Pushpa 2 Chennai Event Highlights: రజనీకాంత్ మేనరిజం అల్లు అర్జున్ చేస్తే? స్టేజిపై స్టేప్ వేస్తే? - పుష్ప 2 చెన్నై ఈవెంట్ హైలైట్స్
Pushpa 2 The Rule Wild Fire Event: చెన్నైలో జరిగిన 'పుష్ప 2: ది రూల్' వైల్డ్ ఫైర్ ఈవెంట్‌లో హైలైట్స్ ఏంటి? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, శ్రీ లీల స్టేజిపై వేసిన స్టెప్స్ నుంచి రష్మిక పెళ్లి వరకు....
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటించిన 'పుష్ప 2: ది రూల్' సినిమా వైల్డ్ ఫైర్ ఈవెంట్ ఆదివారం రాత్రి చెన్నైలో జరిగింది. అందులో హైలైట్స్ ఏంటి? దేవి శ్రీ ప్రసాద్ చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఏమిటి? పెళ్లి గురించి రష్మిక ఇచ్చిన హింట్ ఏమిటి? ఆ వివరాల్లోకి వెళితే...
- అల్లు అర్జున్ స్వచ్ఛమైన తమిళ భాషలో మాట్లాడారు. తమిళ ప్రజలకు తాను ఇచ్చే గౌరవం వాళ్ల భాషలో మాట్లాడడమే అని చెప్పారు. 'ఎవరి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో మిస్ కాకుండా వెళతారు?' అని యాంకర్ అడిగితే... సూపర్ స్టార్ రజనీకాంత్ మేనేరిజం చేసి చూపించారు. దాంతో విషయం అందరికీ అర్థమైంది.
#AlluArjun showcasing his Fan boy moment towards Superstar #Rajinikanth 🌟♥️
— AmuthaBharathi (@CinemaWithAB) November 24, 2024
The way he recreating superstar swag😍#Pushpa2TheRule pic.twitter.com/Y9jJ3jIV2o
- దర్శకుడు సుకుమార్ లేకపోతే తాను లేను అని అల్లు అర్జున్ చెన్నై వేడుకలో తెలిపారు. సుకుమార్ లేకపోతే ఆర్య లేదని, సుకుమార్ లేకపోతే పుష్ప లేడని ఆయన వ్యాఖ్యానించారు.
- సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, తనకు మధ్య ఉన్న అనుబంధం గురించి ఐకాన్ స్టార్ మాట్లాడారు. తాను 20 సినిమాలు చేస్తే... వాటిలో పది చిత్రాలకు దేవి సంగీతం అందించాడని తెలిపారు. ప్రతి సినిమాలో మ్యూజిక్ హిట్ అని పేర్కొన్నారు.
- చెన్నైలోని 'పుష్ప ది రూల్' వైల్డ్ ఫైర్ ఈవెంట్ ఆఖరిలో స్టేజిపై 'పుష్ప పుష్ప' పాటకు అల్లు అర్జున్ స్టెప్ వేయడం గమనార్హం. ఆయన డాన్స్ వేయడం స్టార్ట్ చేసిన తర్వాత స్టేడియం అంతా ఇలలో చప్పట్లతో దద్దరిల్లింది.
One step that lit up the entire evening 💥💥💥
— Pushpa (@PushpaMovie) November 24, 2024
The auditorium erupted as Icon Star @alluarjun shook his leg for the ICONIC #PushpaPushpa step at the #Pushpa2WildFireEvent ❤🔥#Pushpa2TheRule#Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/BAHr5UkamI
- రజనీకాంత్ హీరోగా 'జైలర్' వంటి బ్లాక్ బస్టర్ తీసిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. 'బన్నీతో సినిమా తీసే అవకాశం ఉందా?' అని అడిగితే... ''అది హీరో గారి చేతుల్లో ఉంటుంది. అల్లు అర్జున్ గారికి ఓకే అయితే సినిమా తీయడానికి నేను రెడీ. ఆయనతో స్ట్రైట్ తమిళ సినిమా చేయాలని అనుకుంటున్నాను. పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చూశా. బన్నీ గారు అన్ని భాషల్లోనూ ఓ సినిమా చేయాలి'' అని చెప్పారు.
- తమిళనాడులో సుమారు 800 థియేటర్లలో 'పుష్ప 2 ది రూల్' సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, దళపతి విజయ్ 'గోట్' చిత్రాన్ని ఎనిమిది వందల థియేటర్లలో 3500 షోలతో విడుదల చేశామని, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అని, 'పుష్ప 2' కూడా అదే విధంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నట్లు నిర్మాత అర్చనా కలపతి చెప్పారు.
- 'పుష్ప'లో హీరోయిన్ రష్మికను పెళ్లి గురించి ప్రశ్నించారు యాంకర్. మీరు ఇండస్ట్రీలో వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా అని అడిగితే... ''ఆ విషయం అందరికీ తెలుసు'' అని రష్మిక చెప్పారు. విజయ్ దేవరకొండ గురించి ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చారనేది జనాల అభిప్రాయం.
Also Read: అందరికీ తెలుసుగా... విజయ్ దేవరకొండతో పెళ్లి గురించి హింట్ ఇచ్చిన రష్మిక?
- 'పుష్ప' చెన్నై ఈవెంట్ సాక్షిగా నిర్మాత రవిశంకర్ యలమంచిలి మీద తన అసంతృప్తిని వ్యక్తం చేశారు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్. సమయానికి పాటలు, నేపథ్య సంగీతం ఇవ్వలేదని తనను నిందించవద్దని... రవి గారికి తన మీద ప్రేమ ఉన్నప్పటికీ, ప్రేమ కంటే ఫిర్యాదులు ఎక్కువ వస్తాయని... మనకి ఏది కావాలన్నా అడిగి తీసుకోవాలని, అది నిర్మాత ఇచ్చే పేమెంట్ లేదా స్క్రీన్ మీద వచ్చే క్రెడిట్ అని దేవి శ్రీ ప్రసాద్ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు.
- అల్లు అర్జున్ మాస్ స్టెప్స్ ను త్వరలో విడుదల చేయబోతున్న పాటలో చూస్తారని దేవి శ్రీ ప్రసాద్ అభిమానులలో అంచనాలు పెంచారు. 'పుష్ప ది రూల్' సినిమాలో అల్లు అర్జున్ నట విశ్వరూపం చూస్తారని ఆయన తెలిపారు.
- 'పుష్ప ది రూల్' సినిమాలోని స్పెషల్ సాంగ్ 'కిస్సిక్'ను చెన్నైలోని వైల్డ్ ఫైర్ ఈవెంట్‌లో విడుదల చేశారు. ఆ పాటలో బన్నీతో పాటు డాన్స్ చేసిన శ్రీ లీల సైతం ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఆవిడ కూడా స్వచ్ఛమైన తమిళంలో మాట్లాడారు. అంతే కాదు... స్టేజ్ మీద పాటకు డాన్స్ చేశారు. త్వరలో తమిళ చిత్రసీమకు పరిచయం కానున్న విషయాన్ని ఆవిడ కన్ఫర్మ్ చేశారు. శివకార్తికేయన్ సినిమాలో శ్రీలీల నటించనున్నట్లు సమాచారం.
Dancing Queen @sreeleela14 dances to
— Pushpa (@PushpaMovie) November 24, 2024
𝐊𝐈𝐒𝐒 𝐊𝐈𝐒𝐒 𝐊𝐈𝐒𝐒 ...𝐊𝐈⚡⚡𝐈𝐊 at the #Pushpa2WildFireEvent in Chennai ❤🔥
Start dancing to the song 💃🕺#Kissik lyrical video out now ❤️🔥
Telugu - https://t.co/JFhLNrZ9ej
Hindi - https://t.co/RRbCFclPnI
Tamil -… pic.twitter.com/gg4a5PcQHk
- 'పుష్ప 3' ఉంటుందని మైత్రి మూవీ మేకర్స్ సీఈవో చెర్రీ చెప్పారు. ఈ డిసెంబర్ 5 నుంచి బాక్సాఫీస్ దగ్గర అల్లు అర్జున్ రూలింగ్ స్టార్ట్ అవుతుందని సినిమా బ్లాక్ బస్టర్ అని ఆయన పేర్కొన్నారు. 'పుష్ప 3'తో బన్నీతో మరోసారి పనిచేయడానికి ఎదురు చూస్తున్నామని వివరించారు.