Crime News: భార్యతో తండ్రి అక్రమ సంబంధం - కుమారుడి మృతి- తండ్రి ఎవరో కాదు..మాజీ డీజీపీ !
Ex cop son: మాజీ పంజాబ్ డీజీపీ మహమ్మద్ ముస్తఫా, అతని భార్య రజియా సుల్తానా, కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొడుకు మృతి తర్వాత బయటకు వచ్చిన అంశాలే కారణం.

Former DGP of Punjab: పంజాబ్‌లో హై-ప్రొఫైల్ ఫ్యామిలీ ట్రాజెడీలో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మాజీ పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) కుమారుడు తన పంచకులా ఇంట్లో మరణించిన ఘటనలో వీడియో వెలుగులోకి వచ్చింది. చనిపోయిన కుమారుడు తన తండ్రి తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, తనను హత్య చేసే కుట్ర చేశాడని వీడియోలో ఆరోపించాడు.
మాజీ పంజాబ్ డీజీపీ మహమ్మద్ ముస్తఫా, అతని భార్య మాజీ మంత్రి రజియా సుల్తానా, వారి కుమార్తె, అల్లుడిపై సెక్షన్ 103(1) మరియు 61 బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు. అకీల్‌ను అతని ఫ్యామిలీ తన ఇంట్లో అపస్మారక స్థితిలో కనుగొన్నారు. తర్వాత ఫ్యామిలీ డ్రగ్ ఓవర్‌డోజ్ కారణంగా మరణం జరిగిందని చెప్పారు. అయితే, పొరిగింటి వ్యక్తి షమ్షుద్దీన్ చౌదరి ఫిర్యాదు, అకీల్ ఆగస్ట్ 27న రికార్డ్ చేసిన 16-నిమిషాల వీడియోలో వెలుగులోకి రావడంతో చాలా విషయాలు సంచలనం సృష్టించాయి.
Former Punjab DGP Mohammad Mustafa and his wife, a former minister of Punjab, have been booked in an FIR. The mysterious death of Mohammad Mustafa’s son, Aqeel Akhtar, has taken a serious turn after a video surfaced in which he made serious allegations against his father.… pic.twitter.com/PlWe2g0OSV
— Gagandeep Singh (@Gagan4344) October 21, 2025
మరణానికి కొన్ని రోజుల ముందు రికార్డ్ చేసిన వీడియోలో, అకీల్ తన తండ్రి తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించాడు. అతని తల్లి , సోదరి తనను చంపేందుకు చేసే కుట్రలో భాగమని కూడా ఆరోపించాడు. అకీల్ తనను తప్పుగా చిత్రీకరించి సి, రిహాబిలిటేషన్‌కు పంపారని, తన బిజినెస్ ఇన్‌కమ్‌ను దూరం చేశారని చెప్పాడు. మెంటల్ హరాస్‌మెంట్, శారీరక హింస,తప్పుడు కేసుల బెదిరింపుల వివరాలు కూడా చెప్పాడు.సెల్ఫ్-రికార్డెడ్ వీడియోలో అకీల్ తన పెళ్లి తర్వాత ఎదుర్కొన్న ట్రామాను వివరించాడు. 2018లో తన తండ్రి , భార్య మధ్య అక్రమ సంబంధాన్ని కనుగొన్నానని చెప్పాడు.
#Breaking - The last video before death says a lot.
— Mukund Shahi (@Mukundshahi73) October 21, 2025
There has been a new twist in the suspicious death case of Aqeel Akhtar, son of former Punjab Director General of Police (DGP) Mohammad Mustafa and former Punjab minister Razia Sultana.#Haryana #DGP #Mustafa #Raziasultana pic.twitter.com/OiQlX1iwmK
ఇందులో నిందితుల కుటుంబం మాజీ డీజీపీ కుటుంబం కావడంతో ఈ ఘటన సంచలనంగా మారింది.





















