అన్వేషించండి

ఎన్టీఆర్‌ 'వార్‌ 2' ఫస్ట్‌లుక్‌ అప్‌డేట్‌?, బాలీవుడ్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

‘వేట్టయాన్‌’ సెట్స్ లో సూపర్ స్టార్స్ హగ్

Amitabh Bachchan- Rajinikanth Hugging: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్ కాంబో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వేట్టయాన్‌’. ‘జైలర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రజనీకాంత్, ‘జై భీమ్’ మూవీతో సూపర్ సక్సెస్ సాధించిన జ్ఞానవేల్ కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ లెజెండరీ హీరో అమిత్ బచ్చన్, మలయాళీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, టాలీవుడ్ యాక్టర్ రానా, మంజు వారియర్, రితికా సింగ్, దసరా విజయన్ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంత్ కెరీర్ లో 170వ సినిమాగా ఈ చిత్రం రూపొందుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఎన్టీఆర్ 'వార్‌ 2' ఫస్ట్‌లుక్‌

Jr NTR War 2 First Look Update?: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ - హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌గా 'వార్‌ 2'మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎన్టీఆర్‌ ఈ మూవీ షూటింగ్‌లోనూ పాల్గొన్నాడు. ఇప్పటికి వార్‌ 2 సెట్‌ నుంచి ఎన్టీఆర్‌ లుక్‌ లీక్‌ అయ్యంది. దానికి మంచి రెస్పాన్స్‌ కూడా వచ్చింది. వార్ 2 అంటేనే  హై వోల్టేజ్‌ యాక్షన్‌. ఈ యాక్షన్‌ మూవీతో తారక్‌ లుక్‌ ఎలా ఉంటుందా? చూసేందుకు ఫ్యాన్స అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ని ఖుషి చేసే ఓ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. వార్‌ 2లోని ఎన్టీఆర్‌ లుక్‌ అప్‌డేట్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

 పాకిస్తాన్ నుంచి ఎంతో ప్రేమను పొందుతున్నా

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాప్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ. ఊహకు అందని సరికొత్త కథాంశాలతో సినిమాలు తెరకెక్కించడంలో తనకు తానే సాటి. ఆయన దర్శకత్వం వహించి సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి. ఈ దిగ్గజ దర్శకుడు తెరకెక్కించిన తాజా వెబ్ సిరీస్ ‘హీరామండి: ది డైమండ్ బజార్’.   తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా భన్సాలీ ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తెరకెక్కించిన ‘హీరామండి: ది డైమండ్ బజార్’ కథ పాక్ లోని పంజాబ్ బేస్ గా కొనసాగుతుందన్నారు. ఈ సిరీస్ చూసిన తర్వాత పాకిస్తాన్ నుంచి తనకు ఎంతో ప్రేమ లభిస్తుందని వెల్లడించారు. అక్కడి ప్రజలు ఈ వెబ్ సిరీస్ చూసేందుకు ఎంతో ఇష్టపడుతున్నారని చెప్పారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

బెల్లంకొండకి జోడీగా ‘డెవిల్’ బ్యూటీ 

Samyuktha Menon: బ్యాక్ టూ బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్న మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్.. అనతి కాలంలోనే తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. టాలీవుడ్ లక్కీ చార్మ్ గా పిలవబడుతోన్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు కుర్ర హీరోలకు ఫస్ట్ ఛాయిస్ గా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పటికే శర్వానంద్‌, నిఖిల్ లాంటి యంగ్ హీరోలతో రొమాన్స్ చేస్తున్న సంయుక్త.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన హీరోయిన్ గా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

'కింగ్' చుట్టూ ఏపీ రాజకీయాలు 

Akkineni Nagarjuna: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫీవర్ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో లోక్‌ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. తెలంగాణలో లోక్‌ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ తమ ప్రచార అస్త్రాలను సంధిస్తున్నారు. పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఈసారి ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొంటున్నారు. అనుకూల పార్టీకి మద్దతు ప్రకటిస్తూ, తమ అభ్యర్ధులను గెలిపించేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున చుట్టూ కొన్ని ఫేక్ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget