Tea seller Fraud: పైకి టీ మాస్టర్ - లోపల సైబర్ ఫ్రాడ్ కింగ్ పిన్ - పట్టుకున్న పోలీసులకే మైండ్ బ్లాంక్ !
Bihar Crime: బిహార్‌లో చాయ్ వాలా ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించి రూ.1.05 కోట్ల నగదు, బంగారం, వెండి స్వాధీనం చేశారు. ఆ టీ మాస్టర్ సైబర్ ఫ్రాడ్ నెట్‌వర్క్ లీడర్‌గా గుర్తించారు.

Tea seller turns cyber fraud kingpin: బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో భారీ సైబర్ క్రైమ్ రాకెట్ బయటపడింది. చాయ్ వాలా ఆన్‌లైన్ మోసాల నెట్‌వర్క్ నడిపినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు రెయిడ్ చేశారు. ఆయన ఇంటి నుంచి రూ.1 కోటి పైగా నగదు, ఆభరణాలు, డజన్ల కొద్దీ ఏటీఎం కార్డులు, పాస్‌బుక్స్ స్వాధీనం చేశారు.
అక్టోబర్ 17 శుక్రవారం రాత్రి అమైతి ఖుర్ద్ గ్రామంలోని ఒక ఇంటిపై పోలీసులు దాడి చేశారు. సోదాల్లో రూ.1,05,49,850 నగదు, 344 గ్రాముల బంగారం, 1.75 కేజీల వెండి, ఆన్‌లైన్ మోసాలకు సంబంధించిన పలు వస్తువులు లభ్యమయ్యాయి. స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో 85 ఏటీఎం కార్డులు, 75 బ్యాంక్ పాస్‌బుక్స్, 28 చెక్‌బుక్స్, ఆధార్ కార్డులు, రెండు ల్యాప్‌టాప్స్, మూడు మొబైల్ ఫోన్లు, ఒక లగ్జరీ కారు ఉన్నాయి.
పోలీసుల ప్రకారం, ప్రధాన నిందితుడు అభిషేక్ కుమార్ గతంలో చిన్న చాయ్ స్టాల్ నడిపేవాడు. తర్వాత సైబర్ క్రైమ్ రాకెట్‌లో చేరి, దుబాయ్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి మోసపూరిత కార్యకలాపాలను సమన్వయం చేస్తున్నాడని, అతని సోదరుడు అదిత్య కుమార్ భారత్‌లో లావాదేవీలు, లాజిస్టిక్స్ చూసుకున్నాడని భావిస్తున్నారు. ప్రాథమిక విచారణలో, గ్యాంగ్ మోసపూరితంగా సంపాదించిన డబ్బును బహుళ బ్యాంక్ అకౌంట్లలోకి బదిలీ చేసి, తర్వాత నగదుగా మార్చినట్లు తేలింది” అని పోలీసులు ప్రకటించారు. పోలీసులు ఈ నెట్‌వర్క్ బిహార్‌కు మాత్రమే పరిమితం కాదని, ఇతర రాష్ట్రాలతో లింకులు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. గ్యాంగ్‌తో సంబంధం ఉన్న మరికొందరిని ట్రాక్ చేస్తున్నారు. అభిషేక్ కుమార్ వివిధ రాష్ట్రాల్లో సైబర్ నేరాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అతను ఆన్‌లైన్ మోసాలు, ఫ్రాడ్ కాల్స్ మొదలైనవి నిర్వహిస్తున్న అంతరాష్ట్ర నెట్‌వర్క్‌కు నాయకుడిగా గుర్తించారు. పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.
बिहार के गोपालगंज जिले के अमेठी खुर्द गांव में पुलिस ने साइबर धोखाधड़ी के आरोप में एक चाय वाले को गिरफ्तार किया है. पूरी खबर: https://t.co/clYNbm8d5k pic.twitter.com/3KGrwywIqw
— The Lallantop (@TheLallantop) October 21, 2025
ప్రాథమిక తనిఖీల్లో, స్వాధీనం చేసుకున్న బ్యాంక్ పాస్‌బుక్స్ చాలా బెంగళూరులో జారీ చేసినవని తేలింది. దీంతో విచారణను రాష్ట్రాల్లోనూ కొొనసాగిస్తున్నాయి. అకౌంట్లు ఏదైనా జాతీయ స్థాయి సైబర్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్నాయా అని అధికారులు పరిశీలిస్తున్నారు. దాడి తర్వాత, ఆదాయపు పన్ను శాఖ, యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) బృందాలు కూడా విచారణలో చేరాయి. నిధుల మూలాలను ధృవీకరించడం, సంఘటిత సైబర్ క్రైమ్‌తో సంబంధాలు ఉన్నాయా అని తనిఖీ చేస్తున్నాయి. అరెస్ట్ అయిన ఇద్దరు, అభిషేక్ కుమార్ మరియు అదిత్య కుమార్‌లను రెండు రోజులుగా విచారిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న పరికరాల నుంచి డేటాను విశ్లేషిస్తూ, నెట్‌వర్క్‌లో మరిన్ని సభ్యులను గుర్తిస్తున్నారు.





















