Nara Lokesh: పెట్టుబడుల సదస్సు కోసం ఆస్ట్రేలియాలో రోడ్ షో - పారిశ్రామికవేత్తలతో నారా లోకేష్ చర్చలు
Nara Lokesh Australia tour: నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సోమవారం పలు ముఖ్యమైన సమావేశాలు జరిపారు. పార్లమెంట్ భవనంలో జరిగిన ఇన్వెస్టర్స్ రోడ్ షో సమావేశంలో పాల్గొన్నారు.

Investor roadshow in jubilee hall at the NSW parliament: ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సోమవారం సిడ్నీలో పలు ముఖ్యమైన సమావేశాలు జరిపారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆహ్వానంపై 'స్పెషల్ విజిటర్స్ ప్రోగ్రాం' కింద ఆరు రోజుల పర్యటన చేపట్టిన లోకేష్, రాష్ట్రంలో విద్య, ఐటీ, పునరుత్పాదక ఇంధనం, పెట్టుబడులు వంటి రంగాల్లో సహకారాన్ని పెంచేందుకు ఈ సమావేశాలు నిర్వహించారు. ఈ పర్యటన లక్ష్యం ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల హబ్‌గా మార్చడం, విశాఖపట్నంలో నవంబర్ 14-15న జరిగే సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు ఆహ్వానించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్ భవనంలో జరిగిన ఇన్వెస్టర్స్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఏపీలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ (ఏఐబీసీ) ప్రతినిధులు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొన్నారు.
Just in: The @followCII investor roadshow begins, in the historic and breathtaking jubilee hall at the NSW parliament building! pic.twitter.com/UoFUHVJZoj
— Lokesh Nara (@naralokesh) October 20, 2025
అంతకు ముందు యూనివర్శిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ (యూఎన్‌ఎస్‌డబ్ల్యూ)ను సందర్శించారు. యూనివర్శిటీ ఉన్నతాధికారులు, పరిశోధకులతో సమావేశమై అధునాతన బోధనా పద్ధతులు, పునరుత్పాదక ఇంధనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆవిష్కరణలపై చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలతో యూఎన్‌ఎస్‌డబ్ల్యూ సహకారాన్ని ప్రోత్సహించేలా జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు, విద్యార్థి మార్పిడి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. ఇందులో స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్), ఏఐ, పునరుత్పాదక ఇంధనాలపై దృష్టి సారించారు. అలాగే, టెలిమెడిసిన్, పబ్లిక్ హెల్త్, మాతృ ఆరోగ్య సంరక్షణ పరిశోధన, స్మార్ట్ సిటీలు, సుస్థిర నగరాభివృద్ధి, డేటా ఆధారిత పాలన వంటి అంశాలపై చర్చలు జరిగాయి. యూఎన్‌ఎస్‌డబ్ల్యూ సోలార్ ఇన్నోవేషన్, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్లోబల్ సస్టైనబిలిటీలో ఆధిక్యత ఆంధ్రప్రదేశ్ జ్ఞానాధారిత టెక్నాలజీ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని లోకేష్ పేర్కొన్నారు.
#InvestInAP
— Lokesh Nara (@naralokesh) October 20, 2025
Here’s how I spent my Diwali — Part 2 😊
Chaired a productive roundtable hosted by the Australia–India CEO Forum in Sydney, meeting top Australian business leaders led by HSBC CEO Anthony Shaw. Shared how #AndhraPradesh attracted $120 bn in investments within… pic.twitter.com/PVdaeHOdDO
ఆస్ట్రేలియా-ఇండియా సీఈఓ ఫోరమ్ ఆధ్వర్యంలో సిడ్నీలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని అధ్యక్షత వహించారు. హెచ్‌ఎస్‌బీసీ సీఈఓ ఆంథోనీ షా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో అమెజాన్, సిస్కో, ఈవై, గ్రెయిన్ కార్ప్, హెచ్‌సీఎల్ టెక్, కేపీఎంజీ, మాస్టర్ కార్డ్ వంటి ప్రముఖ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు, ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 16 నెలల్లో 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించిన విధానాలు, సులభ సౌకర్యాల గురించి లోకేష్ వివరించారు. గూగుల్ ప్రతినిధి అలెక్స్ ఇటీవల 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రకటనపై సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో పాల్గొన్నవారిని నవంబర్‌లో సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు ఆహ్వానించారు.





















