అన్వేషించండి

Nara Lokesh Australia Tour: ఏపీ సీఫుడ్ పరిశ్రమకు సహకారం అందించాలని ఆస్ట్రేలియా ప్రతినిధులను కోరిన నారా లోకేష్

Nara Lokesh in Australia | ఏపీ సీఫుడ్ పరిశ్రమకు సహకారం అందించాలని, ఆక్వా ఉత్పత్తుల నాణ్యతకు కలిసి పనిచేయాలని సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా సీఈవో వెరోనికా పాపకోస్టాను ఏపీ మంత్రి నారా లోకేష్ కోరారు.

సిడ్నీ: సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా (SIA) ప్రతినిధులు, ఆ సంస్థ సీఈవో వెరోనికా పాపకోస్టా, ఎస్ఐఏ ఎంగేజ్ మెంట్ మేనేజర్ జాస్మిన్ కెల్లేలతో ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సిడ్నీ సమీపంలోని పారమట్టాలో భేటీ అయ్యారు. ఏపీ సీఫుడ్ పరిశ్రమ నెట్ వర్కింగ్ కు సహకారం అందించాలని కోరారు. ఏపీలో ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంపుదలకు కలిసి పనిచేయాలన్నారు.

సీ ఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా (SIA) సీఈవో వెరోనికా పాపకోస్టా మాట్లాడుతూ... 2017 నుండి ప్రారంభమైన SIA లో ఆస్ట్రేలియాలోని వైల్డ్ క్యాచ్, ఆక్వాకల్చర్, సీఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు చెందిన  30వేలకు పైగా వ్యాపారులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. తమ సంస్థ ప్రతి ఏటా ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థకు AUD 3.5 బిలియన్ విలువైన వాటాను అందిస్తోందని పేర్కొన్నారు. బయో సెక్యూరిటీ, ఎగుమతి పనితీరును మెరుగుపరచేందుకు ప్రభుత్వ, పరిశోధనా సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. 


Nara Lokesh Australia Tour: ఏపీ సీఫుడ్ పరిశ్రమకు సహకారం అందించాలని ఆస్ట్రేలియా ప్రతినిధులను కోరిన నారా లోకేష్

ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో ఏపీ అగ్రస్థానం: నారా లోకేష్

ఏపీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... సముద్ర ఉత్పత్తుల ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ భారత్ లో అగ్రగామిగా ఉంది. దేశం మొత్తమ్మీద ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో ఏపీ 60శాతానికి పైగా వాటా కలిగి ఉంది. 2024-25లో $7.4 బిలియన్ డాలర్ల (రూ.66 వేలకోట్లు) విలువైన 16.98 మిలియన్ టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఏపీ నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యాయి. ఆస్ట్రేలియా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులతో ఆంధ్రప్రదేశ్‌ సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులను అనుసంధానించేందుకు ట్రేడ్ మిషన్లు, నెట్‌వర్కింగ్ కార్యక్రమాలను చేపట్టండి. భారత సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌ విస్తరణ కోసం ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా పరిశ్రమదారులు, ఆస్ట్రేలియా దిగుమతి దారుల మధ్య భాగస్వామ్యాలను సులభతరం చేయాలని’ కోరారు. Nara Lokesh Australia Tour: ఏపీ సీఫుడ్ పరిశ్రమకు సహకారం అందించాలని ఆస్ట్రేలియా ప్రతినిధులను కోరిన నారా లోకేష్

కలినరీ టూరిజంను ఆకర్షించేందుకు కార్యక్రమాలు

ఆక్వా ఉత్పత్తుల నాణ్యత, నిల్వ కాలాన్ని పెంచేందుకు ప్రాసెసింగ్‌, కోల్డ్ చైన్ మేనేజ్ మెంట్, ప్యాకేజింగ్ రంగాల్లో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను పరిచయం చేయాలని నారా లోకేష్ కోరారు.  పర్యావరణ ప్రభావాన్ని తగ్గిస్తూ ఉత్పాదకతను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్‌లో స్థిరమైన ఆక్వా కల్చర్,  మత్స్య సంపద నిర్వహణకు ఏపీ ఆక్వా పరిశ్రమదారులతో కలిసి నైపుణ్యాన్ని పంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ సీఫుడ్ వంటకాలను ప్రోత్సహించి, కలినరీ టూరిజంను ఆకర్షించేందుకు సంయుక్త కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సముద్ర మట్టాల పెరుగుదల, తీవ్రమైన వాతావరణ మార్పుల ప్రభావాల‌ను ఎదుర్కొనేలా ఆంధ్రప్రదేశ్‌ సీఫుడ్ పరిశ్రమలో నిరోధకశక్తిని పెంచే ప్రాజెక్టులపై కలిసి పనిచేయాలని ఆస్ట్రేలియా సంస్థ ప్రతినిధులను ఏపీ మంత్రి లోకేష్ కోరారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
YS Jagan On DSC 2025:
"డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించింది, అందుకే సీబీఐ విచారణ చేయాలి" వైఎస్‌ జగన్ డిమాండ్ 

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Embed widget