అన్వేషించండి

Devara Movie: ‘దేవర’ మూవీలో మరో బ్యూటీ, ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?

Devara Movie: ‘దేవర’ మూవీ కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.

Devara Movie: ప్రతిష్టాత్మక ‘RRR’ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న పెద్ద ప్రాజెక్ట్ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై సినీ అభిమానులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

‘దేవర’ మూవీలో మరో బ్యూటీ

తాజాగా ‘దేవర’ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రంలో  బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దివంగత అతిలోక సుందరి శ్రీదేవి కూతురు ఈ చిత్రంతోనే తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెడుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో మరో హీరోయిన్ కీలక పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హిందీ, తమిళ, మరాఠీ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించిన శృతి మరాఠే ఈ చిత్రంలో నటిస్తుందట. ‘దేవర’లో ఎన్టీఆర్ డ్యుయెల్ రోల్ చేస్తున్నారు. ఒక పాత్రకు జాన్వీ కపూర్ ఓకే కాగా, రెండో పాత్రకు శృతిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.     

‘దేవర’ సినిమా రిలీజ్ వాయిదా

అటు ‘దేవర’ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదల అవుతుందని అందరూ భావిచారు. కానీ, ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. రీసెంట్ గా ఈ సినిమాలో విలన్ రోల్ పోషిస్తున్న సైఫ్ అలీ ఖాన్ గాయపడ్డారు. ఆయన పార్ట్ షూటింగ్ పెండింగ్ లోనే ఉంది. అటు ఈ సినిమాకు పాటలు, నేపథ్య సంగీతాన్ని అందించేందుకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవి చందర్ చాలా టైమ్ తీసుకుంటున్నారట. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ లోనే జరిగే అవకాశం ఉంది. మొత్తంగా పలు కారణాలతో ఈ సినిమా సమ్మర్ బరి నుంచి తప్పుకుంది.

రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ‘దేవర’

‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్‌ కాంబోలో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా గురించి జాన్వీ రీసెంట్ గా కీలక విషయాలు వెల్లడించింది. తాను ఇప్పటి వరకు నటించిన సినిమాలు ఒక ఎత్తు, ‘దేవర’ సినిమా మరోఎత్తు అని చెప్పుకొచ్చింది. ఈ సినిమాతో తనలోని నటిని పూర్తి స్థాయిలో చూడబోతున్నారని తెలిపింది. భారతదేశంలోని తీర ప్రాంతాల కథ నేపథ్యంలో రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది.  ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

Read Also: ‘12th ఫెయిల్‌’కు అరుదైన ఘనత - ఆ జాబితాలో చేరిన ఏకైక ఇండియన్ మూవీగా గుర్తింపు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tragedy in AP: ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
Indian Railway Fare Hike: పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
Sankranti Holidays for Schools: విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Vajpayee statue in Amaravati: వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం

వీడియోలు

World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20
Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tragedy in AP: ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
Indian Railway Fare Hike: పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
Sankranti Holidays for Schools: విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Vajpayee statue in Amaravati: వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
Samantha Raj Nidimoru: భర్త రాజ్ నిడిమోరుతో సమంత... ఈ ఫోటోలు ఇంతకు ముందుకు చూసి ఉండరు
భర్త రాజ్ నిడిమోరుతో సమంత... ఈ ఫోటోలు ఇంతకు ముందుకు చూసి ఉండరు
Vrusshabha Box Office Collection Day 1: వృషభ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ - మోహన్ లాల్ మ్యాజిక్ పనిచేయలేదు... మొదటి రోజు మరీ ఇంత తక్కువా?
వృషభ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ - మోహన్ లాల్ మ్యాజిక్ పనిచేయలేదు... మొదటి రోజు మరీ ఇంత తక్కువా?
Nizamabad husband: భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Embed widget