అన్వేషించండి
Satyabhama Serial February 20th Episode Highlights: మైత్రి ఈవిల్ ప్లాన్ .. క్రిష్ పై భైరవి విశ్వరూపం.. కథ నడిపిస్తోన్న సంజయ్ - సత్యభామ ఫిబ్రవరి 20 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Serial February 20th Episode : సంజయ్ తన కొడుకే అని భైరవికి నిజం తెలిసిపోయింది. మరోవైపు మహదేవయ్య కుట్రలు సాగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....

Satyabhama Serial February 20th Episode Highlights
1/9

హర్ష అనాధాశ్రమం గురించి మాట్లాడేందుకు మైత్రి ఇంటికి వెళతాడు. రేపు ముంబై వెళ్లి అట్నుంచి అటే ఫారెన్ వెళ్లిపోతాను. ఈ రోజు నీతో స్పెండ్ చేసే నైట్ ఎప్పటికీ గుర్తుండిపోవాలి అంటుంది మైత్రి. ఇంట్లో నందిని వెయిట్ చేస్తుంటుంది అంటాడు హర్ష.
2/9

నిన్ను ప్రేమించినందుకు చిన్న బహుమతి కూడా ఇవ్వలేవా అని దొంగఏడుపు నటిస్తుంది. సరే డిన్నర్ చేద్దాం అంటాడు. హర్ష తాగిన కూల్ డ్రింక్ లో ట్యాబ్లెట్స్ కలిపేస్తుంది. ఆ తర్వాత హర్ష మత్తులోకి వెళ్లిపోయిన తర్వాత బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లి క్లోజ్ గా మూవ్ అవుతూ పిక్స్ తీస్తుంది
3/9

భైరవి అందర్నీ భోజనానికి పిలుస్తుంది. రేయ్ చిన్నా నీకు అప్పగించిన పని ఏమైందని రుద్ర అడుగుతాడు. పేదల ల్యాండ్ మనం కబ్జా చేశాం అది తిరిగి పేదలకు పంచేయమని సైన్ చేసి వచ్చానంటాడు. బాపు తరపున మాట్లాడేందుకు నీకేం హక్కుందంటూ చెలరేగిపోతాడు రుద్ర. ఇంట్లో నీకెంత హక్కుందో నాక్కూడా అంతే హక్కు ఉందంటాడు క్రిష్
4/9

సత్య భోజనం వడ్డిస్తుంటే నీ మొగుడు ఏం ఘనకార్యం చేసి వచ్చాడని వడ్డిస్తున్నావ్..ఇంటి పరువు తీశాడు అంటూ భైరవి నోరు పారేసుకుంటుంది. ఏమైనా అడిగితే నా గల్ల పట్టుకుంటాడు అంటూ మహదేవయ్య కూడా ఫైర్ అవుతాడు. నేను నీ కొడుకుని బాపూ అలా ఎందుకు చేస్తానని క్రిష్ అంటాడు.
5/9

నువ్వు నిజంగా మహదేవయ్య కొడుకువే అయితే ఇలా చేయవంటూ భైరవి మాట విసిరేస్తుంది. ఇదికదా కావాల్సింది అంటూ సంజయ్ ఎంజాయ్ చేస్తుంటాడు. అమ్మా ఎందుకిలా మాట్లాడుతున్నావ్ అని క్రిష్ అంటాడు. జరిగింది ఒకటి అయితే అంతా ఇలా మాట్లాడుతున్నారేంటని జయమ్మ అడుగుతుంది
6/9

అసలు చిన్నాని మా కొడుకు అనుకోవడం లేదని భైరవి అనగానే మహదేవయ్య వారిస్తాడు. మాట్లాడనివ్వండి మావయ్య అత్తయ్య మనసులో ఏముందో కనుక్కోనివ్వండి అంటుంది సత్య.
7/9

మీ అమ్మ మాటలు పట్టించుకోవద్దు రా తిందువుగానివి అని మహదేవయ్య పిలుస్తాడు.. క్రిష్ అంతా గుర్తుచేసుకుని కుండీ తన్నేస్తాడు. నన్ను మార్చాలని చూడకు సత్యా నా బతుకు నన్ను బతకనివ్వు అని ఫైర్ అవుతాడు.
8/9

నువ్వు అంత తప్పు చేయలేదు..నిన్ను మారమని చెప్పింది నాకోసం వాళ్లకోసం ఆలోచించకు అంటుంది. కలసి జీవితాంతం బతకాల్సింది మనం మనకి ఏది మంచో ఏది చెడో మనమే నిర్ణయించుకోవాలి
9/9

సత్యభామ ఫిబ్రవరి 21 ఎపిసోడ్ లో నర్సింహంను చంపింది రుద్రే అని ఓ ఫ్రెండ్ క్రిష్ కి కాల్ చేసి చెబుతాడు. రుద్రని చితకబాదుతాడు క్రిష్. భైరవి అడ్డుకుని రుద్రని సపోర్ట్ చేస్తుంది. ఇంట్లో అందరకీ చిన్నాపై నమ్మకం పోయిందంటూ ఫైర్ అవుతుంది
Published at : 20 Feb 2025 09:40 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
క్రైమ్
ఐపీఎల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion