Rashmika: రష్మికతో లంచ్ చేస్తూ కనిపించిన విజయ్ దేవరకొండ - వైరల్ అవుతున్న ఫొటో!
Vijay Rashmika: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరూ కలిసి లంచ్ చేస్తున్న ఫొటో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. వీరిద్దరూ రిలేషన్ షిప్‌లో ఉన్నారని ఇప్పటికే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
Vijay Devarakonda Rashmika Mandanna: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రూమర్స్‌కు వారు చెక్ పెట్టే ప్రయత్నం కూడా చేయలేదు. గతంలో చాలా సార్లు ఇద్దరూ కలిసి కనిపించారు. ఇప్పుడు మరోసారి వాళ్లిద్దరూ కలిసి లంచ్ చేస్తూ కెమెరాల కంట పడ్డారు. ఆ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
#RashmikaMandanna #VijayDeverakonda pic.twitter.com/cchqYEdbqy
— Vijay Sai ⚡️ (@Vijaysai_09) November 25, 2024
ఇది అందరికీ తెలిసిన విషయమేగా...
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిలేషన్ షిప్‌లో ఉన్నారని వార్తలు ఎప్పట్నుంచో వస్తూనే ఉన్నాయి. ఆ వార్తలపై విజయ్, రష్మిక ఎప్పుడూ స్పందించలేదు. చెన్నైలో జరిగిన పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్‌లో కూడా రష్మికకు ఇదే ప్రశ్న ఎదురైంది. ‘మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిని చేసుకుంటారా లేకపోతే బయట వ్యక్తిని చేసుకుంటారా?’ అని రష్మికను ప్రోగ్రాంలో యాంకర్ ప్రశ్నించగా... రష్మిక ‘ఇది అందరికీ తెలిసిన విషయమే కదా... కొత్తగా చెప్పేదేముంది’ అని జవాబు ఇచ్చారు. దీంతో ఆడిటోరియం మొత్తం ఒక్కసారిగా హోరెత్తి పోయింది.
‘గీత గోవిందం’తో మొదలు...
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గీత గోవిందం’ సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మొదటిసారి జంటగా నటించారు. ఆ సినిమా షూటింగ్‌లోనే విజయ్, రష్మిక లవ్‌లో పడ్డట్లు సమాచారం. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ విజయ్ దేవరకొండ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ ఇదే. అనంతరం వీరిద్దరూ ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో కూడా కలిసి నటించారు. కానీ ఈ సినిమా ఆశించినంత విజయాన్ని సాధించలేదు. ఈ సినిమాలో పాటలు మాత్రం పెద్ద హిట్ అయ్యాయి. ‘నీ నీలి కన్నుల్లో’, ‘కడలల్లే’, ‘గిరగిర’, ‘ఎటు పోనే’ సాంగ్స్ అన్నీ ఛార్ట్‌బస్టర్లుగా నిలిచాయి. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి నటించలేదు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మళ్లీ కలిసి నటించాలని ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఆశపడుతున్నారు.
మూడు సినిమాలతో విజయ్ బిజీ...
ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘VD12’ సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ను ఇంకా మేకర్స్ ప్రకటించలేదు. విజయ్ ఒక కొత్త లుక్‌లో ఈ సినిమాలో కనిపించనున్నారు. 2025 మార్చి 28వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుథ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. విజయ్ దేవరకొండ సరసన ‘మిస్టర్ బచ్చన్’ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు.
అనంతరం ‘ట్యాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 1800 కాలంలో జరిగే పీరియాడిక్ సినిమాలో నటించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆ తర్వాత ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఒక యాక్షన్ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించనున్నారు. 2025 షూటింగ్ ప్రారంభించి 2026లో ఈ సినిమాను విడుదల చేస్తామని దిల్ రాజు ఇటీవలే ప్రకటించారు.