Namrata Shirodkar: సితారనూ వదలని దుండగులు - పోలీసులను ఆశ్రయించిన నమ్రత శిరోద్కర్
మహేష్ బాబు సతీమణి నమ్రత పోలీసులను ఆశ్రయించారు. తన కూతురు సితార పేరును వాడుకుంటూ, కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.

Namrata Shirodkar Complaint To Cyber Crime Police: సోషల్ మీడియాలో సెలబ్రిటీల పేరుతో మోసాలకు పాల్పడ్డం కామన్ అయ్యింది. సెలబ్రిటీల కన్నా, వారి పేరుతో అభిమానులు అకౌంట్లు క్రియేట్ చేస్తున్నారు. వీరిలో కొందరు అచ్చం సదరు హీరోలు, హీరోయిన్ల మాదిరిగానే అప్ డేట్స్ ఇస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఫేక్ అకౌంట్లతో అమాయకులకు గాలం వేస్తున్నారు. అందినకాడికి దండుకుంటున్నారు. తాజాగా మహేష్ బాబు, నమ్రత దంపతుల ముద్దుల కూతురు సితార పేరుతోనూ మోసాలకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు. ఈ విషయం తెలియడంతో మహేష్ ఫ్యామిలీ అలర్ట్ అయ్యింది.
సోషల్ మీడియాలో సితార బాగా యాక్టివ్
నిజానికి మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. తల్లి నమ్రతతో కలిసి నెట్టింట బాగా సందడి చేస్తుంది. సితార తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. హాలీడే టిప్స్, పండగలు, పబ్బాలకు స్పెషల్ ఫోటో షూట్స్ లో అందరినీ అలరిస్తుంది. చక్కటి డ్యాన్సులతో ఆకట్టుకుంటుంది. మహేష్ ముద్దుల కూతురికి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజిలో ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే, గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో సితార పేరిట నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారట. ఈ విషయం నమ్రత దృష్టికి రావడంతో తాజాగా ఆమె పోలీసులను ఆశ్రయించారు.
సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నమ్రత
సితార పేరుతో ఫేక్ లింక్స్ పోస్ట్ చేసి, వీటిని క్లిక్ చేస్తే చాలా ప్రయోజనాలు పొందుతారు అంటూ కొంతమంది కేటుగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారట. సితార పేరుతో ఈ లింక్స్ రావడంతో నెటిజన్లు ఈజీగా నమ్ముతున్నారు. ఆ లింక్స్ క్లిక్ చేసి తమ అకౌంట్లలోని డబ్బును పోగొట్టుకుంటున్నారట. ఈ విషయం తెలిసిన నమ్రత, వెంటనే మదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. తన కూతురు పేరుతో అమాయకులను మోసం చేస్తున్న నేరస్తులను పట్టుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. సితారకు అఫీషియల్ ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ఉందని నమ్రత వెల్లడించారు. వెరిఫైడ్ బ్లూ టిక్ ఉన్నది మాత్రమే సితార అకౌంట్ అని గుర్తుంచుకోవాలన్నారు. మిగిలిన ఏ అకౌంట్స్ కూడా సితారవి కాదని తెలిపారు. సితార పేరుతో ఉన్న నకిలీ అకౌంట్స్ ను నమ్మి మోసపోకూడదని సూచించారు.
View this post on Instagram
‘సర్కారు వారి పాట’లో కనిపించిన సితార
ఇక సితార ‘సర్కారు వారి పాట’ చిత్రంలో ఇప్పటికే కనిపించింది. ఓ పాటలో ఆమె తళుక్కున మెరిసింది. అటు ఓ జ్యువెలరీ సంస్థకు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. చిన్న వయసులోనే ప్రముఖ నగల సంస్థకు ప్రచారకర్తగా నియామకం కావడం పట్ల మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల మాదిరిగానే ఆమె కూడా సినిమా రంగంలో రాణించాలని ఆకాంక్షించారు.
Read Also: ఓటీటీలోకి 'నా సామిరంగ'- స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పటి నుంచంటే..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

