Love Crime Story: లవర్‌తో వెళ్లిపోయిన 50 ఏళ్ల వ్యక్తి - కుమార్తె పెళ్లి కోసం దాచిన నగలతో సహా - సినిమాల్లోనూ ఉండని క్యారెక్టర్ !
Old Lover: కేరళలో 50 ఏళ్ల వ్యక్తి ప్రేయసితో పారిపోయాడు. కూతురు పెళ్లి కోసం పొదుపు చేసిన నగదు, బంగారు ఆభరణాలు కూడా తీసుకెళ్లాడు.

50 year old elopes with lover: అప్పో సప్పో చేసి కుమార్తె పెళ్లి చేద్దామనుకునేవారిని చూసి ఉంటాం కానీ.. పిల్లల పెళ్లి కోసం దాచిన డబ్బు, బంగారంతో పారిపోయే తండ్రిని ఎక్కడా చూసి ఉండం. కానీ ఇప్పుడు కేరళలో అలాంటి తండ్రిని చూడవచ్ుచ. ప్రేమ పేరుతో ఓ మధ్య వయస్కుడు తన ప్రేయసితో పారిపోయాడు. కూతురు పెళ్లి కోసం పొదుపు చేసిన నగదు, బంగారు ఆభరణాలను తీసుకుని వెళ్లిపోయాడు. ఈ ఘటన కేరళలో జరిగింది.
ఎర్నాకులం జిల్లాలోని కున్నతునాడు సమీపంలోని వెంగోలా నివాసి సురేంద్రన్ తన తిరువనంతపురం స్వస్థలమైన ప్రేయసితో కలిసి పెళ్లి చేసుకుని పారిపోయాడు. ఈ ఘటన కూతురు పెళ్లికి కొన్ని వారాల ముందు జరిగింది. కూతురు ఫిర్యాదు మేరకు పెరుంబావూర్ పోలీసులు ఇన్‌స్పెక్టర్ టీఎం సూఫీ నేతృత్వంలో ఎర్నాకులం రూరల్ పోలీసుల బృందం సురేంద్రన్‌ను, అతని ప్రేయసిని తిరువనంతపురంలో గుర్తించింది. "కూతురుతో ఫోన్ మాట్లాడిన తర్వాత సురేంద్రన్ పెళ్లికి హాజరై ఆచారాలు నిర్వహించడానికి అంగీకరించాడు. రెండు పక్షాలు విషయాన్ని మూసివేయాలని కోరడంతో ఫిర్యాదు ఉపసంహరించారు " అని ఎర్నాకులం రూరల్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
పెళ్లి సన్నాహాల్లో భాగంగా సురేంద్రన్ ఇంటికి ఐదు సవర్లల బంగారు ఆభరణాలు, గణనీయమైన నగదును తీసుకువచ్చి తన గదిలోని షెల్ఫ్‌పై ఉంచాడు. కొన్ని రోజుల తర్వాత అతని భార్య ఆ వస్తువులు కనిపించకపోవడం గమనించింది. ఆమె ముందుగా భర్తకు చెప్పాలని అనుకున్నా, అతని ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉంది. ఆ రాత్రి అతడు ఇంటికి తిరిగి రాలేదు. ఏదో తప్పు జరిగిందని భావించి ఆమె కూతురుకు సమాచారం ఇచ్చింది. మరో రెండు రోజుల పాటు సురేంద్రన్ తిరిగి వస్తాడని కుటుంబం ఎదురుచూసింది, కానీ అతడు రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఈ కేసును సున్నితంగా డీల్ చేశారు. తిరువనంతపురం పోలీసుల సహాయంతో మేము ఆ జంటను గుర్తించారు. తర్వాత మళ్లీ సురేంద్రన్‌ను సంప్రదించారు. అప్పుడు అతని కూతురు తన పెళ్లికి హాజరు కావాలని వేడుకుంది. దానికి సురేంద్రన్ అంగీకరించడంతో ఫిర్యాదు వాపసు తీసుకున్నారు.
దర్యాప్తులో సురేంద్రన్, అతని ప్రేయసి ఫేస్‌బుక్‌లో పరిచయమైనట్టు తేలింది. ఆమె కెనడాలో ఉద్యోగం చేస్తుంది. వారి స్నేహం క్రమంగా ప్రేమగా మారి, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమిళనాడులోని ఓ ఆలయంలో వారు పెళ్లి చేసుకున్నారు. ప్రేయసికి కూడా పెళ్లైంది, ఆమె భర్త కెనడాలో ఉంటున్నాడు. సురేంద్రన్‌కు మరో చిన్న కుమారుడు కూడా ఉన్నాడు. ఈ లవ్ స్టోరీ కేరళలో హాట్ టాపిక్ గా మారింది.





















