అన్వేషించండి

Diabetes: ఒక పూట బ్లాక్ రైస్ తిని చూడండి, డయాబెటిస్ అదుపులోకి వచ్చేస్తుంది

Diabetes: మధుమేహంతో బాధపడే వారు ఆచితూచి ఆహారాన్ని తినాల్సి వస్తుంది. అలాంటివారికోసం వరంలాంటిది బ్లాక్ రైస్.

Diabetes: మధుమేహులు తెల్లన్నం ఎక్కువ తినకూడదు, ఎందుకంటే అందులో చక్కెర శాతం అధికమే. చపాతీలు అధికంగా తిన్నా ప్రమాదమే, ఎందుకంటే దీనిలో గ్లూటెన్ ఉంటుంది. ఇక బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా వంటి వాటితో సరిపెట్టుకోవాలి. ఎప్పుడూ వాటినే తిని బోరుకొడితే ఓసారి బ్లాక్ రైస్ ప్రయత్నించి చూడండి. దీన్ని రోజుకో పూట తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గి డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. చపాతీలకు బదులు బ్లాక్ రైస్ తిన్నా మంచిదే. మధుమేహం అధికంగా ఉన్నవాళ్లు తెల్లన్నం పూర్తిగా వదిలేయాలి. ఒకపూట బ్లాక్ రైస్, మరో పూట రెండు చపాతీలతో తినాలి. కూరలు, పండ్లు, పెరుగు అధికంగా తినాలి. 

రెండు రకాలు 
మధుమేహం అనేది రెండు రకాలు. అవి టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్‌లు. ఇందులో టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారిలో శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేదు. దీన్నే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. టైప్ 2 డయాబెటిస్‌లో శరీరం ఇన్సులిన్‌కు స్పందించదు. దీన్నే ఇన్సులిన్ నిరోధకత అంటారు. ఈ రెండు సందర్భాల్లో కూడా ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి. దీన్ని ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గడం అని కూడా అంటారు. దీని వల్ల రక్తంలో చక్కెర పెరిగిపోతుంది. ఇదే మధుమేహం. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుకోకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మూత్ర పిండాలు దెబ్బతింటాయి. మధుమేహం ఉన్నవారు ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు నిరంతరం తనిఖీ చేసుకోవాలి. వీరు సరైన ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేయాలి. చక్కెర తక్కువగా ఉండే ఆహారాన్నే తినాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తినకూడదు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తింటే చాలా మంచిది. 

బ్లాక్ రైస్ తింటే ఏమవుతుంది?
డయాబెటిస్‌తో బాధపడేవారికి బ్లాక్ రైస్ ఆరోగ్యకరం.వాటిలో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అంతేకాదు బ్లాక్ రైస్‌లో ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, ఐరన్ కూడా ఉన్నాయి. ఈ పోషకాలతో పాటు, బ్లాక్ రైస్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు కూడా ఉన్నాయి, ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి రక్షిస్తాయి.

బరువు తగ్గడానికి..
నల్లబియ్యంలో అధిక మొత్తంలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహకరిస్తుంది. మధుమేహంతో బాధపడేవారు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. 

గుండెకు...
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇవి తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండెకు హానిచేసే పరిస్థితులను శరీరంలో ఏర్పడనివ్వదు. చెడు కొలెస్ట్రాల్ వల్లే గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి, గుండె జబ్బులు ఉన్నవాళ్లు నల్లబియ్యాన్ని తింటే మంచిది. 

Also read: తల్లిదండ్రులు పిల్లలతో కలిసి టీవీ చూస్తే ఎన్ని లాభాలో, చెబుతున్న అధ్యయనం

Also read: రాత్రి ఆలస్యంగా నిద్రపోయేవారికి అలెర్ట్, ఈ జబ్బులు అతి త్వరగా వచ్చే అవకాశం

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
Hair Oiling Tips : జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
Bugs in Rice : బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget