అన్వేషించండి

Shivani Nagaram: తిరుమల స్వామివారి దర్శనం... 15 మినిట్స్‌ వివాదం... క్లారిటీ ఇచ్చిన శివానీ నాగారం

Shivani Nagaram Tirumala Controversy: తిరుమల దేవస్థానంలో శ్రీవారిని 15 నిమిషాల పాటు దర్శనం చేసుకున్నానని శివానీ నాగారం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రాగా... వివరణ ఇచ్చారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏడు కొండల వెంకటేశ్వర స్వామి దర్శనం కొన్ని సెకన్లు దొరికితే చాలు అని ఎంతో మంది వెళ్తారు. ఒకట్రెండు నిమిషాల దర్శనంతో సంతృప్తి చెందే భక్తులు ఎంతో మంది. అంతకు మించి స్వామివారి ముందు నిలబడే అవకాశం రాదు. అటువంటిది పదిహేను నిమిషాల పాటు తనకు స్వామివారి దర్శన భాగ్యం కలిగిందని కథానాయిక శివానీ నాగారం చెప్పారు. ఆమె వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో ఆవిడ వివరణ ఇచ్చారు.

పదివేల రూపాయల టికెట్ కొన్నాను...
15 నిమిషాలు ఎవరూ టచ్ చేయలేదని కాదు!
'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'తో కథానాయికగా పరిచయమైన తెలుగు అమ్మాయి శివానీ నాగారం. 'లిటిల్ హార్ట్స్'తో హిట్ అందుకున్నారు. సుహాస్ జంటగా శివానీ నటించిన రెండో సినిమా 'హే బల్‌వంత్'. తాజాగా విడుదలైంది. ఈ నేపథ్యంలో శివానీ నాగారం ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పదిహేను నిమిషాల పాటు వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నానని చెప్పారు. సోషల్ మీడియాలో ఆమె మాటలను ట్రోల్ చేశారు.

Also ReadVirosh Wedding: విజయ్ - రష్మిక పెళ్లికి ఈషా రెబ్బా... ఆవిణ్ణి ఎందుకు పిలిచారు? ఎవరి కోటాలో వెళ్లారో తెలుసా?

"అందరికీ నమస్కారం... నా పేరు శివాని నాగారం. నేను ఒక ఇంటర్వ్యూలో సక్సెస్ నుంచి చైల్డ్ హుడ్ జర్నీ, డివోషనల్ & స్పిరిచువల్ జర్నీ షేర్ చేసుకున్నా. ఆ క్రమంలో తిరుపతి గురించి మాట్లాడాను. నా 15 మినిట్స్ దర్శనం అనేది కొంచెం హైలైట్ అవుతోంది. అందుకు క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. గత ఏడాది (2025) అక్టోబర్‌లో ఎయిర్ పోర్ట్‌లో 10,500 శ్రీవాణి దర్శనం టికెట్ తీసుకున్నాం. నేను, మా అమ్మ లైనులో నిలబడి టికెట్ తీసుకున్నామండి. మా ఆధార్ కార్డులు అవన్నీ ఇచ్చాం. ఆ టికెట్స్ తీసుకున్నాక దర్శనం జరిగింది. ఆ 15 మినిట్స్ అని చెప్పడంలో నా మెయిన్ మోటివ్ ఏమిటంటే... లైనులో బిగినింగ్ నుంచి స్వామి వారి దగ్గరకు వెళ్ళినంత వరకు కొంచెం కొంచెం స్వామి వారు కనిపిస్తూ ఉంటారు. అది 15 మినిట్స్ అని నేను అందాజాగా ఫీలయ్యి... నేను 15 మినిట్స్ అన్నాను తప్ప ఆ పదిహేను నిమిషాలు నన్ను ఎవరు టచ్ చేయలేదని కాదు'' అని శివానీ నాగారం తెలిపారు.

Also ReadBalakrishna - Venkatesh: బాలయ్య vs వెంకీ... రెండు సినిమాల కథ ఒక్కటే, రిలీజ్ డే కూడా... బాక్సాఫీస్‌లో హిట్టు కొట్టిందెవరు?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram)

గతంలో స్వామివారి దర్శనం కోసం వెళ్ళినప్పుడు ఐదారు నిమిషాలు మాత్రమే భాగ్యం కలిగిందని శివానీ నాగారం చెప్పారు. ''ఇంతకు ముందు కూడా నేను సినిమాలు చేశాక... 300 రూపాయల సర్వ దర్శనం టికెట్ తీసుకొని మా ఫ్యామిలీతో వెళ్ళా. అప్పుడు కేవలం ఐదారు సెకన్లు మాత్రమే స్వామి వారిని దర్శించుకున్నా. నా జీవితంలో మొదటిసారి... 13 ఏళ్ళ తర్వాత స్వామి వారిని అంత దగ్గరగా చూశా. అది నేను చాలా హ్యాపీగా ఫీలయ్యి ఎక్సైట్మెంట్ తో చాలా షేర్ చేసుకున్నా. అయితే అది కొంచెం వేరే విధంగా వెళుతోంది. నాకు మాత్రమే కాదు... శ్రీవాణి దర్శనం టికెట్ తీసుకుని ఎవరు వెళ్లినా స్వామి వారి దర్శనం దగ్గరగా, చాలా మంచిగా జరుగుతుంది. దీనిపైన క్లారిటీ ఇవ్వడం బాధ్యతగా అనిపించి ఈ వీడియో చేశా'' అని తన టికెట్స్ చూపించారు శివానీ నాగారం.

Also ReadNTR - Ravi Teja: ర‌వితేజతో అనౌన్స్ చేశారు... ఎన్టీఆర్‌తో సినిమా చేశారు... కెరీర్ టర్నింగ్ పాయింట్ సినిమా బ్యాక్‌స్టోరీ తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget