Sree Vishnu: శ్రీ విష్ణు జోడీగా మోగ్లీ హీరోయిన్... ఈసారి కామెడీతో పాటు థ్రిల్లూ
Sree Vishnu New Movie: శ్రీవిష్ణు మాంచి సక్సెస్ ట్రాక్ లో ఉన్నారు. కామెడీతో కూడిన కథలతో వరుస హిట్స్ అందుకుంటున్నారు. ఇప్పుడు ఆయన తనకు సూపర్ హిట్ ఇచ్చిన ఓ దర్శకుడికి మరో ఛాన్స్ ఇచ్చారు.

యంగ్ హీరోలలో శ్రీ విష్ణు (Sree Vishnu)కు ప్రజెంట్ ఉన్న సక్సెస్ ట్రాక్ మరొక హీరోకి లేదు. 'సామజవరగమన' నుంచి 'సింగిల్' వరకు ఆయన చేసిన ప్రతి సినిమా హిట్టే. మధ్యలో 'స్వాగ్' కొంత మందిని డిజప్పాయింట్ చేసినా అది కమర్షియల్ సక్సెస్. ఇప్పుడు ఆయన తనకు సూపర్ హిట్ ఇచ్చిన ఓ దర్శకుడితో మరొక సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.
రామ్ అబ్బరాజు దర్శకత్వంలో...
శ్రీ విష్ణు కథానాయకుడిగా నటించిన 'సామజవరగమన'తో రామ్ అబ్బరాజు (Ram Abbaraju) దర్శకుడిగా పరిచయం అయ్యారు. అది హిట్టు. ఆ సినిమా తర్వాత సంక్రాంతి 2026కి విడుదలైన 'నారి నారి నడుమ మురారి'తో మరో విజయం అందుకున్నారు రామ్ అబ్బరాజు. ఆ సినిమాలో అతిథి పాత్రలో సందడి చేశారు శ్రీ విష్ణు.
View this post on Instagram
ఇప్పుడు శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో మరొక సినిమా రానుంది. గత ఏడాది దసరాకు పూజతో సినిమాను అనౌన్స్ చేశారు. లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే... ఈసారి కామెడీతో పాటు థ్రిల్ కూడా ఇవ్వడానికి రెడీ అయ్యారు. డార్క్ కామెడీ థ్రిల్లర్ స్క్రిప్ట్ లాక్ చేశారు శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయనుంది.
View this post on Instagram
శ్రీ విష్ణు సరసన సాక్షి మదోల్కార్?
ప్రముఖ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల కథానాయకుడిగా నటించిన 'మోగ్లీ' గుర్తు ఉందా? ఆ సినిమాతో సాక్షి మదోల్కార్ కథానాయికగా పరిచయం అయ్యారు. ఇప్పుడు శ్రీ విష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించనున్న సినిమాలో ఆ అమ్మాయి కథానాయికగా నటించనున్నట్టు టాక్. ఇందులో సుదర్శన్, 'వెన్నెల' కిశోర్ ఇతర కీలక పాత్రలు పోషించనున్నారు. త్వరలో ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.
ఫిబ్రవరి 27న శ్రీ విష్ణు హీరోగా నటించిన 'విష్ణు విన్యాసం' థియేటర్లలోకి వస్తోంది. ఆ తర్వాత మార్చి 6న 'మృత్యుంజయ' విడుదల కానుంది. అది కాకుండా 'కామ్రేడ్ కళ్యాణ్' అని మరొక సినిమా చేస్తున్నారు.























