LSG vs GT Match Highlights IPL 2025 | గుజరాత్ పై 6 వికెట్ల తేడాతో లక్నో విజయం | ABP Desam
వరుస విజయాలు సాధిస్తూ టాప్ ప్లేస్ లో దూసుకెళ్తున్న గుజరాత్ టైటాన్స్ కి...పడి లేచిన కెరటంలా దూకుడు చూపిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ కి ఈ జరిగిన మ్యాచ్ లో విజయం లక్నోనే వరించింది. సమఉజ్జీల్లా రెండు జట్లు తలపడిన ఈ ఎల్ఎస్జీ వర్సెస్ జీటీ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. కన్సిస్టెన్సీ కేరాఫ్ అడ్రస్ సాయి సుదర్శన్
మొన్ననే మాట్లాడుకున్నాం..గడచిన రెండేళ్లుగా సాయి సుదర్శన్ అంత నిలకడగా ఆడుతున్న ఐపీఎల్ బ్యాటర్ లేరంటే లేరు. ఈ సీజన్ లో తన అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తున్న సాయి ఆడిన ఆరో మ్యాచులో ఈరోజు నాలుగో హాఫ్ సెంచరీ సాధించాడు. టాస్ గెలిచి మరీ గుజరాత్ కు బ్యాటింగ్ అప్పగించిన పంత్ నిర్ణయం తప్పా అనిపించేలా కెప్టెన్ గిల్ తో సాయి సుదర్శన్ రఫ్పాడించాడు. 37 బాల్స్ లోనే 7 ఫోర్లు ఓ సిక్సర్ తో 56 పరుగులు చేసిన సాయి...రవి బిష్ణోయ్ బౌలింగ్ లో అవుటైనా జీటీ కి కావాల్సిన స్టార్టింగ్ ను అద్భుతంగా అందించాడు.
2. అల్లుడు గారు అదుర్స్
హైదరాబాద్ తో మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చేసి ఈ సీజన్ లో బ్యాట్ తో తనదైన స్థాయి ప్రదర్శిస్తున్న శుభ్ మన్ గిల్ లక్నోపై అద్భుతమైన నాక్ ఆడాడు. సాయి సుదర్శన్ తోడుగా ఓపెనింగ్ పార్టనర్ షిప్ కే 120 పరుగులు పెట్టాడు. పది రన్ రేట్ తో టీమ్ స్కోరుబోర్డును పరిగెత్తించిన గిల్...38 బాల్స్ లోనే 6 ఫోర్లు ఓ సిక్సర్ తో 60 పరుగులు చేశాడు.
3. అద్భుతంగా పుంజుకున్న లక్నో
మొదటి వికెట్ కే 12ఓవర్లలో 120 పరుగులు పెట్టిన గుజరాత్ మ్యాచ్ మొత్తం అయ్యే సరికి 180 పరుగులే చేసిందంటే రీజన్ లక్నో బౌలర్ల గ్రేట్ కమ్ బ్యాక్. హాఫ్ సెంచరీ వీరుడు గిల్ అయిపోయిన ఒక్క పరుగుకే సాయి సుదర్శన్ కూడా అవుటైపోవటంతో గుజరాత్ మళ్లీ కోలుకోలేదు. ప్రధానంగా లక్నో బౌలర్లు శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్ రెండే సి వికెట్లతో మెరిస్తే ఆవేశ్, దిగ్వేష్ చెరో వికెట్ తీసుకుని మిగిలిన జీటీ బ్యాటర్లను పూర్తిగా కంట్రోల్ చేయటంతో 180 పరుగులే చేసి లక్నోకు 181 టార్గెట్ పెట్టింది గుజరాత్.
4. మార్ క్రమ్ మాస్ బ్యాటింగ్
181 టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నోకు చాన్నాళ్ల తర్వాత మార్ క్రమ్, రిషభ్ పంత్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పంత్ 21 పరుగులు చేసి ధాటిగా ఆడే ప్రయత్నంలో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో అయిపోతే..మార్ క్రమ్ చాన్నాళ్ల తర్వాత అద్భుతమైన హాఫ్ సెంచరీ తో గుజరాత్ పై విరుచుకుపడ్డాడు. 31 బాల్స్ లో 9 ఫోర్లు 1 సిక్సర్ తో 58 పరుగులు చేసి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లోనే అవుటైనా అప్పటికే LSG కావాల్సిన మూమెంటమ్ ను ఇచ్చాడు.
5. పూనకాల పూరన్
అచ్చం జీటీకి సాయి సుదర్శన్ లానే పవర్ హిట్టింగ్ తో LSG కి కొండంత అండగా నిలుస్తున్న నికోలస్ పూరన్ జీటీ మ్యాచ్ లోనూ రెచ్చిపోయాడు. మార్ క్రమ్ ఇచ్చిన స్టార్టింగ్ ను అద్భుతంగా వాడుకుంటూ జీటీ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. 34 బాల్స్ మాత్రమే ఆడి ఒక్క ఫోర్ మాత్రమే కొట్టి 7 భారీ సిక్సర్లు బాది 61 పరుగులు చేశాడు పూరన్. ఈ సీజన్ లో ఆరు మ్యాచులు ఆడిన పూరన్ కు ఇది నాలుగో హాఫ్ సెంచరీ. పూరన్ పూనకాలే LSG విక్టరీకి కావాల్సిన పరుగులు తెచ్చి పెట్టాయి. చివర్లో పూరన్ అవుటైనా డేవిడ్ మిల్లర్ ఫెయిలైనా..బడోనీ ఫోరు, సిక్సు బాది మిగిలిన పనిని పూర్తి చేసి ఆఖరి ఓవర్లో LSG కి గుజరాత్ పై 6 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని అందించాడు.
ఈ ఓటమితో గుజరాత్ పాయింట్స్ టేబుల్ లో మొదటి స్థానం నుంచి రెండో స్థానానికి పడిపోతే..LSG 3వ ప్లేస్ లోకి దూసుకొచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి స్థానానికి వెళ్లిపోయింది.





















