అన్వేషించండి

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desam

నయనతార తమిళ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్. తనకంటూ ఓ స్టేచర్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆర్టిస్ట్. ఇక ధనుష్ తమిళ్ సినిమాను నేషనల్, ఇంటర్నేషనల్ లెవల్ కు తీసుకెళ్లిన హీరో. రజినీకాంత్ అల్లుడిగా కెరీర్ మొదలుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేకమైన కల్ట్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న గొప్ప నటుడు. మరి వీళ్లిద్దరూ ఓ వివాదానికి కారణమైతే. ఇప్పుడు ఇదే తమిళ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ధనుష్ తీరును అతని వ్యక్తిత్వాన్ని నేరుగా తిడుతూ నయనతార ఏకంగా ఓ లెటర్ రాసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం పెద్ద సంచలనంగా మారింది. మేటర్ ఏంటంటే నెట్ ఫ్లిక్స్ నయనతార లైఫ్ జర్నీపై ఓ డాక్యుమెంటరీ చేసింది. అందులో నయన్ సినిమాల్లోకి వచ్చిన విధానం.. తర్వాత సూపర్ స్టార్ స్టేటస్..డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో పెళ్లి..తర్వాత పిల్లలు ఇలా తన పర్సనల్ అండ్ ఫ్రొషెనల్ జర్నీ ఉంటుంది ఆ డాక్యుమెంటరీలో. ఈ నెల 18న ఆ డాక్యుమెంటరీ విడుదల అవుతున్నట్లు ఓ ట్రైలర్ కూడా వచ్చింది. 

   ఇప్పుడు ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ఓ అంశం నయన్ ను విపరీతంగా బాధించింది. అదే నానుమ్ రాడీ దాన్ సినిమా. విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో విజయ్ సేతుపతి హీరోగా, నయనతార హీరోయిన్ గా వచ్చిన ఆ సినిమా 2015లో రిలీజైంది. తెలుగులో నేనూ రౌడీనే పేరుతో డబ్బింగ్ అయ్యి ఇక్కడ అక్కడా ఘన విజయం సాధించింది. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ ధనుష్. వండర్ బార్ ప్రొడక్షన్ హౌస్ మీద ఆ సినిమాను ప్రొడ్యూస్ చేశారు ధనుష్. ఈ సినిమా టైమ్ లో నే డైరెక్టర్ విఘ్నేశ్ కి, హీరోయిన్ నయనతారకు మధ్య ప్రేమ మొదలైంది. ఆ తర్వాత వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు.అందుకని నయన్ కి ఆ సినిమా మంచి సెంటిమెంట్. తన నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో కూడా ఆ సినిమా ప్రస్తావన ఉండాలని...ఆ మ్యూజిక్ వీడియోస్..ఆ థీమ్ మ్యూజిక్...ఆ సినిమాకు సంబంధించిన సాంగ్స్ కొన్ని డాక్యుమెంటరీ లో పెట్టించింది. నెట్ ఫ్లిక్స్ ఈ ఫుటేజ్ కోసం ప్రొడ్యూసర్ ధనుష్ కు NOC రిక్వెస్ట్ లెటర్ పంపించింది. అయితే ధనుష్ నో అబ్జక్షన్ సర్టిఫికేట్ మీద సంతకం పెట్టలేదు. అతను తాత్సారం చేస్తున్నాడని అర్థం చేసుకున్న నయనతార ఆ ఫుటేజ్ కి బదులుగా BTS అంటే సినిమా షూట్ చేస్తున్నప్పుడు పర్సనల్ గా వాళ్ల మొబైల్స్ తీసుకున్న ఫోటోలు, విజువల్స్ ను డాక్యుమెంటరీ ట్రైలర్ లో వాడుకోమని చెప్పింది తన భర్తే ఆ సినిమాకు డైరెక్టర్ కాబట్టి. ఇది కాకుండా సినిమాకు సంబంధించి ఒకటి రెండు ఫోటోలు, మూడు సెకన్ల విజువల్ వాడుకున్నారు అంట ట్రైలర్ లో. ఈ విషయాన్ని నయనతారే లెటర్ లో చెప్పింది.

అయితే ధనుష్ తన పర్మిషన్ లేకుండా తన సినిమా ను నెట్ ఫ్లిక్స్ కి వాడుకున్నారని లీగల్ నోటీస్ లు పంపారట. అది కూడా పదికోట్ల రూపాయలకు. ఇదే నయనతార ను విపరీతంగా బాధించింది. మూడుసెకన్ల విజువల్ కి పదికోట్లు డిమాండ్ చేయాలా..? ప్రొడ్యూసర్ అయినంత మాత్రాన ఆ సినిమా మీద సర్వ హక్కులు అతనికే ఉంటాయా..మనుషుల సెంటిమెంట్ తో వాళ్ల సెన్సిబులిటీస్ తో హ్యూమన్ ఎమోషన్స్ కి అసలు రెస్పెక్టే ఉండందా ధనుష్ అంటూ తన లెటర్ లో నేరుగా ప్రశ్నలు గుప్పించింది నయనతార. అంతటితో ఆగిపోలేదు. నువ్వు ఇప్పుడు లీగల్ నోటీసులు పంపినంత మాత్రాన నేను ఆగిపోను. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన దాన్ని ఈ పొజిషన్ లో నిలబడి చూపించిన దాన్ని...ఆ డాక్యుమెంటరీని నీ సినిమా ప్రస్తావన లేకుండా రీ ఎడిట్ చేయించి రిలీజ్ చేయిస్తాం. కానీ నీ లాంటి ఓ క్రుయల్ మైండ్ సెట్ ని పబ్లిక్ లో పెట్టాలి అందుకే ఈ లెటర్ రాస్తున్నా అని లెటర్ ను పోస్ట్ చేసింది నయనతార. అక్కడితో కూడా క్లోజ్ చేయకుండా నీ ఫ్యాన్స్ ముందు అత్యంత అమయాకుడిలా నటిస్తూ స్పీచ్ లు ఇస్తావ్..అందరితో మంచిగా ఉండాలి హెల్ప్ చేయాలని సోది కబుర్లు చెబుతావ్...ఇది నీ అసలు రంగు అంటూ బీభత్సమైన కామెంట్స్ చేసింది. నేనూ రౌడీనే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వటంతో తనకు పేరు రావటం..తన భర్తకు పేరు రావటం ధనుష్ తట్టుకోలేకపోయాడని..అందుకే సినిమాకు అవార్డులు వచ్చినా తమను కనీసం ఇన్వైట్ కూడా చేయకుండా ధనుషే ఆ అవార్డులను తీసుకుని తన కుళ్లు బుద్ధిని చాటుకున్నాడని లెటర్ లో రాసింది నయనతార.  పైగా జర్మన్ భాషలోని ఓ పదాన్ని ధనుష్ వకాబులరీలో యాడ్ చేస్తున్నాని చెబుతా షాడెన్ ఫ్రాయిడా అనే పదాన్ని వాడింది నయనతార. పక్కవాళ్లు బాధపడుతుంటే అనుకోకుండా వాళ్లు కష్టాల్లో పడితే దాన్ని చూసి ఆనందపడేవాళ్లను షాడెన్ ఫ్రాయిడా అంటారు. సో ధనుష్ అలాంటి క్యారెక్టర్ కలిగిన వాడని అంది నయనతార.

   అఖరుగా నీలాగా మేం ఉండలేం..ఈ డాక్యుమెంటరీ రిలీజ్ ఎలా అయినా చేస్తా..చేశాక ఓ సారి నువ్వు కూడా చూడు. మనిషిగా బతకటం నిలబడటం అనేది ఎంత గొప్పదో తెలుస్తుంది. అప్పటికైనా నీ ఆలోచనలు మారతాయి నీలో ఓ మార్పు వస్తుందని భావిస్తున్నా...స్ప్రెడ్ లవ్ అనే పదానికి అర్థం తెలుసుకుంటావ్ అని ఆశిస్తున్నా అంటూ ఓ అడ్వైజ్ కూడా ఇచ్చింది.  ఇంత పెద్ద స్టార్స్ ...వాళ్ల మధ్య వచ్చిన ఓ సమస్య..మే బీ ఇరు పక్షాలు కూర్చుని మాట్లాడుకుంటే అయిపోయిందేమో. కానీ అలా చేయకుండా ఇలా సోషల్ మీడియా వేదికగా నయన్ పెట్టిన ఈ పోస్ట్ పెద్ద సంచలనం గా మారింది. మరి ధనుష్ ఊరుకుంటాడా లేదా ఏదన్నా స్ట్రాంగ్ రిప్లై ఇస్తాడా ఈ ఇష్యూ ఎంతవరకూ వెళ్తుంది చూడాలి.

ఎంటర్‌టైన్‌మెంట్‌ వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Oh Sukumari OTT : ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మాయి - భర్త ఏం చేశాడు?... ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ కామెడీ
ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మాయి - భర్త ఏం చేశాడు?... ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ కామెడీ
Illu Illalu Pillalu Serial Today August 5th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: తప్పతాగి రచ్చ రచ్చ చేసిన ధీరజ్! ధీమా విడిపోవడానికే వల్లీనే కారణమని తెలుసుకున్న నర్మద ఏం చేయనుంది?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: తప్పతాగి రచ్చ రచ్చ చేసిన ధీరజ్! ధీమా విడిపోవడానికే వల్లీనే కారణమని తెలుసుకున్న నర్మద ఏం చేయనుంది?
Shiva Kumar: బిగ్ బాస్ 10 ప్రాబబుల్స్ లిస్ట్‌లో శివకుమార్?.. ప్రియాంక జైన్ లవర్ రియల్ లైఫ్ విషయాలు
బిగ్ బాస్ 10 ప్రాబబుల్స్ లిస్ట్‌లో శివకుమార్?.. ప్రియాంక జైన్ లవర్ రియల్ లైఫ్ విషయాలు
Pradeep Rawat Passes Away: ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
Embed widget