Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Pushpa 2: మోస్ట్ అవైటెడ్ ‘పుష్ప 2’ ట్రైలర్‌ను మేకర్స్ ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడాన్ని తాను ఎంజాయ్ చేశానని దేవి శ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు.
Pushpa 2 Trailer: ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన సంఘటన ఏదైనా ఉందా అంటే అది ‘పుష్ప 2’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు వర్క్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లే. దేవి శ్రీ ప్రసాద్‌తో పాటు ఎస్ఎస్ తమన్, అజనీష్ లోకనాథ్, శామ్ సీఎస్ ‘పుష్ప 2’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై వర్క్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఎస్ఎస్ తమన్ అయితే తాను ‘పుష్ప 2’పై పని చేస్తున్నట్లు పలు కార్యక్రమాల్లో అధికారికంగా ప్రకటించాడు కూడా. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయ్యాక దేవిశ్రీ ప్రసాద్ ఒక ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్‌లో ఏం ఉంది?
దేవి శ్రీ ప్రసాద్ తన ట్వీట్‌లో ‘పుష్ప 2’ ట్రైలర్‌లో ప్రతి ఫ్రేమ్‌కు బీజీఎం చేయడాన్ని తాను చాలా ఎంజాయ్ చేశానని పేర్కొన్నారు. ఇది అల్లు అర్జున్, సుకుమార్‌ల మ్యాజిక్ అని అన్నారు. ఇప్పుడు ఈ ట్వీట్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దేవి శ్రీ ప్రసాద్ ట్వీట్‌కు ఫ్యాన్స్ నుంచి, నెటిజన్ల విపరీతమైన సపోర్ట్ వస్తుంది.
Here is d MASSIVE MAGIC of #pushpa2trailer @aryasukku
— DEVI SRI PRASAD (@ThisIsDSP) November 17, 2024
ICON STAAR @alluarjunonline
Enjoyed Scoring BGM for Every Frame of this Magnanimous Trailer🔥🎶❤️
🎶🔥❤️🎶#AssaluThaggedele https://t.co/wpfgrtmFsc
Also Read: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
ట్రైలర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది?
‘పుష్ప 2’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు ఫ్యాన్స్ నుంచి జనరల్ ఆడియన్స్ నుంచి యునానిమస్ రెస్పాన్స్ వస్తుంది. నిజానికి ట్రైలర్‌కు అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు దేవిశ్రీ ప్రసాద్. ట్రైలర్‌కు ఇప్పుడు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్‌కు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన టెర్రిఫిక్ రెస్పాన్స్ కూడా ఒక కారణం.
ట్రైలర్ ఎలా ఉంది?
‘పుష్ప 2’ ట్రైలర్‌ను మేకర్స్ అద్భుతంగా కట్ చేశారు. సినిమా స్కేల్ అంతా ట్రైలర్‌లో చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. హార్బర్, షిప్‌లో వచ్చే ఫైట్లు ఆన్ స్క్రీన్ గూస్ బంప్స్ ఇవ్వనున్నాయని ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోంది. యాక్షన్‌కు చాలా పెద్ద పీట వేశారు. అదంతా స్క్రీన్‌పై కనిపిస్తుంది. జగపతి బాబు, తారక్ పొన్నప్ప వంటి కొత్త పాత్రలను కూడా ట్రైలర్‌లో చూపించారు. మరి ఇంకా ఏమైనా సర్‌ప్రైజ్‌లు ఉంటాయేమో చూడాలి.
మరో 17 రోజుల్లోనే...
‘పుష్ప 2’ సినిమా మరో 17 రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే గట్టిగా చూసుకుంటే రెండు వారాలకు ఒక మూడు రోజులు ఎక్కువ. డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 5వ తేదీ అర్థరాత్రి ఒంటి గంట నుంచి ప్రపంచవ్యాప్తంగా ‘పుష్ప 2’ షోలు పడతాయని తెలుస్తోంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ‘పుష్ప 2’ రూ.250 నుంచి రూ.300 కోట్ల వరకు వసూలు చేస్తుందని అంచనా. ఫుల్ రన్‌లో కనీసం రూ.1500 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు జోస్యం చెబుతున్నారు.