అన్వేషించండి

OTT Telugu Movie: ఈ కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయ్ - ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?

ఇవాళ ఓటీటీలో పలు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రీసెంట్ గా విడుదలై మంచి సక్సెస్ అందుకున్న చిత్రాలు సందడి చేస్తున్నాయి. ఇంట్లోనే బోలెడు వినోదాన్ని పంచుతున్నాయి.

OTT Telugu Movie: వేసవి ప్రారంభం కావడంతో బయట ఎండలు మండుతున్నాయి. జనాలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లేందుకే భయపడుతున్నారు. కొంత మంది థియేటర్లకు వెళ్లి హాయిగా సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తుండగా, మరికొంత మంది ఇంట్లోనే ఉంటూ హాయిగా ఓటీటీలో సినిమాలు చూస్తూ సరదగా గడుపుతున్నారు. ఇవాళ(ఏప్రిల్ 5న) పలు సినిమాలు థియేటర్లలో అడుగు పెట్టాయి. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ఫ్యామిలీ స్టార్’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. సూర్య తేజ, మీనాక్షి గోస్వామి హీరో, హీరోయిన్లుగా నటించిన ‘భరతనాట్యం’ కూడా థియేటర్లలోకి అడుగు పెట్టింది. హాలీవుడ్ నటుడు దేవ్ పటేల్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘మంకీ మ్యాన్’ కూడా ఇవాళే రిలీజ్ అయ్యింది. హనుమంతుడిని ప్రేరణగా తీసుకుని తెరకెక్కించిన ఈ సినిమా అమెరికాలో విడుదలై అద్భుత ఆదరణ దక్కించుకుంది. అటు ఇవాళ పలు సినిమాలు ఓటీటీలో అడుగు పెట్టాయి. రీసెంట్ గా విడుదలైన చాలా తెలుగు సినిమాలు అభిమానులను అలరిస్తున్నాయి. ఇంతకీ  ఏ సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతున్నాయో తెలుసుకుందాం..

ఇవాళ ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు ఇవే!

1. చారి 111- అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్

వెన్నెల కిశోర్‌ లీడ్ రోల్ లో తెరకెక్కిన రీసెంట్ మూవీ ‘చారి 111’. సంయుక్త విశ్వనాథన్‌ హీరోయిన్‌ నటించింది. మార్చి 1న విడుదలైన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి అడుగు పెట్టింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ప్రేక్షకులను అలరిస్తోంది.   

2. కిస్మత్‌- అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్

అభినవ్, నరేష్ అగస్త్య, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘కిస్మత్’.  క్రైం, కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీనాథ్‌ బాదినేని దర్శకత్వం వహించారు. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

3. తంత్ర- ఆహాలో స్ట్రీమింగ్‌

తెలుగమ్మాయి అనన్య నాగళ్ల లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘తంత్ర’. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సలోని, ధనుష్ రఘుముద్రి, వంశీ కీలక పాత్రలు పోషించారు. మార్చి 15న విడుదలైన ఈ సినిమా తాజాగా ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.  

4. హనుమాన్‌- మరికొన్ని భాషల్లో విడుదల

ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘హనుమాన్’. ఈ మూవీ ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు తెలుగు, హిందీలో ప్రేక్షకులను అలరించగా, ఇవాళ తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

5. లంబసింగి- డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో స్ట్రీమింగ్‌

భరత్‌ రాజ్‌, దివి జంటగా నటించిన చిత్రం ‘లంబసింగి’. నవీన్ గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తాజాగా  డిస్నీప్లస్ హాట్‌ స్టార్‌ లో స్ట్రీమింగ్‌ అవుతోంది. రియలిస్టిక్ గా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.  

Read Also: రాత్రిళ్లు నిద్రపోని భార్య, ఏం చేస్తుందా అని చూస్తే షాక్ - ఐశ్వర్య రాజేష్ ‘డియర్’ ట్రైలర్ వచ్చేసింది!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget