Bhimavaram DSP: డీఎస్సీ జయసూర్యపై డిప్యూటీ సీఎం పవన్ ఫైర్ - జనసేనకు క్లోజే - మరేం జరిగింది ?
DSP Jayasurya: భీమవరం డీఎస్పీ పై డీజీపీ, హోంమంత్రులకు పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేశారు. ఆయన వ్యవహారంపై పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు.

Pawan Kalyan: భీమవరం డిఎస్పీ జయసూర్య వ్యవహారాలపై పశ్చిమ గోదావరి ఎస్పీతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చర్చించారు. జయసూర్య వ్యవహారాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. భీమవరం డి.ఎస్.పి. పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయనీ, సివిల్ వివాదాలలో సదరు అధికారి జోక్యం చేసుకొంటున్నారనీ, కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేరు వాడుతున్నారనే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
జనసేన పేరు వాడుతూ సెటిల్మెంట్లు చేస్తున్న భీమవరం డీఎస్పీ జయసూర్య ?
ఇవి రాను రాను శ్రుతిమించడంతో మంగళవారం మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఈ అంశంపై ఉప ముఖమంత్రి పవన్ కల్యాణ్ ఫోన్ లో మాట్లాడారు. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులు ప్రస్తావించి డి.ఎస్.పి. వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని స్పష్టం చేశారు. అసాంఘిక వ్యవహారాలకు డి.ఎస్.పి. స్థాయి అధికారి అండగా ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలని, పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకుండా చూడాలన్నారు. ఈ తరహా వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదనే విషయాన్ని సిబ్బందికి తెలియచేయాలన్నారు. ప్రజలందరినీ సమదృష్టితో చూసి శాంతిభద్రతలను పరిరక్షించాలని దిశానిర్దేశం చేశారు.
పూర్తి సమాచారం తెప్పించుకుని ఎస్పీతో మాట్లాడిన పవన్ కల్యాణ్
భీమవరం డి.ఎస్.పి.పై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర హోమ్ శాఖ మంత్రికీ, రాష్ట్ర డీజీపీకి తెలియచేయాలని తన కార్యాలయ అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఓ డీఎస్పీపై పవన్ కల్యాణ్ ఇంత ఆగ్రహం వ్యక్తం చేయాడనికి బలమైన కారణాలు ఉంటాయని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. జయసూర్య వైసీపీ హయాంలో కృష్ణా జిల్లా గన్నవరం డీఎస్పీగా పని చేశారు. అంత కీలకమైన స్థానంలో డీఎస్పీగా ఉన్నారంటే ఆయన వైసీపీ నేతలకు సన్నిహితుడేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదంటున్నారు.
తన దందాలను జససేనకు చుట్టే ప్రయత్నం
ఈ ప్రభుత్వంలో భీమవరంలో డీఎస్పీగా పోస్టింగ్ పొందిన తర్వాత ఆయన జనసేన పార్టీ నేతలతో ముఖ్యంగా ఎమ్మెల్యే అంజిబాబుతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఎమ్మెల్యే మాట జవదాటరని చెబుతారు. అయితే ఆ సాన్నిహిత్యంతో తన దందాలు తాను చేసుకుని అక్రమ వ్యవహారాలకు అండగా నిలుస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సివిల్ సెటిల్మెంట్లు చేస్తున్నారుని.. ఆస్తుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు.. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ పేరును కూడా వాడేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.దీనికి సంబంధించిన ఫిర్యాదులు నేరుగా పవన్ కే వెళ్లాయని తెలుస్తోదంి.
పవన్ కల్యాణ్ అప్పటికి పూర్తి సమాచారం తెప్పించుకున్న తర్వాతనే ..జయసూర్య అంశంపై పవన్ స్పందించారని అంటున్నారు. పూర్తిగా జనసేన పార్టీతో ఉన్నట్లుగా వ్యవహరిస్తూ అడ్డగోలు పనులు చేయడమే.. పవన్ కల్యాణ్‌కు ఆపాదించిన విషయం బయటకు తెలియడంతోనే ఆయన విషయం బయటకు వచ్చిందంటున్నారు. పవన్ ఆగ్రహంతో ఆయనను.. బదిలీ చేయడం ఖాయంగా కనిపిస్తోందని భావిస్తున్నారు.





















