అన్వేషించండి

Naa Sami Ranga OTT: ఓటీటీలోకి 'నా సామిరంగ'- స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పటి నుంచంటే..

నాగార్జున హీరోగా నటించిన ‘నా సామిరంగ’ ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా త్వరలో డిజిటల్ రిలీజ్ కాబోతున్నట్లు డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ అధికారికంగా వెల్లడించింది.

Nagarjuna's Naa Saami Ranga Locks OTT Release Date: టాలీవుడ్ స్టార్ హీరో  అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో రూపొందిన రీసెంట్ మూవీ ‘నా సామిరంగ’. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదల అయ్యింది. ఈ చిత్రంతో పాటు 'హనుమాన్‌', 'గుంటూరు కారం', 'సైంధవ' సినిమాలు సైతం రిలీజ్ అయ్యాయి. అయినప్పటికీ ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. వసూళ్ల పరంగానూ సత్తా చాటింది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ  యాక్షన్ ఎంటర్‌టైనర్‌ కు విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఫిబ్రవరి 17 నుంచి ‘నా సామిరంగ’ ఓటీటీ స్ట్రీమింగ్

ఈ నేపథ్యంలో ‘నా సామిరంగ’ ఓటీటీ విడుదలకు సంబంధించి ఆడియెన్స్ కు గుడ్ న్యూస్ అందింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను డిస్నీ+ హాట్‍ స్టార్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ మూవీ హక్కులను ఫ్యాన్సీ అమౌంట్ కు  డిస్నీ+ హాట్‍ స్టార్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమాకు డిజిటల్ రిలీపై కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 17 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించింది. ఈ మేరకు నాగార్జున మీసం తిప్పే చిన్న క్లిప్ ను సదరు ఓటీటీ సంస్థ షేర్ చేసింది.

నాగార్జునకు కలిసి వచ్చిన సంక్రాంతి సెంటిమెంట్

1980 గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు విజయ్ బిన్నీ. ఈ చిత్రంలో నాగార్జున ఊర మాస్ గెటప్, అంతకు మించిన మాస్ యాక్షన్, అదిరిపోయే డైలాగుతు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తన సినిమాలకు బాగా కలిసి వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు నాగార్జున. ఆయన సెంటిమెంట్ ఈ సారి కూడా వర్కౌట్ అయ్యింది. పెద్ద చిత్రాలతో గట్టి పోటీ ఎదురైనా ఈ సినిమా చక్కటి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో  నాగార్జున సరసన అషికా రంగనాథ్ హీరోయిన్‍గా నటించింది. యువ నటులు అల్లరి నరేష్, రాజ్ తరుణ్  కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రంలో నరేష్ కు జోడీగా మిర్నా మీనన్, రాజ్ తరుణ్ కు జోడీగా రుక్సాన్ థిల్లాన్ నటించింది.

శేఖర్ కమ్ముల, ధనుష్ చిత్రంలో నటిస్తున్న నాగ్

‘నా సామిరంగ’ సినిమా విజయం తర్వాత నాగార్జున ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు అనే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. కానీ, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నాగార్జున కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ సినిమాలో ఆయన అతిథి పాత్రలో కనిపించబోతున్నారా? లేదంటే పూర్తి స్థాయిలో నటిస్తున్నారా? అనే విషయంపై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.  

Read Also: మెయిద్దీన్ భాయ్ కి షాక్! రజనీ మూవీకి మరీ ఇంత తక్కువ ఓపెనింగ్సా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Modi congratulates Pawan Kalyan: కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
YSRCP Latest News:
"ఇరుసుమండ బ్లో అవుట్ వెనుక కుట్ర- కోట్లు చేతులు మారాయి" వైసీపీ సంచలన ఆరోపణలు 
Bhogi Mantalu 2026: ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
Digital Arrest Scams: డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం
డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం

వీడియోలు

Anil Ravipudi on Social Media Trolls | మీమర్స్ ట్రోల్స్ వేసుకుంటే వేసుకోండి..నేను ఎంజాయ్ చేస్తా |ABP
Rohit Sharma Records Ind vs NZ ODI | క్రిస్ గేల్ రికార్డును అధిగమించిన హిట్‌మ్యాన్
RCB vs UP WPL 2026 | ఆర్సీబీ సూపర్ విక్టరీ
Washington Sundar Ruled Out | గాయంతో బాధ‌ప‌డుతున్న వాషింగ్ట‌న్ సుంద‌ర్
Devdutt Padikkal record in Vijay Hazare Trophy | దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi congratulates Pawan Kalyan: కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
YSRCP Latest News:
"ఇరుసుమండ బ్లో అవుట్ వెనుక కుట్ర- కోట్లు చేతులు మారాయి" వైసీపీ సంచలన ఆరోపణలు 
Bhogi Mantalu 2026: ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
Digital Arrest Scams: డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం
డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం
Nara Vari Palle Sankranti: ముఖ్యమంత్రి కుటుంబం అంతా నారా వారి పల్లెలోనే - హుషారుగా సంక్రాంతి సంబరాలు !
ముఖ్యమంత్రి కుటుంబం అంతా నారా వారి పల్లెలోనే - హుషారుగా సంక్రాంతి సంబరాలు !
Adilabad Latest News: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16న పర్యటించనున్న ముఖ్యమంత్రి! సదర్మాట్ బ్యారేజి, చనాక-కోరాట ప్రాజెక్టు  ప్రారంభోత్సవం!
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16న పర్యటించనున్న ముఖ్యమంత్రి! సదర్మాట్ బ్యారేజి, చనాక-కోరాట ప్రాజెక్టు  ప్రారంభోత్సవం!
Jaggannathota Prabhala Teertham : సంక్రాంతి సంబరాలకు గోదావరి వెళ్తున్నారా? ఈ వేడుక చూడకుండా అసలు రావద్దు!
సంక్రాంతి సంబరాలకు గోదావరి వెళ్తున్నారా? ఈ వేడుక చూడకుండా అసలు రావద్దు!
PM Modi New Office: త్వరలోనే కొత్త ఆఫీస్‌లోకి ప్రధానమంత్రి మోదీ! ఇంటి చిరునామా కూడా మారుతుందా?
త్వరలోనే కొత్త ఆఫీస్‌లోకి ప్రధానమంత్రి మోదీ! ఇంటి చిరునామా కూడా మారుతుందా?
Embed widget