అన్వేషించండి

Zimbabwe vs West Indies T20 World Cup | వాంఖడేలో వెస్టిండీస్ విధ్వంసం | ABP Desam

ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియం వెస్టిండీస్ పవర్‌ హిట్టింగ్‌కు వేదికైంది. టీ20 ప్రపంచకప్ 2026 ( T20 World Cup 2026 ) సూపర్-8లో భాగంగా జరిగిన మ్యాచ్ లో జింబాబ్వేపై వెస్టిండీస్ ( Zimbabwe vs West Indies ) బ్యాటర్లు విరుచుకుపడ్డారు. కేవలం 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల స్కోరు సాధించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా షిమ్రాన్ హెట్మెయర్ ( Shimron Hetmyer ) 34 బంతుల్లోనే 85 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. 

ఈ మ్యాచ్‌లో ఎన్నో కొత్త రికార్డులు నమోదు అయ్యాయి. గతంలో 2023లో జింబాబ్వేపై భారత్ చేసిన 234 పరుగులే అత్యధికం. కానీ నేడు విండీస్ ఆ రికార్డును బద్దలు కొట్టి, ఏకంగా 254 పరుగులు సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు మొత్తం 19 సిక్సర్లు బాదారు. దాంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన నెదర్లాండ్స్ రికార్డును వెస్టిండీస్ సమం చేసింది.

టీ20 ప్రపంచకప్ చరిత్రలో 260 పరుగులతో శ్రీలంక మొదటి స్థానంలో ఉండగా.. ఇప్పుడు వెస్టిండీస్ 254 పరుగులతో రెండో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. 30 కంటే ఎక్కువ బంతులు ఆడి, 250 స్ట్రైక్ రేట్‌తో మెరిసిన ఏకైక బ్యాటర్‌గా హెట్మెయర్ నిలిచాడు. ఆరోన్ జోన్స్ పేరిట ఉన్న రికార్డును హెట్మెయర్ అధిగమించాడు.

వెస్టిండీస్ తరపున టీ20 ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ రికార్డు ఇప్పటివరకు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. కానీ హెట్మెయర్ కేవలం 19 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసి ఆ రికార్డును చెరిపివేశాడు. ఈ భారీ స్కోరుతో వెస్టిండీస్ సెమీస్ రేసులో ఇతర జట్లకు గట్టి హెచ్చరికలు పంపింది అనే చెప్పాలి.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Indian Cricket Coaching Changes: కోచింగ్ స్టాఫ్ త‌ర్వాత‌ హెడ్ ఫిజియో కమలేష్ పై వేళాడుతున్న క‌త్తి, రివ్యూ చేయ‌నున్న బీసీసీఐ
టీమిండియా కోచింగ్ స్టాఫ్ త‌ర్వాత‌ హెడ్ ఫిజియో కమలేష్ పై వేళాడుతున్న క‌త్తి, రివ్యూ చేయ‌నున్న బీసీసీఐ
WFI Case Verdict: బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కేసుపై బిగ్ ట్విస్ట్ , అక్కడ తేల్చుకుంటామన్న వినేష్ ఫోగట్ !
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కేసుపై బిగ్ ట్విస్ట్ , అక్కడ తేల్చుకుంటామన్న వినేష్ ఫోగట్ !
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Vishnu Manchu: కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
MBBS Fees in India: MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!
Embed widget