Lal Salaam Box Office Collection Day 1: మెయిద్దీన్ భాయ్ కి షాక్! రజనీ మూవీకి మరీ ఇంత తక్కువ ఓపెనింగ్సా?
భారీ అంచనాల నడుమ విడుదలైన ‘లాల్ సలామ్’ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. వసూళ్ల పరంగా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. రజనీ చిత్రానికి ఇంత తక్కువ ఓపెనింగ్స్ రావడంపై అందరూ షాక్ అవుతున్నారు.

Lal Salaam Box Office Collection Update:: ‘జైలర్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం ‘లాల్ సలామ్’. హిందూ, ముస్లిం ఐక్యత, క్రికెట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు, రజనీ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్వకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్నినిర్మించారు. భారీ అంచనాల ఫిబ్రవరి 9న నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
బాక్సాఫీస్ దగ్గర ‘లాల్ సలామ్’ బోల్తా
రజనీ సినిమా అంటే సినిమా అభిమానుల నుంచి ఓ రేంజిలో ఆదరణ ఉంటుంది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తుంది. కానీ, ‘లాల్ సలామ్’ విషయంలో చిత్రబృందానికి షాక్ తగిలింది. గత ఆరేళ్లలో సింగిల్ డిజిట్ కలెక్షన్ సాధించిన చిత్రంగా నిలిచింది. సినిమాపై తొలి నుంచి భారీగా అంచనాలు ఉన్నా, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేయలేకపోయింది. 2018లో వచ్చిన ‘కాలా’ తర్వాత మళ్లీ ‘లాల్ సలామ్’ స్వల్ప ఓపెనింగ్స్ సాధించింది. రజనీ ‘లాల్ సలామ్’ మూవీ తొలి రోజు కేవలం రూ. 4.30 కోట్లు మాత్రమే వసూళు చేసి, అందరినీ షాక్ కి గురి చేసింది.
తెలుగులో ఏకంగా ‘లాల్ సలామ్’ షోలు క్యాన్సిల్!
'లాల్ సలామ్' చిత్రంలో మెయినుద్దీన్ భాయ్ అనే పవర్ ఫుల్ పాత్రలో నటించారు రజనీ కాంత్. కాకపోతే ఇది స్పెషల్ రోల్. కొద్దిసేపే తెర మీద కనిపించారు. అయినా 'జైలర్' లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత రజనీ నటిస్తున్న సినిమా కావడంతో, అందరిలో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. తమిళ్ లో ఎలా ఉన్నా, తెలుగులో మాత్రం ఏమాత్రం బజ్ లేకుండా పోయింది. దీనికి తగ్గట్టుగానే రిలీజ్ రోజు బుకింగ్స్ చాలా పూర్ గా ఉన్నాయి. దీంతో కొన్ని ఏరియాల్లో చాలా షోలో క్యాన్సిల్ అయ్యాయి. నిజానికి 'లాల్ సలాం' టీమ్ తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. దీనికి తోడు రవితేజ నటించిన 'ఈగల్' సినిమా కూడా అదే రోజు విడుదలయ్యింది. అందుకే జనాలు రజనీ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
గత 10 ఏండ్లలో రజనీకాంత్ సినిమాల ఓపెనింగ్స్:
లాల్ సలామ్ (2024): రూ 4.30 కోట్లు
జైలర్ (2023): రూ. 48.35 కోట్లు
అన్నాత్తే (2021): రూ 29.9 కోట్లు
దర్బార్ (2020): రూ. 30.80 కోట్లు
పేట (2019): రూ. 19 కోట్లు
2.0 (2018): రూ. 60.25 కోట్లు
కాలా (2018): రూ 0.85 కోట్లు
కబాలి (2016): రూ. 48 కోట్లు
లింగ (2014): రూ 16 కోట్లు
సుమారు ఏడేళ్ల తర్వాత ఐశ్వర్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో నటించారు. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. మరోవైపు 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ‘వెట్టయాన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో కొనసాగింది. దీని తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోనూ ఓ మూవీ చేయబోతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

