By: Haritha | Updated at : 28 Jul 2022 01:15 PM (IST)
(Image credit: Pixabay)
బస్సులో కూర్చోగానే కొందరికి నిద్ర వచ్చేస్తుంది. ఓ పదినిమిషాలైన కునికిపాట్లు పడుతుంటారు. అలాగే ఇంట్లో టీవీ చూస్తూ కూడా కొంతమందికి నిద్ర వచ్చేస్తుంది. ఓ అరగంట నిద్రపోయి లేస్తారు. అలా పగలు పదేపదే నిద్ర రావడం అనారోగ్యానికి సంకేతమని చెబుతోంది ఓ తాజా అధ్యయనం. చైనాలో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం పగలు తరచూ నిద్రపోయి లేచే వారిలో అధిక రక్తపోటు, స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువని తేలింది. ఈ అధ్యయన ఫలితం చాలా మందికి షాకిచ్చింది. ఎందుకంటే సమయం దొరికితే నిద్రపోవడానికి చూసే వాళ్లు ఎంతో మంది. పావుగంటసేపైనా నిద్రపోయి లేచి, మళ్లీ ఓ గంటా రెండు గంటల తరువాత మళ్లీ ఓ పదినిమిషాలు నిద్రపోయే అలవాటున్న వారు జాగ్రత్త పడాలని సూచిస్తోంది ఈ అధ్యయనం.
ఇలా సాగింది అధ్యయనం
ఈ అధ్యయనాన్ని 2006 నుంచి 2010 వరకు నిర్వహించారు. బ్రిటన్లో జీవించిన అయిదు లక్షల మందిపై చేశఆరు. వారు క్రమం తప్పకుండా చేసే పనులను డేటా రూపంలో తీసుకున్నారు. రక్తం, మూత్రం, లాలాజల నమూనాలను సేకరించారు. పగటి పూట ఎన్నిసార్లు, ఎంతసేపు పడుకుంటారు వంటి వివరాలు సేకరించారు. వీరిలో ఇంతకుముందే అధిక రక్తపోటు, స్ట్రోక్ వచ్చిన వారిని మినహాయించారు. ఇక మిగిలింది 3,60,000 మంది. వీరిని 11 ఏళ్ల పాటూ ఫాలోఅప్ చేశారు. అందులో వారి నిద్ర - అధిక రక్తపోటు, స్ట్రోక్ మధ్య బంధాన్ని విశ్లేషించారు.
పగటి పూట ఎప్పుడూ నిద్రపోని వ్యక్తులతో పోల్చినప్పుడు, తరచూ న్యాపింగ్ (కాసేపు నిద్రపోయి లేచే వ్యక్తులు) చేసే వ్యక్తుల్లో అధికరక్తపోటు వచ్చే అవకాశం 12 ఎక్కువని తేలింది. అలాగే స్ట్రోక్ వచ్చే ఛాన్సులు కూడా 24 శాతం అధికం. అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు మూడు వంతుల మంది అధికంగా నాపింగ్ చేసే వారే. అయితే నిద్రపోవడం హానికరం అని చెప్పడం లేదు, కానీ ఒక క్రమపద్ధతిలో నిద్రపోవడం చాలా అవసరం. రోజూ ఒకే సమయానికి నిద్రపోయి లేవడంవల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. ఎప్పుడుపడితే అప్పుడు నిద్రపోయి లేవడం వల్ల అనారోగ్య లక్షణాలు అధికమవుతాయి. ముఖ్యంగా మెదడుకు హానికరం. కాబట్టి రాత్రిపూట పూర్తిగా ఎనిమిది గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి.
Also read: కింద ఇచ్చిన చిత్రం మీ రొమాంటిక్ రిలేషన్‌షిప్ గురించి చెప్పేస్తుంది, ట్రై చేయండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
విచిత్రం - హైవేపై స్పృహ తప్పిన డ్రైవర్, అదుపు తప్పకుండా 25 కిమీలు ప్రయాణించిన కారు
Milk Tea: పాలతో చేసిన టీ అతిగా తాగితే వచ్చే సైడ్ ఎఫెక్టులు ఇవే
Diabetes: మీకు డయాబెటిస్ ఉందో లేదో మీ పాదాలు చెప్పేస్తాయ్
Hypotension: లో-బీపీతో కళ్లు తిరుగుతున్నాయా? కారణాలివే, ఈ జాగ్రత్తలు పాటించండి
Snake Robotic Legs: పాము కాళ్లతో నడవడం చూశారా? లేదంటే ఇప్పుడు చూడండి!
తుమ్మల అనుచరుడి హత్య కేసులో ఆరుగురి అరెస్ట్!
Godfather: మెగాస్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్, 'గాడ్ ఫాదర్' టీజర్ డేట్ ఫిక్స్
Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!
AP High Court: జగన్ సర్కార్ డేంజర్ జోన్లో ఉందన్న ఏపీ హైకోర్టు, ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు