అన్వేషించండి

Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి

Andhra News: సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఆదివారం నారావారిపల్లెలో ముగిశాయి. అంతిమయాత్రంలో చంద్రబాబు తమ్ముడి పాడెను మోశారు.

Nara Rammurthy Naidu Last Rites Completed: ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు (Rammurthy Naidu) అంత్యక్రియలు ఆదివారం పూర్తయ్యాయి. ఆయన స్వగ్రామం తిరుపతి జిల్లా నారావారిపల్లెలో (Naravaripalle) ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu), మంత్రి లోకేశ్, రామ్మూర్తినాయుడు తనయుడు, సినీ నటుడు నారా రోహిత్, గిరీష్ ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల అంత్యక్రియలు నిర్వహించిన చోటే రామ్మూర్తినాయుడి అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్రలో సోదరుడి పాడెను సీఎం చంద్రబాబు మోశారు. అంతకుముందు రామ్మూర్తి భౌతిక కాయానికి మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్, చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ నివాళులర్పించారు. అలాగే, టీడీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు రామ్మూర్తి పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. సినీ నటుడు మోహన్ బాబు, మంచు మనోజ్, సినీ నిర్మాత ఎన్వీ ప్రసాద్ తదితరులు భౌతిక కాయానికి అంజలి ఘటించారు. 

కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతోన్న రామ్మూర్తినాయుడు హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. అనంతరం ఆయన పార్థీవదేహాన్ని స్వగ్రామం నారావారిపల్లెకు తరలించారు. ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

నారా రామ్మూర్తినాయుడు 1952లో ఖర్జూరనాయుడు, అమ్మణ్ణమ్మ దంపతులకు జన్మించారు. సీఎం చంద్రబాబు ఆయన సోదరుడు. రామ్మూర్తినాయుడు ఎస్వీ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలలో బీఏ చేశారు. 1992 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. 1994లో టీడీపీ తరఫున చంద్రగిరి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2003లో అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2004లో శ్రీకాళహస్తి నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించగా ఆ పార్టీతో విభేదించారు. అనంతరం చంద్రగిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి.

Also Read: Kodali Nani: విశాఖలో కొడాలి నానిపై ఫిర్యాదు - సోషల్‌ మీడియా అనుచిత పోస్టుల కేసులో వచ్చే వారం కీలక పరిణామాలు!

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Ysrcp Petition: ఏపీ స్థానిక ఎన్నికల వివాదం.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వైసీపీ
ఏపీ స్థానిక ఎన్నికల వివాదం.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వైసీపీ
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Amaravati Outer Ring Road: అమరావతి ఓఆర్ఆర్‌లో కీలక పరిణామం.. ఇంటర్‌ఛేంజ్‌లు కుదించడంతో తగ్గిన ప్రాజెక్టు వ్యయం
అమరావతి ఓఆర్ఆర్‌లో కీలక పరిణామం.. ఇంటర్‌ఛేంజ్‌లు కుదించడంతో తగ్గిన ప్రాజెక్టు వ్యయం
Jal Jeevan Mission 2.0: కడపలో జల్ జీవన్ మిషన్ 2.0 ప్రారంభించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. 3.27 కోట్ల మందికి ప్రయోజనం
కడపలో జల్ జీవన్ మిషన్ 2.0 ప్రారంభించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. 3.27 కోట్ల మందికి ప్రయోజనం

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
Sivakarthikeyan : నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
Embed widget