World Contraception Day: దీర్ఘకాలం పాటూ గర్భనిరోధకాలు వాడడం వల్ల వచ్చే సమస్యలు ఇవే
World Contraception Day: గర్భం రాకుండా అడ్డుకునేందుకు గర్భనిరోధకాలు అధికంగా వాడే వారికోసమే ఈ కథనం.
World Contraception Day: పెళ్లయిన కొత్త జంటలు రెండు మూడేళ్ల పాటూ పిల్లలు వద్దనుకుంటారు. అందుకోసం గర్భనిరోధకాలు వాడడం మొదలుపెడతారు. నోటి ద్వారా తీసుకునే ట్యాబ్లెట్ల నుంచి కాపర్ టి వరకు అనేక రకాల గర్భనిరోధక పద్దతులు అందుబాటులో ఉన్నాయి. దీర్ఘకాలికంగా వీటిని వాడడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఈ విషయంలో అవగాహన కల్పించేందుకే ప్రతి ఏడాది సెప్టెంబర్ 26న ‘ప్రపంచం గర్భనిరోధక అవగాహనా దినోత్సవం’ నిర్వహిస్తారు. వీటిని మరీ అధిక కాలం పాటూ వాడడం వల్ల వచ్చే అనారోగ్యాల నుంచి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి మహిళకూ ఉంది. వారే తమ ఆరోగ్యాన్ని తాము కాపాడుకోవాలి. కొన్ని వీటి వల్ల తీవ్రమైన ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశం ఉంది. అవి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు.
రక్తం గడ్డకట్టడం
బర్త్ కంట్రోల్ పిల్స్‌లో కొన్ని సమ్మేళనాలు ఉంటాయి, వీటిని ఎక్కువ కాలం ఉపయోగించినప్పుడు రక్తం గడ్డకట్టడానికి దారితీస్తుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడే వారిలో ఇటువంటి ప్రమాదాలు ఎక్కువ. కాబట్టి ఈ సమస్యలు ఉన్నవాళ్లు బర్త్ కంట్రోల్ పిల్స్ తక్కువగా వాడాలి. రోజూ వేసుకోవడం అందులోనూ నెలల తరబడి వాడడం మంచిది కాదు.
గుండెపోటు
బర్త్ కంట్రోల్స్ పిల్స్ అధికంగా వాడడం వల్ల రక్తం గడ్డకట్టవచ్చని ముందే చెప్పుకున్నాం. దీనివల్ల గుండె లేదా మెదడులో కూడా ఇలా జరుగవచ్చు. దీనివల్ల గుండె పోటు, స్ట్రోక్ వంటివి రావచ్చు. రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టినా గుండె పోటు రావచ్చు. అందుకే గర్భనిరోధక మాత్రలు వాడే బదులు కాలర్ టి (IUD) వంటి గర్భనిరోధక పద్ధతులకు మారడం మంచి ఎంపిక.
మైగ్రేన్
మీరు తరచుగా తలనొప్పితో బాధపడుతుంటే గర్భనిరోధక మాత్రలు వాడకపోవడం మంచిది. ఇవి పరిస్థితిని మరింతగా దిగజారుస్తాయి. ఈ మాత్రలలో ఈస్ట్రోజెన్ ఉంటుంది. అది తీవ్రమైన మైగ్రేన్ నొప్పికి కారణం అవుతుంది. అలాగే రక్తం కూడా గడ్డకట్టవచ్చు.
క్యాన్సర్
గర్భనిరోధక మాత్రలు క్యాన్సర్‌కు కారణం అవుతాయి. గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అందుకే గర్భనిరోధక మాత్రలు వాడకుండా ఉండడం ఉత్తమం. దానికి బదులు వేరే పద్ధతులు వెతుక్కోవాలి.
Also read: ఒక పూట బ్లాక్ రైస్ తిని చూడండి, డయాబెటిస్ అదుపులోకి వచ్చేస్తుంది
Also read: తల్లిదండ్రులు పిల్లలతో కలిసి టీవీ చూస్తే ఎన్ని లాభాలో, చెబుతున్న అధ్యయనం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.