అన్వేషించండి

AP CM Chandrababu: ఏపీలో ప్రజల భద్రత, నిఘా కోసం సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. పోలీసులపై ప్రశంసలు

ప్రజల భద్రత కోసం నిఘా పెంచుతూ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి 55 కిలోమీటర్ల కు ఒక cc camera ఏర్పాటు చేస్తామన్నారు

Andhra Pradesh | మంగళగిరి : పోలీసు యంత్రాంగానికి మూడో కన్నులా సీసీ కెమెరాలు పనిచేస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి 55 కి.మీలకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. టెక్నాలజీ సాయంతో ఎవరు, ఎక్కడ, ఏ తప్పు చేసినా ఆధారాలతో పట్టుకునే పరిస్థితి రావాలన్నారు. ఈగల్‌, శక్తి బృందాల ఏర్పాటుతో రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందని వారి సేవల్ని సీఎం చంద్రబాబు కొనియాడారు.

చైనాతో పోరాడుతూ అమరులైన భారత జవాన్లు
ప్రజల రక్షణ కోసం ఎల్లప్పుడూ ముందుండేది, విధి నిర్వహణ కారణంగా తమ కుటుంబంతో సరిగా గడపలేనిది పోలీసులేనని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు. విధి నిర్వహణ కారణంగా తమ కుటుంబంతో సరిగా గడపలేని పరిస్థితి వారిదని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని 6వ బెటాలియన్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ‘అమరులు వారు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సీఆర్‌పీఎఫ్‌ దళాలు 1959 అక్టోబర్‌ 21న  వీరోచిత పోరాటం చేశాయి. చైనా సైనికులపై జరిపిన పోరాటంలో 10 మంది భద్రతా సిబ్బంది దేశం కోసం అమరులయ్యారు. వారిని స్మరించుకుంటూ ప్రతి ఏడాది ఇదే రోజు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. వారి త్యాగాలను గుర్తుచేసుకుంటూ వారి నుంచి మనం స్ఫూర్తి పొందాలన్నారు.

ఈ ఏడాది దేశవ్యాప్తంగా 192 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారు. ప్రజల ప్రాణ రక్షణ కోసం పోలీసులు తమ ప్రాణాలు సైతం పణంగా పెడుతున్నారు. రాష్ట్రంలో ఫ్యాక్షనిజం, నక్సలిజం, రౌడీయిజం, గంజాయి లాంటి బ్యాచ్‌లను అణచివేయడంలో పోలీసులు రాణిస్తున్నారు. వారి సంతోషాన్ని త్యాగం చేసి మరి పోలీసులు మన ప్రాణాలు కాపాడుతున్నారు. పోలీసులు అనగానే కఠినంగా ఉంటారని భావిస్తాం. కానీ ఎంతో మానవత్వంతో వ్యవహరించి విధి నిర్వహణలో శ్రమించేది వాళ్లే. విజయవాడలో పిల్లలు చెప్పులు లేకుండా వెళ్తుంటే చూసి చలించిపోయిన హెడ్ కానిస్టేబుల్ వారికి చెప్పులు కొనిచ్చి వారి ముఖాల్లో సంతోషాన్ని నింపారు.

విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి విదేశాల్లో పర్యటించనున్నారు. దుబాయ్‌, అబుదాబి, యూఏఈలో పర్యటించనున్నారు. నవంబర్‌లో విశాఖలో జరిగే సీఐఐ సమ్మిట్‌లో పాల్గొనాలని విదేశీ పెట్టుబడుదారులను ఆహ్వానించనున్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Amaravati Seed Access Road inauguration:
"గ్రాఫిక్స్ అన్న వాళ్లే తలదించుకునేలా అమరావతి" సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవంలో చంద్రబాబు కామెంట్స్!
Amaravati Seed Access Road: అమరావతి నిర్మాణంలో మరో మైలురాయి! సీడ్ యాక్సెస్‌ ఇ-3 రహదారి, స్టీల్ బ్రిడ్జ్‌ ప్రారంభం!
అమరావతి నిర్మాణంలో మరో మైలురాయి! సీడ్ యాక్సెస్‌ ఇ-3 రహదారి, స్టీల్ బ్రిడ్జ్‌ ప్రారంభం!
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget