David Miller India vs South Africa T20WC | టీమిండియా ఓటమికి మిల్లర్ ప్లాన్ ఇదే | ABP Desam
అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ సూపర్-8 పోరులో టీమిండియాకు దక్షిణాఫ్రికా షాక్ ఇచ్చింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన మిల్లర్.. మ్యాచ్ అనంతరం భారతను ఓడించడానికి తాము ప్లాన్ చేసిన స్ట్రాటజీని బయటపెట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ ( David Miller ), డెవాల్డ్ బ్రెవిస్‌తో ( Dewald Brevis ) కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆపై గేర్ మార్చి భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. మిల్లర్ కేవలం 35 బంతుల్లోనే 63 పరుగులు సాధించి జట్టుకు 187 పరుగుల భారీ స్కోరును అందించారు.
మిల్లర్ మాట్లాడుతూ.. "భారత్ చాలా పటిష్టమైన జట్టు. వారిని ఓడించడం ఎప్పుడూ సవాలే. అయితే మేము మైదానంలో మా పరిమితులను దాటకుండా, మా ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి ఆడాము. ఐపీఎల్ వల్ల భారత బౌలర్ల బలాలు, బలహీనతలు మాకు ముందే తెలుసు. ఒత్తిడి పెరిగినప్పుడు ప్రశాంతంగా ఉండి మా వ్యూహాలను అమలు చేయడం వల్లే ఈ విజయం సాధ్యమైంది" అని చెప్పుకొచ్చారు. 188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా, సఫారీ బౌలర్ల ధాటికి 111 పరుగులకే కుప్పకూలింది. 76 పరుగుల భారీ తేడాతో ఓటమిని ఎదుర్కొంది.























